WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

స్ట్రోక్ | OMNI Hospitals

న్యూరాలజీ-స్ట్రోక్

శాఖ

స్ట్రోక్

బ్రైన్ స్ట్రోక్ లేదా బ్రైన్ అటాక్ లేదా సాధారణ భాషలో స్ట్రోక్ అనగా మెదడులో రక్తం ఆకస్మికంగా ఆగిపోతుంది లేదా మెదడులో ఏవైనా రక్తనాలాలు పగిలిపోతాయి. అడ్డంకి వలన కేవలం రక్తం మాత్రమే కాకుండా ఆక్సిజన్ మరియు ఇతర ప్రధానమైనవి కూడా ఆగిపోతాయి, ఇది చివరకు మెదడులో కణాలు మృతి చెందడానికి దారితీస్తుంది. ఫలితంగా  అడ్డంకి ఉన్న శరీర అవయవాలు ఆకస్మికంగా పని చేయడం ఆగిపోవడానికి దారితీస్తుంది. స్ట్రోక్ శరీరం పని చేయకపోవడానికి, శరీరం కదలకపోవడానికి, శరీరానికి స్పర్శ, జ్ఞాపకశక్తి , మాట్లాడటం, కంటి చూపు, కండరాల బలం, అంగ వైకల్యానికి దారితీస్తుంది, తుదకు మరణానికి కూడా దారితీస్తుంది.

స్ట్రోక్ రకాలు 

బ్రైన్ స్ట్రోక్స్ ప్రధానం 2 రకాలు అవి ఇషిమిక్ మరియు హెమరేజ్:

ఇషిమిక్ బ్రైన్ స్ట్రోక్ ఆక్సిజన్ , రక్తం మరియు ఇంకా ఇతర ప్రధానమైన వాటి సరఫరా మెదడుకు ఆకస్మికంగా తగ్గిపోయినప్పుడు సంభవిస్తుంది. అతిరోస్క్లెరోసిస్ అని కూడా పిలువబడే మెదడు ధమనుల్లో పెద్ద అడ్డంకి ఉన్నప్పుడ ఇది కలుగుతుంది. 

హెమరేజ్ అనేది ఒక రకమైన బ్రైన్ స్ట్రోక్, మెదడు ధమనులు పగిలిపోవడం వలన మెదడు లోపల రక్తస్రావం కలుగుతుంది. 

 గణాంకాలు ప్రకారం, 80 శాతం స్ట్రోక్స్ ఇషిమిక్ కు మరియు 20 శాతం స్ట్రోక్స్ హెమరాజిక్ కు సంబంధించినవి. 

బ్రైన్ స్ట్రోక్ కలగడానికి కారణాలు:

 40 ఏళ్లకు పైబడిన మగవారికి మహిళలు కంటే కొంచెం ఎక్కువగా స్ట్రోక్ కలిగే అవకాశం ఉంది మరియు మహిళల్లో బ్రైన్ స్ట్రోక్ కలిగే  రేట్ రొమ్ము కాన్సర్ కంటే అధికంగా ఉంది.  ఈ క్రింది వివిధ కారణాలు వలన స్ట్రోక్ కలగవచ్చు.

ఇషిమిక్ స్ట్రోక్ కలగడానికి గల కారణాలు :

  • అట్రియల్ ఫిబ్రిల్లేషన్ గా నిర్థారించబడిన క్రమబద్ధంగా లేని మరియ అసాధారణంగా గుండె కొట్టుకున్నప్పుడు గడ్డ మెడ నుండి లేదా గుండె నుండి కూడా ప్రయాణించి మెదడులో రక్త నాళాలను చేరుతుంది. ఈ రకమైన ఇషిమిక్ స్ట్రోక్ ను ఎంబోలిక్ అని పిలుస్తారు.
  • డయాబిటీస్ లేదా అధిక రక్తపోటుతో బాధపడే రోగులకు మెదడులో చిన్న రక్తనాళాలు మూసుకుపోవడం మరియు అడ్డంకి ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ రకమైన స్ట్రోక్ ని లకునార్ అని పిలుస్తారు.
  • అటిరోస్క్లోరోసిస్ గా పిలువబడే వ్యాధిలో ధమనులు గట్టిపడతాయి, ఇది మెదడు నాళాల్లో గడ్డలు కట్టడానికి దారితీస్తుంది. ఈ రకమైన బ్రైన్ స్ట్రోక్ త్రాంబోటిక్ గా పిలువబడుతుంది.  

హెమరాజిక్ స్ట్రోక్ కోసం కారణాలు :

  • అన్యిరిసమ్స్ మెదడు ధమనులలో బలహీనమైన ప్రదేశాలు, ఇక్కడ రక్త నాళాలు పగులుతాయి మరియు రక్తపు మడుగు మెదడుని కప్పివేస్తుంది. ఈ రకమైన హెమాజిక్ స్ట్రోక్ ని సబ్ ఆర్కనోయిడ్ గా పిలువబడుతుంది. 
  • వృద్ధాప్యం, డయాబిటీస్ మరియు  తీవ్రమైన అధిక రక్తపోటు వలన   మెదడులో ఉండే రక్తపు నాళాలు బలహీనపడతాయి  మరియు మెదడులో రక్తస్రావానికి దారితీస్తుంది. 

స్ట్రోక్ లక్షణాలు :

  • ఆకస్మికంగా మొద్దుబారటం మరియు ముఖంలో ఒక వైపు లేదా కాళ్లు లేదా చేతులు  కదపలేకపోవడం సాధారణంగా శరీరంలో ఏదో ఒక వైపు కలుగుతుంది. 
  • ఆకస్మికంగా మానసిక గందరగోళం, విషయాలను అర్థ చేసుకోలేకపోవడం మరియు గ్రహించలేకపోవడం, ఎంతో ప్రయత్నించినా కూడా మాట్లాడలేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవడంలో సమస్య కలగడం. 
  • తిన్నగా నడవలేకపోవడం, తల తిరగడం మరియు శరీరం సమన్వయం లేకపోవడం. 
  • వివరించలేని విధంగా తీవ్రమైన తలనొప్పి.
  • ఒక కన్నులో లేదా రెండు కన్నుల్లో కంటి చూపు కోల్పోవడం. 

స్ట్రోక్ కు దారితీసే అంశాలు 

  • స్ట్రోక్ కు దారితీసే ప్రధానమైన అంశాలు. 
  • పొగాకు అధికంగా వినియోగించడం 
  • అధిక రక్తపోటు
  • అత్యధిక కొలెస్ట్రాల్ స్థాయిలు. 
  • డయాబిటీస్ మెల్లిటస్
  • ఊబకాయం
  • కొనసాగుతున్న /దాగున్న గుండె జబ్బు. 
  • ఆల్కహాల్ అధికంగా వినియోగించడం. 

స్ట్రోక్ కలిగినప్పుడు ఏంటి చేయాలి?

60 నిముషాలు /1 గంట నుండి స్ట్రోక్ కొనసాగుతుంటే సమయం అత్యంత కీలకమైనది. స్ట్రోక్ తో బాధపడే వ్యక్తిని 60 నిముషాలు లోగా వైద్య సహాయం కోసం తరలించాలి, ఎందుకంటే వ్యాధి నిర్థారించడానికి మరియు చికిత్స చేయడానికి   వైద్య బృందానికి కూడా సమయం కావాలి. ఆ విధంగా చేసినట్లయితే, రోగి దాదాపుగా ఎలాంటి శాశ్వతమైన దుష్ప్రభావాలు మరియు జీవితానికి ప్రమాదం లేకుండా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. స్ట్రోక్ తో బాధపడుతున్న వ్యక్తికి 3 నుండి 6 గంటల సమయం చాలా ప్రధానమైన సమయంగా చెప్పబడింది, ఎందుకంటే స్ట్రోక్ కు ఇచ్చే చికిత్స మొదటి 3 నుండి 6 గటలు లోపు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది, ఆ కీలకమైన సమయం తరువాత మెదడులో ఉండే కణాలు దెబ్బతింటాయి మరియు  తిరిగి కోలుకోలేని విధంగా మృతి చెందుతాయి. ఈ దశలో ఏ రకమైన మందులు కూడా సహాయపడలేవు. 

బ్రైన్ స్ట్రోక్ కోసం చికిత్స 

  •  స్ట్రోక్ తో బాధపడుతున్న రోగులకు ప్రాధమికంగా 2 ప్రధానమైన మందుల రూపాలు గలవు. అవి ఆక్టిలైజ్ మరియు నోవోసెవెన్. 
  • ఇషిమిక్ స్ట్రోక్ విషయంలో, ఆక్టిలైస్ లేదా వైద్యపరంగా ప్రసిద్ధి చెందన ఇంట్రావీనస్ టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ ఉపయోగించబడుతుంది. 
  • హెమరేజ్ అయితే  ఇంట్రావీనస్ యాక్టివేటెడ్ రీకాంబినెంట్ ఫ్యాక్టర్ VII ఉపయోగించాలి   లేదా సాధారణంగా నోవోసెవెన్ ఉపయోగించాలి. 
  •  రోగిని మొదటి ఐ.సీ.యూలో చేర్చబడాలని గమనించాలి మరియ పైన పేర్కొన్నవి  ఉపయోగించబడిన ప్రాధమిక ఔషధాలు మరియు కేవలం మందులు మాత్రమే కాదు. ఈ రెండు మందులు స్ట్రోక్ కలిగిన కొన్ని గంటలు తరువాత ఎంత మాత్రం పని చేయవు మరియు ఆ సమయానికి మెదడులో కణాలు మృతి చెందుతాయి.  

రోగి ఎంత కాలం హాస్పిటల్ లో ఉండాలి 

స్ట్రోక్ కలిగిన తరువాత రోగి సాధారణంగా ఆసుపత్రిలో 4 నుండి 6 రోజులు ఉండాలి. రోగికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కలిగితే లేదా రోగికి కండరాలు, కంటిచూపు లేదా మాట్లాడటంలో మెరుగుదలలు అవసరమైతే ఈ సమయం పొడిగించబడవచ్చు. 

 కోలుకున్న తరువాత ముందు జాగ్రత్తలు 

రోగి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తరువాత, డాక్టర్ కొంత ఉత్తమమైన సమయం వరకు ప్రధానంగా యాంటీకోగులెంట్స్ సూచిస్తారు, కాబట్టి రక్తపోటు, రక్తంలో షుగర్ స్థాయిలు మరియు ప్రోత్రాంబిన్ టైమ్ (పీటీ/ఐఎన్ఆర్)లు సాధారణంగా పర్యవేక్షించబడతాయి. దానితో పాటు, కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు, ఆస్ప్రిన్, బ్లడ్ షుగర్ ను నియంత్రించే మందులు మరియు రక్తపోటు మందులు కూడా సూచించబడతాయి. 

పూర్తిగా కోలుకోవడానికి రోగికి ఎంత సమయం కావాలి – రోగి పూర్తిగా కోలుకోవడానికి ఒక నిర్దేశిత సమయం నిర్ణయించబడలేదు.  స్ట్రోక్ మరియ స్ట్రోక్ వలన ఏవైనా దుష్ప్రభావాలు కలిగితే రోగి వయస్సు, స్ట్రోక్ తీవ్రత, స్ట్రోక్ రకం , చికిత్స రకం మరియు చికిత్సా సమయం వంటి విషయాలను బట్టి ఆయా రోగులకు ఈ సమయం మారుతుంది. 

చిన్న వయస్సులో ఉన్న రోగికి సకాలంలో వైద్య సహాయం అందితే మరియు ఇషిమిక్ శ్రేణికి చెందిన స్వల్పంగా స్ట్రోక్ కలిగితే ఆమె/అతను కొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారు. 

వృద్ధులకు స్ట్రోక్ కలిగితే లేదా హెమరేజ్ కలిగితే మరియు చివరి క్షణంలో చికిత్స అందితే, వారు కోలుకోవడానికి కొన్ని వారాలు నుండి నెలల సమయం కావాలి. ఎందుకంటే వారికి సాధారణ చికిత్స కూడా వారికి అవసరమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Top