WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

హెర్నియా రిపేర్ సర్జరీ | OMNI Hospitals

గ్యాస్ట్రోఎంటరాలజీ - హెర్నియా రిపేర్ సర్జరీ

శాఖ

హెర్నియా రిపేర్ సర్జరీ

వరిబీజంకు (బుడ్డ) చికిత్స చేయడానికి సాధారణంగా సర్జరీ చేస్తారు. హెర్నియా సర్జరీ కోసం ఓపెన్ హెర్నియా రిపైర్, లాపరోస్కోపిక్ హెర్నియా రిపైర్ మరియ రోబోటిక్ హెర్నియా రిపైర్ వంటి మూడు ప్రాథమిక పద్ధతులు ఉపయోగిస్తారు. 

వరిబీజం బాగు చేయడానికి ఓపెన్ సర్జరీ అంటే ఏమిటి?

ఓపెన్ హెర్నియాను సరి చేయడానికి, గజ్జల్లో కోత లేదా గాటు పెడతారు. ఉబ్బిన ప్రేగు బుడ్డ సంచీలో ఉంటుంది. ఉదర కుడ్యానికి బలం కలిగించడానికి, సర్జన్ బుడ్డను తిరిగి కడుపులోకి లాగుతారు మరియు సింథటిక్ మెష్ లేదా కుట్లు వేస్తారు. సర్జరీ తరువాత , కొన్ని గంటలకే చాలామంది రోగులు ఇళ్లకు తిరిగి వెళ్లవచ్చు , కొద్ది రోజులలోనే మంచి ఆరోగ్యం తిరిగి వస్తుంది. సర్జరీ తరువాత నాలుగు నుండి ఆరు వారాలు వ్యాయామాలు, శ్రమతో కూడిన పనులు చేయరాదు. 

లాపరోస్కోపిక్ హెర్నియా సర్జరీ 

  • లాపరోస్కోప్, సన్నని, టెలీస్కోప్ వంటి పరికరం, లాపరోస్కోపిక్ (మినిమల్లీ ఇన్ వేజివ్) హెర్నియా రిపైర్ లో ఉపయోగిస్తారు. దీనిని బొడ్డు వద్ద చిన్న కోత చేసి దాని ద్వారా అమరుస్తారు. సర్జరీ చేయడానికి ముందు, ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ( ప్రయోగశాల పరీక్ష ), ఎలక్ట్రోకార్డియోగ్రామ్ వంటి సాధారణ ఆరోగ్య అంచనా చేస్తారు, ఎందుకంటే ఈ చికిత్సను జనరల్ అనస్థీషియా (ఈకేజీ)కి ముందు చేస్తారు. 
  • ఈ ప్రొసీజర్ సమయంలో, మీరు ఎలాంటి నొప్పిని అనుభవించరు. మీ శరీరం లోపల దృశ్యం ఆపరేషన్ రూమ్ లో లాపరోస్కోప్ కి అమర్చిన చిన్న వీడియో కెమేరా  ద్వారా టెలివిజన్ స్క్రీన్స్ పై కనిపిస్తుంది. 
  • కడుపును పెద్దది చేయడానికి హానికరం కాని గ్యాస్ (కార్బన్ డయోక్సైడ్) ఉపయోగించబడుతుంది.  డాక్టర్ మీ లోపలి అవయవాలను చూడటానికి ఇది అవకాశం కలిగిస్తుంది. ఉదర గోడ యొక్క బలహీనతను వెల్లడించడానికి, కడుపు లోపల ఉండే పెరిటోనియం ముక్కలు చేయబడుతుంది. ఉదర గోడలో ఉండే రంధ్రాలను కప్పి ఉంచడానికి మరియు కణజాలాన్ని శక్తివంతం చేయడానికి, లోపలి నుండి మెష్ ఏర్పాటు చేయబడుతుంది. 
  • సర్జరీ పూర్తయిన తరువాత సర్జికల్ టేప్ తో చిన్న ఉదర గాయాలు కప్పి ఉంచబడతాయి లేదా కుట్టబడతాయి. కొన్ని నెలలు తరువాత కోతలు దాదాపుగా కనిపించవు. 
  • లాపరోస్కోపిక్ హెర్నియా సర్జరీకి అతి తక్కువ గీతలు,  సర్జరీ తరువాత తక్కువ నొప్పి , వేగంగా తిరిగి పనులు చేయగలగడం, వేగంగా కోలుకోవడం ( వారాలకు బదులు రోజులు) వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 

రోబోటిక్ హెర్నియా రిపైర్ సర్జరీ 

  • లాపరోస్కోపిక్ సర్జరీ వలే, రోబోటిక్ హెర్నియా రిపైర్ పద్ధతిలో కూడా లాపరోస్కోప్ ఉపయోగిస్తారు మరియు అదే విధంగా చేస్తారు ( చిన్న కోతలు, చిన్న కెమేరా, కడుపు పెద్దది చేయడం, కడుపు లోపలి దృశ్యాన్ని టెలివిజన్ స్క్రీన్స్ పై చూడటం).
  • రోబోటిక్ సర్జరీ లాపరోస్కోపిక్ సర్జరీ కంటే వేరుగా ఉంటుంది, ఎందుకంటే సర్జన్  ఆపరేషన్ గదిలో కూర్చుని సర్జికల్ పరికరాలను కన్సోల్ నుండి నియంత్రిస్తారు. చిన్న బుడ్డలు లేదా బలహీనమైన ప్రాంతాలకు చికిత్స చేయడానికి  ఉదర గోడను మరమ్మతు చేయడానికి రోబోటిక్ సర్జరి కూడా  ప్రస్తుతం ఉపయోగించబడుతోంది. 
  • రోబోటిక్ సర్జరి మరియు లాపరోస్కోపిక్ సర్జరీలకు మధ్య అత్యంత ప్రధానమైన తేడా ఏమంటే ఉదరం లోపల ( వెర్సెస్ లాపరోస్కోపిక్ సర్జరీలో టు-డైమన్షనల్ ఇమేజెస్ ) త్రీ-డైమన్షనల్ చిత్రాలు కోసం  రోబోటిక్ సర్జరీలో రోబోట్ ను ఉపయోగిస్తారు. అదనంగా, రోబోటిక్ సర్జరీ వాడకంతో, సర్జన్ కడుపు లోపల  వేగంగా కణజాలం మరియు మెషెస్ కుట్టవచ్చు. 
  • రోబోటిక్ హెర్నియా సర్జరీలో ఇతర ప్రయోజనాలలో  ఓపెన్ సర్జరీతో పోల్చినప్పుడు సింగిల్, ప్రధానమైన కోత గీతలు మరియు సర్జరీ తరువాత నొప్పి తక్కువగా ఉండటం వంటి ప్రయోజనాలు గలవు. 
Top