ఈ గైడ్ రోగులు మరియు సందర్శకులు సాధారణంగా అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ప్రీ-అడ్మిషన్ సమయంలో, రోగి బస చేసేటప్పుడు మరియు డిశ్చార్జ్ సమయంలో వచ్చే అన్ని విధానాలు మరియు ప్రక్రియలు ఇక్కడ ఉన్నాయి.
అడ్మిషన్ ముందు
ప్రవేశం కోరుకునే ఏ రోగి అయినా మా ప్రవేశం కోసం ప్రాంగణంలోని మా ఐపి రిసెప్షన్ డెస్క్‌ను నేరుగా సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్ సంవత్సరకాలంలో 24 X 7, 365 రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రవేశం కోసం ఒక సాధారణ డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రీ-అడ్మిషన్స్ బృందం మీరు దరఖాస్తు నింపేటప్పుడు తలెత్తే ఏవైనా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
ప్రవేశం
అత్యవసర లేదా ప్రణాళిక లేని ప్రవేశం విషయంలో, మీరు 24 గంటలు తెరిచిఉండే IP రిసెప్షన్ డెస్క్‌కు సంప్రదించవచ్చు; మా సంబంధిత సిబ్బంది ప్రతీరోజు ఎప్పుడైనా మీకు సహాయం చేయగలరు.
నమోదు ప్రక్రియ సమయంలో కావలసిన పత్రాలు
ప్రీ-అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి, దయచేసి చెక్-ఇన్ పద్దతిని పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ సిబ్బందిని అనుమతించండి. మీరు ఈ క్రింది పత్రాలను తీసుకురావాలని కోరుచున్నాము:
- కుటుంబ వైద్యుడు లేదా ముందు సంప్రదించిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేదా సలహా లేఖ
- ఇన్షురెన్స్ / భీమా కార్డు యొక్క రుజువు (చికిత్స బీమా చేయబడితే)
- ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఉద్యోగులకు వైద్య ప్రయోజనాల కార్డు
- వైధ్య పరీక్ష (లు) ఫలితాలు మరియు ఎక్స్-రే లు ఏదైనా ఉంటే
- మీరు ప్రస్తుతం తీసుకుంటున్న అన్ని మందుల వివరాలు మరియు మోతాదు వివరాలు
- పాస్ పోర్ట్ (అంతర్జాతీయ రోగులకు)
మీతో పాటు తేసుకు రావలసినవి?
ఆసుపత్రిలో ఉండాలని మీకు సలహా ఇవ్వబడితే, మీరు ఒక జత సౌకర్యవంతమైన చెప్పులు మరియు టాయిలెట్ వస్తువులు మీతో తీసుకురావచ్చు
డిశ్చార్జ్ విధానం
- రోగి మరియు రోగి సంరక్షకులకు ఖచ్చితమైన డిశ్చార్జ్ తేదీ మరియు సమయం గురించి ముందుగానే తెలియజేయబడుతుంది
- మీ డిశ్చార్జ్ కి ముందు, తాత్కాలిక ఆసుపత్రి బిల్లు పరిశీలన కోసం అందించబడుతుంది
- అవసరమైతే, మీ కోరిక మేరకు ఆసుపత్రి తగిన రవాణా సదుపాయాన్ని ఏర్పాట్లు చేస్తుంది.
- డిశ్చార్జ్ తరువాత వైద్యపరమైన ఇబ్బందులు ఏవైనా ఎదురైతే డాక్టర్ సంప్రదింపు కొరకు కాంటాక్ట్ నెంబరు ఇవ్వబడుతుంది.
- విశ్రాంతి, ఆహారం, మందులు మరియు తదుపరి సంప్రదింపుల గురించి మీకు మరియు మీ సంరక్షకుడికి సరైన సూచనలు అందించబడతాయి
- ఆసుపత్రి నుండి బయలుదేరిన రోగికి వ్రాతపూర్వక డిశ్చార్జ్ సారాంశం అందించబడుతుంది
- మొత్తం చెల్లింపు మరియు డిశ్చార్జ్ ప్రక్రియకు 4 గంటల సమయం వరకు పట్టవచ్చని దయచేసి గుర్తుంచుకోండి
చెల్లింపు విధానం
- అన్ని చెల్లింపులు హాస్పిటల్ లాబీలోని క్యాషియర్ కౌంటర్ వద్ద చేయవచ్చు. నగదు మరియు క్రెడిట్ కార్డులు మాత్రమే అంగీకరించబడతాయి.
- మీకు బిల్లు ఇచ్చి డిశ్చార్జ్ సమయానికి అన్ని సెటిల్ చేసుకోవాలి
గమనిక : చెక్కులు అంగీకరించబడవు
మా చెక్-ఇన్ విధానాలకు సంబంధించి మీకు సందేహాలు ఉంటే, దయచేసి క్రింద జత చేయబడిన నంబర్లకు కాల్ చేయండి –
040-6736 9999, మొబైల్: 80963 69999.