WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
తుంటి మార్పిడి సర్జరీని తుంటిలో కొంత భాగాలను ప్రత్యేకించి హిప్ ఆర్థ్రైటిస్ లేదా తుంటి గట్టిదనం వలన కలిగిన నొప్పిని సరి చేయడానికి కటి మరియు తొడ ఎముకను మార్చడానికి లేదా తొలగించడానికి నిర్వహిస్తారు. తుంటికి కలిగిన గాయాలు లేదా విరిగిన తుంటి , తుంటి అసాధారణంగా పెరగడం మరియు సంబంధిత పరిస్థితులకు చికిత్స చేయడానికి డాక్టర్స్ కూడా ఈ ప్రక్రియను సిఫారసు చేస్తారు.
ఈ క్రింది ఆర్థ్రైటిస్ చిహ్నాలలో మీరు ఏవైనా అనుభవిస్తే తుంటి మార్పిడిని పరిగణన చేయాలి:
ఆరోగ్యవంతమైన తుంటిలో బంతి మరియు సాకెట్ లు కలిసి సులభంగా కదలడంలో సహాయపడటానికి వాటిని కప్పి ఉంచే మృదులాస్థి ఉంటుంది. ఎముకలు ఒక దానితో మరొకటి రాచుకుంటే మరియు కఠినంగా తయారైతే, దానికి కారణం మృదులాస్థి అరిగిపోవడం లేదా గాయపడటం. ఈ పరిస్థితిని ఆస్టియోఆర్థ్టైటిస్ అంటారు, ఇది తుంటి కదలికను పరిమితం చేస్తుంది మరియు నొప్పిని కలిగిస్తుంది. మీకు ఆర్థ్రైటిక్ తుంటి ఉన్నప్పుడు నడవడం లేదా కుర్చీలో నుండి పైకి లేవడం , కూర్చోవడం కూడా అసౌకర్యంగా ఉంటుంది. హిప్ ఆర్థ్రైటిస్ ను గుర్తించినప్పుడు, సర్జరీ అవసరం లేదు. ఫిజికల్ థెరపీ లేదా నాన్ స్టిరోయిడల్ యాంటీ-ఇన్ ఫ్లమేటరీ మెడిసిన్స్ (ఎన్ఎస్ఏఐడీలు) ఉపశమనం కలిగించవచ్చు. అయితే ఈ సమస్యలను తగ్గించడంలో ఈ చర్యలు ప్రభావం చూపించకపోతే, మీరు ఆర్థోపెడిక్ ఫిజీషియన్ ను సంప్రదించాలి.
వివిధ రకాల తుంటి సర్జరీలు:
పూర్తి తుంటి మార్పిడి అత్యంత ప్రసిద్ధి చెందిన తుంటి మార్పిడి సర్జరీ రకం ( దీనిని టోటల్ హిప్ ఆర్థ్రోప్లాస్టి అని కూడా పిలుస్తారు). ఈ ప్రక్రియలో, అరిగిపోయిన, దెబ్బతిన్న తుంటి భాగాలను మార్చడానికి కృత్రిమ ఇంప్లాంట్స్ ఉపయోగించబడతాయి. సాధారణంగా టైటానియమ్ మెటల్ కేసింగ్ గల బలమైన ప్లాస్టిక్ కప్ తో సాకెట్ మార్చబడుతుంది. మీ ఫెమోరల్ హెడ్ తొలగించబడుతుంది మరియు దాని స్థానంలో సెరామిక్ లేదా అల్లోయ్ లోహంతో చేసిన బంతి అమర్చబడుతుంది. మీ ఫెమూర్ ఎగువ భాగంలో ఉంచిన లోహపు స్టెమ్ రీప్లేస్మెంట్ బాల్ తో కలపబడుతుంది.
నిర్దిష్టమైన వయస్సుకు చెందిన సమూహాలు మరియు కొనసాగించే జీవనశైలులు ఆధారంగా, డాక్టర్స్ సరైన తుంటి మార్పిడి సర్జరీలు సూచిస్తారు:
తుంటి మార్పిడి కోసం సర్జికల్ పద్ధతులు :
పూర్తి తుంటి మార్పిడిని పూర్తి చేసే లక్ష్యం కోసం, రెండు ప్రధానమైన సర్జికల్ విధానాలు ఉన్నాయి:
బ్యాక్ వర్డ్ లేదా సాధారణంగా పిలువబడే పోస్టీరియర్ విధానం (మరింత సర్వ సాధారణంగా) అప్ ఫ్రంట్ లేదా సాధారణంగా పిలువబడే యాంటీరియర్ వ్యూహం ( మినీ-యాంటీరియర్ విధానం లేదా మజిల్- స్పేరింగ్ తుంటి మార్పిడి).
తుంటి మార్పిడి చేసే సర్జన్ ప్రక్రియను ఆరంభించడానికి తుంటి యొక్క ముందరి భాగం (యాంటీరియర్) లేదా వెనక భాగం (పోస్టీరియర్)పై కోత పెడతారు. సర్జరీ చేసిన వారాలు లోగా, రెండు పద్ధతులు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి మరియు కదలికలు, నడకలో కూడా మెరుగుదలలు కలిగిస్తాయి.
తుంటి మార్పిడి సర్జరీ కోసం తయారీ:
కోలుకునే సమయం తగ్గించడానికి మరియు మెరుగైన ఫలితాలు కోసం రోగులు సర్జరీకి ముందు, తరువాత కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. మీ ఆర్థోపెడిక్ సర్జన్, వైద్య సిబ్బంది మరియు రీహాబిలిటేషన్ థెరపిస్ట్ ఇచ్చిన సలహాని మీరు తప్పనిసరిగా పాటించడం అవసరం. తుంటి మార్పిడి చేయడానికి ముందు వివరాలు మరియు కీలు మార్పిడి సర్జరీ కోసం రోగి అవగాహనా వివరాలు గురించి మరింత తెలుసుకోవడానికి మా ఆర్థోపెడిక్ సర్జన్స్ ను సంప్రదించండి.
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.