WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

గర్భాశయ శస్త్రచికిత్స | OMNI Hospitals

అబ్ స్టిట్రిక్స్ మరియు గైనకాలజీ - గర్భాశయ శస్త్రచికిత్స

శాఖ

గర్భాశయ శస్త్రచికిత్స

గర్భాశయాన్ని , గర్భాశయం ముఖద్వారాన్ని సర్జికల్ గా తొలగించడాన్ని హిస్టెరెక్టొమి అని అంటారు. హిస్టరెక్టొమీలో ఆపరేషన్ కు గల లక్ష్యాన్ని బట్టి  అండాశయం, ఫెలోపియన్ గొట్టాలు సహా,  సమీపంలో ఉన్న అవయవాలు, కణజాలం తొలగింపు ప్రమేయాన్ని కలిగి ఉండవచ్చు. గర్భం ధరించిన సమయం అంతటా, శిశువు గర్భాశయంలో అభివృద్ధి చెందుతుంది. మీరు బహిష్టుల సమయంలో కోల్పోయే రక్తం దాని చుట్టూ ఉంటుంది. హిస్టరెక్టొమీ తరువాత, మీరు గర్భం ధరించలేరు మరియు మీకు బహిష్టులు రావడం ఆగిపోతాయి. 

హిస్టరెక్టొమీ  రకాలు :

  1.  టోటల్ హిస్టరెక్టొమీ గర్భాశయం మరియు గర్భాశయం ముఖ ద్వారం తొలగించబడతాయి కానీ అండాశయాలు మిగిలి ఉంటాయి.
  2. సుప్రాసర్వైకల్ హిస్టెరెక్టొమి గర్భాశయానికి కేవలం ఎగువ భాగం తొలగించడం, గర్భాశయం ముఖద్వారం  యథాతథంగా ఉంటుంది. 
  3. బైలేటరల్ సల్పింగో – ఊఫోరెక్టమీతో టోటల్ హిస్టరెక్టొమి: ఈ ప్రక్రియలో గర్భాశయం, గర్భాశయం ముఖద్వారం, ఫెలోఫియన్ గొట్టాలు (సాల్పింగెక్టొమి) మరియు అండాశయం (ఊఫోరెక్టొమి) తొలగిస్తారు. మీకు ఇంకా బహిష్టులు ఆగిపోకపోతే, అండాశయాలను తొలగించడం వలన బహిష్టులు ఆగిపోయే సమయంలో ఉండే లక్షణాలను ప్రేరేపిస్తాయి. 
  4. బైలేటరల్ సాల్పింగో – ఊఫోరెక్టమీతో రాడికల్ హెస్టెరెక్టొమి : బైలేటరల్ సాల్పింగో-ఊఫోరెక్టమీతో రాడికల్ హిస్టెరెక్టొమీ సమయంలో  గర్భాశయం, గర్భాశయం ముఖద్వారం, ఫెలోపియన్ గొట్టాలు, అండాశయం, యోని ఎగువ ప్రాంతం మరియు కొన్ని చుట్టుప్రక్కల ఉండే కణజాలం మరియు లింఫ్ నోడ్స్ తొలగించబడతాయి. కణితి ఉన్నప్పుడు, ఈ రకమైన హిస్టెరెక్టొమీ నిర్వహించబడుతుంది. 

హిస్టెరెక్టొమీ లక్ష్యం ఏమిటి ?

  • ఈ క్రింది పరిస్థితులకు చికిత్స చేయడానికి హిస్టెరెక్టొమీ నిర్వహిస్తారు :
  • యోని నుండి రక్తస్రావం అధికంగా లేదా అసాధారణంగా ఉండటం మరియు ఇతర చికిత్సలతో నియంత్రించబడనప్పుడు. 
  • సాధారణ చికిత్సా టెక్నిక్స్ తో నిర్వహించబడని విధంగా తీవ్రంగా బహిష్టులతో అసౌకర్యం ఉన్నప్పుడు. 
  • యూటిరిన్ ఫైబ్రోయిడ్స్ లేదా లియోమయోమాస్ (కాన్సర్ కారకం కాని కణితిలు ఉండటం)
  • ఇతర చికిత్సలతో నిర్వహించబడని విధంగా పెరిగిన  గర్భాశయం నొప్పి. 
  • గర్భాశయం జారడం ( సహాయ కండరాలు బలహీనపడటం వలన యోని మార్గంలోకి గర్భాశయం జారిపోవడం) మూత్రం ఆగకపోవడం లేదా మల విసర్జనలో అడ్డుపడటం కలగవచ్చు. 
  • కాన్సర్ ను నివారించడానికి  కాన్సర్ గా  అభివృద్ధి చెందే  గర్భాశయం లేదా యూటిరిన్ కాన్సర్ లేదా అసాధారణత్వాలు .
  • గర్భాశయం గోడ పై ప్రభావం చూపించే పరిస్థితులైన హైపర్ ప్లాసియా, యూటిరిన్ పాలిప్స్ పునరావృతం కావడం లేదా అడినోమయోసిస్ వంటివి. 

హిస్టరెక్టొమీ సమయంలో ఏమిటి జరుగుతుంది?

మీకు కావలసిన హిస్టెరెక్టొమీ రకాన్ని మరియు దానిని అమలు చేయడానికి ఉత్తమమైన సర్జికల్ విధానాన్ని  మీ డాక్టర్ నిర్ణయిస్తారు. మీకు ఆసుపత్రి గౌన్ తొడుగుతారు మరియు మీ గుండె కొట్టుకునే వేగాన్ని పర్యవేక్షించడానికి సెన్సర్స్ తో దానిని కలుపుతారు. డ్రగ్స్ మరియు ద్రవాలను అందించడానికి, ఇంట్రావీనస్ (ఐవీ) లైన్ మీ చేతి నరంలోకి అమర్చబడుతుంది. 

అనస్థీషియోలజిస్ట్ మీకు ఇది ఇవ్వవచ్చు :

జనరల్ అనస్థీసియా, దీనిలో  చికిత్స చేసే సమయంలో మీరు పూర్తిగా స్ప్రహలో ఉండరు; లేదా రీజనల్ అనస్థీషియా ( ఎపిడ్యూరల్ లేదా స్పైనల్ అనస్థీషియా) లో మీరు మెళుకువగా ఉన్నప్పుడు మీకు నొప్పిని బ్లాక్   చేయడానికి మీకు ఎగువ వీపులో నరాలు వద్ద డ్రగ్స్ ఇవ్వబడతాయి. 

హిస్టెరెక్టొమీని చేయడానికి పలు సర్జికల్ పద్ధతులలో ఒక దానిని మీ డాక్టర్ వినియోగించవచ్చు:

వెజినల్ హిస్టెరెక్టొమి:

  • మీ యోనీ పైన కోత చేసి మీ గర్భాశయం తొలగిస్తారు. ఇక్కడ కంటికి కనిపించే కోత ఉండదు. 
  • యోనీ లోపల, కరిగిపోయే సూచర్స్ ఉపయోగిస్తారు. 
  • గర్భాశయం జారినప్పుడు మరియు ఇతర బినైన్ (లేదా కాన్సర్ కానివి) వ్యాధులకు చికిత్స చేసే సమయంలో సర్వ సాధారణంగా ఇది ఉపయోగిస్తారు. 
  • దీనిలో అతి తక్కువ సమస్యలు ఉంటాయి మరియు వేగంగా కోలుకోవచ్చు ( నాలుగు వారాలు వరకు) మరియు ఈ పద్ధతి సిఫారసు చేయబడేదిగా పరిగణన చేయబడింది. 
  • రోగులు ఆపరేషన్ జరిగిన రోజే తరచుగా డిశ్చార్జ్ చేయబడతారు. 

లాపరోస్కోపి ద్వారా హిస్టరెక్టొమి :

  • బొడ్డు వద్ద చిన్న కోత పెట్టి, దిగువ కడుపులోకి లాపరోస్కోప్ ( చివర కెమేరా ఉండే సన్నని గొట్టం) అమరుస్తారు. 
  • సర్జికల్ పరికరాలు ఇంప్లాంట్ చేయడానికి పలు ఇతర చిన్న కోతలు చేయబడతాయి. 
  • యోనిలో లేదా కడుపులో చేసిన కోతలు ద్వారా చిన్న విభాగాలుగా మీ గర్భాశయం తొలగించబడుతుంది. 
  • కొంతమంది ప్రజలు ఆసుపత్రిని అదే రోజు లేదా ఒక రోజు రాత్రి ఆసుపత్రిలో ఉన్న తరువాత డిశ్చార్జ్ చేయబడతారు. 
  • అబ్డామినల్ హిస్టెరెక్టొమీ కంటే కోలుకునే సమయం తక్కువగా మరియు తక్కువ బాధాకరంగా ఉంటుంది. 

అబ్డామినల్ హిస్టెరెక్టొమి :

  • గర్భాశయం తొలగించడానికి మీ కడుపులో ఆరు నుండి ఎనిమిది అంగుళాల కోత చేయబడుతుంది. 
  • మీ జననాంగాలకు పైన భాగంలో లేదా మీ బొడ్డు నుండి మీ జననాంగాల ఎముక వరకు కోత చేయబడుతుంది. సర్జన్ గాయానికి స్యూచర్స్ వేస్తారు లేదా స్టేపుల్స్ తో మూసివేస్తారు. 
  • కాన్సర్ ఉన్నప్పుడు, గర్భాశయం పెద్దదిగా మారుతుంది లేదా ఇలాంటి కేసులలో వ్యాధి ఇతర కటి ప్రాంతాలకు వ్యాపించినప్పుడు అబ్డామినల్ హిస్టెరెక్టొమి చేయబడుతుంది. 
  • సాధారణంగా దీనికి ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాలి ( రెండు లేదా మూడు రోజులు), కోలుకోవడానికి ఎక్కువ సమయం కావాలి.

అత్యంత ప్రబలంగా ఉన్న హిస్టెరెక్టొమీ దుష్ప్రభావాలు ఏమిటి ?

కోత పెట్టిన చోట యోని నుండి స్రవించడం  ( సర్జరీ తరువాత ఆరు వారాలు వరకు సంభవిస్తుంది) మరియు అసౌకర్యం వంటి ఈ రెండు సమస్యలు  హిస్టరెక్టొమీ చేసినప్పుడు అత్యంత ప్రబలంగా ఉన్న దుష్ప్రభావాలుగా చెప్పవచ్చు. 

మీకు అండాశయం తొలగిస్తే , మీకు హిస్టరెక్టొమీ చేసిన తరువాత మీకు బహిష్టులు ఆగిపోయే సమయంలో కలిగే లక్షణాలు ఉండవచ్చు. 

కొన్ని సాధారణమైన దుష్ప్రభావాలలో ఇవి భాగంగా ఉన్నాయి:

  • వేడి ఆవిర్లు కలగడం.
  • యోని వద్ద ఎండిపోవడం.
  • లైంగిక కోరిక తగ్గడం.
  • నిద్రించడంలో సమస్యలు (నిద్రలేమి).
  • పైన చెప్పిన బహిష్టులు ఆగిపోయే సమయంలో కలిగే దుష్ప్రభావాలను నివారించడానికి మీ డాక్టర్ చికిత్సను ఎంపిక చేస్తారు. 

హిస్టరెక్టొమీ తరువాత ఏమిటి జరుగుతుంది ?

హిస్టరెక్టొమీ తరువాత మీరు ఆసుపత్రిలో గడిపే వ్యవధి అనేది మీకు చేసిన సర్జరీ రకం పై ఆధారపడింది. రక్తస్రావం లేదా రక్తం గడ్డ కట్టడం వంటి చిహ్నాలు లేకపోవడాన్ని నిర్థారించడానికి మీ డాక్టర్ మిమ్మల్ని గమనిస్తుంటారు. మీ కాళ్లల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నివారించడానికి, సర్జరీ చేసిన తరువాత మీరు వెంటనే సాధ్యమైనంత వరకు నడవాలి . 

మీకు అబ్డామినల్ హిస్టెరెక్టొమీ చేసినప్పుడు , మీరు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండవలసి ఉంది. యోనీ నుండి చేసినవి  మరియు లాపరోస్కోపిక్ హిస్టరెక్టొమీస్ తక్కువ జోక్యాన్ని కలిగి ఉంటాయి మరియు ఆసుపత్రిలో రాత్రి ఉండవలసిన అవసరాన్ని కలగనీయవు. 

రోజూవారీ చేయవలసిన పనులు సహా  కోలుకోవడానికి సూచనలను మీ డాక్టర్ మీకు చేస్తారు. మీ ఆపరేషన్ కు సంబంధించి మీకు ఉండే ఏవైనా విచారాలను చర్చించండి. 

హిస్టెరెక్టొమీ వలన కలిగే నష్టాలు ఏమిటి ?

  • ఏ ప్రొసీజర్ తోనైనా ఎల్లప్పుడూ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. సమస్యలలో ఇవి భాగంగా ఉన్నాయి:
  • రక్తం గడ్డలు కడుతుంది. 
  • ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటుంది. 
  • రక్తస్రావం.
  • మల విసర్జనలో ఆటంకం. 
  • అంతర్గత స్యూచర్స్ తీసివేయబడతాయి.
  • మూత్రకోశానికి హాని కలుగుతుంది. 
  • అనస్థీషియాకు సంబంధించిన సమస్యలు. 

హిస్టెరెక్టమీ నుండి కోలుకోవడానికి ఎంత సమయం కావాలి ?

చాలామంది మహిళలు నాలుగు నుండి ఆరు వారాలు లోగా కోలుకుంటారు .  మీకు చేసిన హిస్టెరెక్టమీ రకాన్ని బట్టి  మరియు అది ఏ విధంగా చేయబడింది ఆధారంగా మీరు కోలుకునే సమయం ఉంటుంది. అబ్డామినల్ హిస్టెరెక్టమీ కంటే లాపరోస్కోపిక్ లేదా యోని ద్వారా చేసిన హిస్టెరెక్టమీతో త్వరగా కోలుకుంటారు. 

మీరు మీ పనులను క్రమేణా పెంచాలి మరియు మీరు ఎలాంటి అనుభవం పొందుతున్నారో శ్రద్ధవహించాలి. మీకు ఏదైనా నొప్పి కలిగిస్తే, మీరు ఆ పని చేయడం ఆపుచేయాలి. మీరు తీసుకోవలసిన డ్రగ్స్ సహా  ఇంటి వద్ద కోలుకోవడానికి కావలసిన సమగ్రమైన వివరాలను మీ డాక్టర్ తో చర్చించండి. 

హిస్టెరెక్టమీ తరువాత నేను ఏ విధమైన అనుభవాలు పొందుతాను?

1.శారీరకంగా :

హిస్టెరెక్టమీ తరువాత మీకు బహిష్టులు ఆగిపోతాయి. మీకు అప్పుడప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది మరియు బహిష్టుల సమయంలో ఉండే లక్షణాలను మీరు అనుభవించవచ్చు. సర్జరీ తరువాత నాలుగు నుండి ఆరు వారాలు వరకు కొంచెంగా యోని నుండి రక్తస్రావం కలుగుతుంది మరియు ముదురు ఎరుపు రంగులో రక్తస్రావం కలుగుతుంది. 

మీకు కోత చేసిన చోట  నాలుగు నుండి ఆరు వారాలు  అసౌకర్యం కలగవచ్చు మరియు ఏదైనా ఎర్రబడటం, వాపు లేదా కందడం తగ్గిపోతాయి. కోత చేసిన చోట మంట పుట్టడం, దురద కలగడం సాధారణం. కోత చేసిన చోట మరియు మీ కాలిలో మొద్దుబారటం మీరు అనుభవిస్తారు. ఇది సాధారణం మరియు తరచుగా ఇది రెండు నెలల్లో తగ్గిపోతుంది. లోపల, బయట గీతలు పడటం సాధారణమే. 

అండాశయాలు ఇంకా ఉంటే, మీకు హార్మోన్స్ నుండి ఎలాంటి ప్రభావం ఉండదు. బహిష్టులు ఆగిపోవడానికి ముందు గర్భాశయంతో పాటు మీ అండాశయాలు కూడా తొలగిస్తే, వేడి ఆవిర్లు వంటి బహిష్టుల సమయంలో కలిగే లక్షణాలను అనుభవించవచ్చు. బహిష్టుల సమయంలో కలిగే లక్షణాలను తగ్గించడానికి, మీ డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్సను సిఫారసు చేయవచ్చు. 

సబ్ టోటల్ హిస్టెరెక్టమీని చేయించుకున్న ప్రజలు ఈ ప్రక్రియ తరువాత ఏడాది వరకు కొంచెంగా బహిష్టులు అనుభవించవచ్చు. ఎందుకంటే కొంచెంగా గర్భాశయం ముఖ ద్వారం వద్ద కొంచెంగా ఎండోమెట్రియల్ లైనింగ్ ఉండిపోవడం వలన కొంచెంగా బహిష్టులు కలగవచ్చు. 

2.ఉద్వేగపరంగా :

మీరు సర్జరీ కోసం ఏ విధంగా సిద్ధమయ్యారు, దానిని చేయించుకోవడానికి గల లక్ష్యం మరియు సమస్య పరిష్కరించబడిందా లేదా అనే విషయాలను బట్టి హిస్టెరెక్టమీ గురించి భావోద్వేగాలు ఉంటాయి. 

కొంతమంది మహిళలు విచారానికి గురవుతారు కానీ సాధారంగా ఇవి స్థిరంగా ఉండవు. ఇతర మహిళలు హిస్టెరెక్టమీ తమ ఆరోగ్యం, సంక్షేమాన్ని  మెరుగుపరిచిందని  మరియు తమ జీవితాలను కూడా కాపాడిందని భావిస్తారు. 

హిస్టెరెక్టమీ తరువాత నాకు బహిష్టులు ఆగిపోతాయా?

ఇది అండాశయాలు తొలగించబడ్డాయా లేదా అనే విషయం పై ఇది ఆధారపడింది. హిస్టెరెక్టమీతో మీ అండాశయాలు ఉంటే, మీరు వెంటనే బహిష్టులు ఆగిపోయే దశకు చేరుకోరు. హిస్టెరెక్టమీ తరువాత రెండు అండాశయాలను తొలగిస్తే, మీకు వెంటనే బహిష్టులు తొలగిపోతాయి. 

నాకు హిస్టెరెక్టమీ  చేసినా కూడా పాప్ పరీక్ష అవసరమా ?

లేదు, ప్రత్యేకించి మీకు సర్వైకల్ కాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని భావిస్తే అవసరం లేదు. కాన్సర్ వలన మీకు హిస్టెరెక్టమీ చేసినట్లయితే, మీరు పాప్ పరీక్షలను కొనసాగించాలి. 

 

Top