WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

అడినోయిడెక్టొమి | OMNI Hospitals

ఈఎన్ టీ-అడినోయిడెక్టొమి

శాఖ

అడినోయిడెక్టొమి

అడినాయిడ్స్ గ్రంథులు ముక్కు వెనక, నోటిలో పై భాగంలో ఉంటాయి. అవి చిన్న కణజాలం యొక్క గుత్తిగా కనిపిస్తాయి మరియు పిల్లల్లో కీలకమైన పనులు చేస్తాయి. అడినాయిడ్స్ వ్యాధి నిరోధక వ్యవస్థలో ఒక భాగం మరియు క్రిములు మరియు వైరస్ లతో శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. 5 నుండి 7 సంవత్సరాల వయస్సులో, పిల్లల అడినాయిడ్స్ క్షీణించడం ఆరంభమవుతుంది, ఆ సమయానికి వారు యుక్త వయస్సులోకి ప్రవేశిస్తారు, అవి దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి.

అడినోయిడెక్టొమి

  • అడినోయిడ్ గ్రంథులను తొలగించడానికి చేసే సర్జరీని అడినోయిడెక్టొమి లేదా అడినోయిడ్ తొలగింపుగా ప్రసిద్ధి చెందింది.
  • అడినాయిడ్స్ శరీరంలో వైరస్ లు మరియు బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా శరీర రక్షణకు సహాయపడతాయి , కానీ అవి అప్పుడప్పుడు వాస్తాయి, విస్తరిస్తాయి లేదా దీర్ఘకాలికమైన ఇన్ఫెక్షన్ ను కలిగిస్తాయి. దీనికి ఇన్ఫెక్షన్స్, అలెర్జీలు, లేదా ఇతర అంశాలు కారణం కావచ్చు. ఇంకా కొంతమంది పిల్లలు అసాధారణమైన పెద్ద అడినాయిడ్స్ తో పుట్టవచ్చు.
  • పిల్లల అడినాయిడ్స్ అభివృద్ధి చెందటం అనేది సమస్యాత్మకం కావచ్చు, ఎందుకంటే అవి పిల్లల వాయు మార్గానికి పాక్షికంగా అడ్డుపడతాయి. ఇది సంభవించినప్పుడు, పిల్లలకు శ్వాశకు సంబంధించిన సమస్యలు, చెవిలో ఇన్ఫెక్షన్స్, లేదా ఇతర సమస్యలు కలగవచ్చు , ఫలితంగా గురక లేదా మరింత తీవ్రమైన సమస్యలైన స్లీప్ అప్నియా ( రాత్రి వేళ నిద్రలో శ్వాశ ఆగిపోవడం) వంటి సమస్యలు కలగవచ్చు.
  • అదనంగా, సైనస్ ఇన్ఫెక్షన్స్,  పడిశెం మరియు తీవ్రమైన (దీర్ఘకాలికంగా) జలుబు ఉండవచ్చు. చెవిలో ఇన్ఫెక్షన్స్ పునరావృతం అవడం మరియు చెవిలో నిరంతరంగా ద్రవాలు ఉండటం తాత్కాలికంగా వినికిడి లోపం కలిగిస్తాయి, ఇవి  పెద్దవిగా మారిన అడినాయిడ్స్ ద్వారా కూడా ప్రభావానికి గురవుతుంది.
  • గ్రంథులను తొలగించడానికి తరచుగా సర్జరీ అవసరమవుతుంది. పరిశోధన ప్రకారం వాటిని తొలగించడం ద్వారా వ్యాధులతో పోరాడే సామర్థ్యం ఎటువంటి ప్రభావానికి గురికాదు.
  • చాలామంది పిల్లలకు  అడినోయిడెక్టొమి సర్జరీ చేయించుకున్న పిల్లల వయస్సు 1 నుండి 7 ఏళ్ల వయస్సుగా ఉంది. ఏడేళ్ల వయస్సు వచ్చేసరికి అడినాయిడ్స్ క్షీణించడం ఆరంభమవుతుంది , పెద్దలలో అది వెస్టీజియల్ అవయవంగా (ఎటువంటి పని చేయని అవశేషం) పరిగణన చేయబడుతుంది.

పిల్లలకు అడినోయిడెక్టొమి అవసరమని ఫిజీషియన్ ఎలా నిర్ణయిస్తారు?

మీ బిడ్డకు శ్వాశ తీసుకోవడంలో సమస్యలు, చెవిలో ఇన్ఫెక్షన్స్ లేదా సైనస్ ఇన్ఫెక్షన్స్ తరచుగా పునరావృతమవుతుంటే మరియు మీరు అడినాయిడ్స్ తో సమస్య ఉండవచ్చని మీరు అనుమానిస్తే మీరు డాక్టర్ ను సంప్రదించాలి. డాక్టర్  మీ బిడ్డ ఆరోగ్య చరిత్రను తెలుసుకున్న తరువాత మీ బిడ్డకు ఎక్స్-రేతో లేదా మీ బిడ్డ ముక్కులో చిన్న కెమేరాను ఉంచి అడినాయిడ్స్ ను పరీక్షిస్తారు.

అడినాయిడ్స్ కి వాపు ఉంటే మరియు మీ బిడ్డ అనుభవిస్తున్న లక్షణాలను బట్టి వాటిని తొలగించవలసిన అవసరం ఉంటుంది.

ఈఎన్ టీ సర్జన్ సాధారణంగా అడినోయిడెక్టొమీని చేయవచ్చు, ఇది సాధారణమైనది, వేగవంతమైన చికిత్స మరియు అవుట్ పేషంట్ ప్రొసీజర్ గా నిర్వహించబడుతుంది. ఈ ప్రొసీజర్ కోసం, మీ బిడ్డకు జనరల్ అనస్థీషియా ఇవ్వబడుతుంది.

బిడ్డ స్ప్రహలో లేనప్పుడు, నోరు వెడల్పు చేయడానికి సర్జన్ రిట్రాక్టర్ ను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న ఎన్నో పద్ధతులను ఉపయోగించి అడినాయిడ్స్ తొలగించబడతాయి. రక్తస్రావం ఆపుచేయడంలో సహాయపడటానికి, డాక్టర్ ఎలక్ట్రికల్ డివైజ్ ను ఉపయోగించవచ్చు.

అనస్థీషియా ప్రభావం తగ్గిపోయిన తరువాత, మీ బిడ్డను రికవరీ గదికి బదిలీ చేస్తారు. సర్జరీ తరువాత చాలామంది పిల్లలు ఇంటికి వెళ్లగలరు.

అడినోయిడెక్టమీ వలన ఏవైనా ప్రమాదాలు కలిగే అవకాశం ఉందా?

అడినోయిడెక్టమీ వలన ప్రమాదాలు సాధారణంగా కలగవు కానీ ఈ క్రింది  సమస్యలు కలిగే అవకాశం ఉంది:

  • దాగున్న శ్వాశకోశాల సమస్యలు,చెవిలో ఇన్ఫెక్షన్స్, లేదా ముక్కు నుండి జలుబు కారడం వంటి సమస్యలను పరిష్కరించదు.
  • చాలా రక్తం (చాలా అరుదు).
  • కాల క్రమేణా స్వరం నాణ్యతలో మార్పు.
  • ఇన్ఫెక్షన్.
  • అనస్థీషియాను ఉపయోగించడం వలన నష్టాలు.
  • మీరు చికిత్సకు అంగీకరించడానికి ముందు, మీ డాక్టర్ అడినోయిడెక్టమీ వలన కలిగే అన్ని ప్రమాదాలు గురించి మీకు పూర్తిగా వివరిస్తారు మరియు మీ సందేహాలను తీరుస్తారు.
Top