WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

అడ్మిషన్ మరియు డిశ్చార్జ్ గైడ్ | OMNI Hospitals

అడ్మిషన్ మరియు డిశ్చార్జ్ గైడ్

అడ్మిషన్ మరియు డిశ్చార్జ్ గైడ్

ఈ గైడ్ రోగులు మరియు సందర్శకులు సాధారణంగా అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ప్రీ-అడ్మిషన్ సమయంలో, రోగి బస చేసేటప్పుడు మరియు డిశ్చార్జ్  సమయంలో వచ్చే అన్ని విధానాలు మరియు ప్రక్రియలు ఇక్కడ ఉన్నాయి.

అడ్మిషన్ ముందు

ప్రవేశం కోరుకునే ఏ రోగి అయినా మా ప్రవేశం కోసం ప్రాంగణంలోని మా ఐపి రిసెప్షన్ డెస్క్‌ను నేరుగా సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్ సంవత్సరకాలంలో 24 X 7, 365 రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రవేశం కోసం ఒక సాధారణ డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రీ-అడ్మిషన్స్ బృందం మీరు దరఖాస్తు నింపేటప్పుడు తలెత్తే ఏవైనా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.

ప్రవేశం

అత్యవసర లేదా ప్రణాళిక లేని ప్రవేశం విషయంలో, మీరు 24 గంటలు తెరిచిఉండే  IP రిసెప్షన్ డెస్క్‌కు సంప్రదించవచ్చు; మా సంబంధిత సిబ్బంది ప్రతీరోజు ఎప్పుడైనా మీకు సహాయం చేయగలరు.

నమోదు ప్రక్రియ సమయంలో కావలసిన పత్రాలు

ప్రీ-అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి, దయచేసి చెక్-ఇన్ పద్దతిని పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ సిబ్బందిని అనుమతించండి. మీరు ఈ క్రింది పత్రాలను తీసుకురావాలని కోరుచున్నాము:

  • కుటుంబ వైద్యుడు లేదా ముందు సంప్రదించిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేదా సలహా లేఖ
  • ఇన్షురెన్స్ / భీమా కార్డు యొక్క రుజువు (చికిత్స బీమా చేయబడితే)
  • ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఉద్యోగులకు వైద్య ప్రయోజనాల కార్డు
  • వైధ్య పరీక్ష (లు) ఫలితాలు మరియు ఎక్స్-రే లు ఏదైనా ఉంటే
  • మీరు ప్రస్తుతం తీసుకుంటున్న అన్ని మందుల వివరాలు మరియు మోతాదు వివరాలు
  • పాస్ పోర్ట్ (అంతర్జాతీయ రోగులకు)

మీతో పాటు తేసుకు రావలసినవి?

ఆసుపత్రిలో ఉండాలని మీకు సలహా ఇవ్వబడితే, మీరు ఒక జత సౌకర్యవంతమైన చెప్పులు మరియు టాయిలెట్‌ వస్తువులు మీతో తీసుకురావచ్చు

డిశ్చార్జ్  విధానం

  • రోగి మరియు రోగి సంరక్షకులకు ఖచ్చితమైన డిశ్చార్జ్ తేదీ మరియు సమయం గురించి ముందుగానే తెలియజేయబడుతుంది
  • మీ డిశ్చార్జ్ కి ముందు, తాత్కాలిక ఆసుపత్రి బిల్లు పరిశీలన కోసం అందించబడుతుంది
  • అవసరమైతే, మీ కోరిక మేరకు ఆసుపత్రి తగిన రవాణా సదుపాయాన్ని ఏర్పాట్లు చేస్తుంది.
  • డిశ్చార్జ్ తరువాత వైద్యపరమైన ఇబ్బందులు ఏవైనా ఎదురైతే డాక్టర్ సంప్రదింపు కొరకు కాంటాక్ట్ నెంబరు ఇవ్వబడుతుంది.
  • విశ్రాంతి, ఆహారం, మందులు మరియు తదుపరి సంప్రదింపుల గురించి మీకు మరియు మీ సంరక్షకుడికి సరైన సూచనలు అందించబడతాయి
  • ఆసుపత్రి నుండి బయలుదేరిన రోగికి వ్రాతపూర్వక డిశ్చార్జ్ సారాంశం అందించబడుతుంది
  • మొత్తం చెల్లింపు మరియు డిశ్చార్జ్ ప్రక్రియకు 4 గంటల సమయం వరకు పట్టవచ్చని దయచేసి గుర్తుంచుకోండి

చెల్లింపు విధానం

  • అన్ని చెల్లింపులు హాస్పిటల్ లాబీలోని క్యాషియర్ కౌంటర్ వద్ద చేయవచ్చు. నగదు మరియు క్రెడిట్ కార్డులు మాత్రమే అంగీకరించబడతాయి.
  • మీకు బిల్లు ఇచ్చి డిశ్చార్జ్ సమయానికి అన్ని సెటిల్ చేసుకోవాలి

 గమనిక : చెక్కులు అంగీకరించబడవు

మా చెక్-ఇన్ విధానాలకు సంబంధించి మీకు సందేహాలు ఉంటే, దయచేసి క్రింద జత చేయబడిన నంబర్లకు కాల్ చేయండి –

040-6736 9999, మొబైల్: 80963 69999.

Top