155 crore for Omni Hospitals

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఓమ్నీ హాస్పిటల్స్‌ పేరుతో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఇన్‌కార్‌ హెల్త్‌కేర్‌ రూ.155 కోట్ల నిధులను సమకూర్చుకోనుంది. ఆల్టర్‌నేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ ‘ఇన్వెస్టెక్‌’కు చెందిన ఎమర్జింగ్‌ ఇండియా క్రెడిట్‌ ఆపర్ట్యునిటీస్‌ ఫండ్‌ వన్‌, ఇన్వెస్టెక్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ నుంచి ఈ నిధులు సమీకరిస్తున్నట్లు ఓమ్నీ గ్రూప్‌ సీఈఓ అలోక్‌ చంద్ర ముల్లిక్‌ తెలిపారు. 2010లో ఓమ్నీ హాస్పిటల్స్‌ పేరుతో సేవలు ప్రారంభించినట్టు ఇన్‌కార్‌ గ్రూప్‌ సీఎండీ సూర్య పులగం తెలిపారు.

వచ్చే మూడేళ్లలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే యోచన కూడా ఉందని చంద్ర తెలిపారు.  ప్రస్తుతం ఉన్న 800 పడకలను వచ్చే 5-6 ఏళ్లలో నిధుల లభ్యతను బట్టి 1,500-2,000కు పెంచుకోవాలని,  కార్యకలాపాలను మరో మూడు రాష్ట్రాలకు విస్తరించాలని యోచిస్తోంది. భవిష్యత్తు వృద్ధికి ఫ్రాంచైజింగ్‌ అవకాశాలను కూడా అందిపుచ్చుకోనున్నట్లు అలోక్‌ చంద్ర అన్నారు.