WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

రినోప్లాస్టీ | OMNI Hospitals

ఈఎన్ టీ

శాఖ

రినోప్లాస్టీ

ముక్కు ఆకారం సర్జరీ ద్వారా మార్పు చేయడాన్ని రైనోప్లాస్టి ( రై-నో-ప్లాస్-టీ) అని పిలుస్తారు. రైనోప్లాస్టి లక్ష్యం ముక్కు రూపం మార్చడం, శ్వాశ తీసుకోవడం పెంచడం లేదా రెండూ కావచ్చు.

దిగువ భాగంలో మృదులాస్థితో మరియ ఎగువ భాగంలో ఎముకతో  ప్రాథమికంగా ముక్కు నిర్మాణం తయారవుతుంది . ఎముక, మృదులాస్థి, చర్మం లేదా ఈ మూడూ రైనోప్లాస్టి సమయంలో మారవచ్చు. రైనోప్లాస్టి ప్రయోజనాలు మరియు మీకు ఇది అనుకూలమైనదా లేదా కాదా అని మీ సర్జన్ తో చర్చించండి.

మీ సర్జన్ మీ ముఖంలో ఇతర లక్షణాలను, మీ ముక్కు క్రింద ఉండే చర్మం మరియు రైనోప్లాస్టి కోసం మీరు ప్రణాళిక చేసినప్పుడు మీరు కోరుకుంటున్న మార్పులు గురించి  పరిగణనలోకి తీసుకుంటారు.

మీ ముక్కు ఆకారం, పరిమాణం లేదా నిష్పత్తులు రైనోప్లాస్టి ద్వారా సవరించబడతాయి. ఇది పుట్టుకతో కలిగిన లోపాలు నయం చేయడానికి, గాయం వలన కలిగిన అసాధారణత్వాలు నయం చేయడానికి లేదా శ్వాశ తీసుకోవడంలో ఉన్న సమస్యలను తగ్గించడానికి ఇది నిర్వహించడుతుంది.

ప్రమాదాలు

  • ఏదైనా పెద్ద ప్రక్రియతో ఉన్న వలే, రైనోప్లాస్టీతో కూడా ప్రమాదాలు ఉన్నాయి, అవి:
  • రక్తస్రావం/ఇన్ఫెక్షన్.
  • అనస్థీషియాకు వ్యతిరేకంగా ప్రతిస్పందించడం.
  • అదనంగా, రైనోప్లాస్టీతో అదనపు సంభావ్య ప్రమాదాలు ఉండటమే కూడా ఉన్నాయి.
  • మీ ముక్కుతో శ్వాస తీసుకోవడం కష్టం కావచ్చు.
  • మీ ముక్కు లోపల మరియు చుట్టూ మొద్దుబారటం శాశ్వతంగా ఉండవచ్చు.
  • ఏకరీతిగా ముక్కు కనిపించకపోయే సంభావ్యత.
  • నిరంతరం నొప్పి, రంగు మారడం లేదా నీరు ఏర్పడటం.
  • గీతలు.
  • సెప్టల్ పెర్ఫోరేషన్.

రైనోప్లాస్టీ చేయించుకోవడానికి ముందు

అప్పాయంట్మెంట్ తీసుకోవడానికి ముందు రైనోప్లాస్టి మీ కోసం విజయవంతం అవుతుంగా అని మీరు మీ సర్జన్ తో సంప్రదించాలి. ఈ సమాచారంలో తరచుగా ఈ క్రిందివి ఉంటాయి:

  1. వైద్య నేపధ్యం: సర్జరీ చేయించుకోవడానికి  మరియు మీ లక్ష్యాలు కోసం మీకు గల కారణాలు గురించి మీ డాక్టర్ ఎన్నో ప్రశ్నలు అడుగుతారు.  ఏవైనా ఆపరేషన్స్, ముక్కులో అడ్డంకులు, మీరు తీసుకుంటున్న డ్రగ్స్ సహా మీ వైద్య నేపధ్యం గురించి కూడా మీ డాక్టర్ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. హీమోఫీలియా వంటి రక్తానికి సంబంధించిన సమస్యలు మీకు ఉంటే మీరు రైనోప్లాస్టి చేయించుకోవడానికి అర్హులు కారు.
  2. వైద్య పరీక్ష:  రక్త పరీక్ష వంటి అవసరమైన ప్రయోగశాల పరీక్షలు సహా మీ డాక్టర్ మీకు బాగా శారీరక పరీక్షలు చేస్తారు. ఆమె లేదా అతను మీ ముక్కు లోపల మరియు బయట, మీ ముఖంలో ఫీచర్స్ ను కూడా బాగా తనిఖీ చేస్తారు.
  3. శారీరక పరీక్ష: ఏ సవరణలు అవసరం మరియు శారీరక లక్షణాలు అనగా చర్మం మందం లదా ముక్కు కొసలో ఉన్న మృదులాస్థి మన్నిక ఫలితం పై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి వంటి శారీరక పరీక్షలు మీ డాక్టర్ కు సహాయపడతాయి. మీరు శ్వాశ తీసుకునే సామర్థ్యం ఏ విధంగా రైనోప్లాస్టి పై ప్రభావం చూపిస్తుందో  శారీరక పరీక్ష పై ఆధారపడింది.
  4. ఫోటోగ్రాఫ్స్ : మీ డాక్టర్ కార్యాలయం వివిధ కోణాలు నుండి మీ ముక్కు పిక్చర్స్ తీసుకుంటుంది. వచ్చే ఫలితాలు రకాలను ప్రదర్శించడానికి, మీ సర్జన్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఫోటోగ్రాఫ్స్ ను సవరిస్తారు. దీర్ఘకాలం అంచనాలు, పోలికలకు ముందు మరియు తరువాత, సర్జికల్ రిఫరెన్స్  కోసం ఈ చిత్రాలను మీ డాక్టర్ ఉపయోగిస్తారు. అత్యంత ప్రధానంగా, సర్జికల్ లక్ష్యాలు యొక్క వివరణాత్మకమైన చర్చను ఫోటోగ్రాఫ్స్ అందిస్తాయి.
  5. మీ ఆశింపులు చర్చించడం : మీరు మీ లక్ష్యాలు, ఆశింపులను మీ డాక్టర్ తో చర్చించాలి. ఆమె లేదా అతను రైనోప్లాస్టి మీ కోసం ఏమి చేయగలదు లేదా ఏమి చేయలేదు మరియు సంభావ్య ఫలితాలు గురించి చర్చిస్తారు. మీ రూపం గురించి మాట్లాడేటప్పుడు కొంత అప్రమత్తతను అనుభవించడం   సాధారణంగా ఉంటుంది కానీ మీ సర్జికల్ లక్ష్యాలు మరియు మీ ప్రాధాన్యతలను గురించి మీ సర్జన్ తో మీరు నిజాయితీగా చర్చించడం ప్రధానం.

మీకు చిన్న గడ్డం ఉంటే, మీ సర్జన్ గడ్డం పెరగడానికి మీకు సర్జరీని సూచించవచ్చు. చిన్న గడ్డం ముక్కు పెద్దగా కనిపించేలా చేస్తుంది. కొన్ని పరిస్థితులలో, ముఖం ఆకృతిని మెరుగ్గా బ్యాలెన్స్ చేయడంలో సహాయపడగలిగినా  గడ్డానికి సర్జరీ అవసరం లేదు.

మందులు మరియు ఆహారపు నిబంధనలు

సర్జరీకి రెండు వారాలకు  ముందు మరియు తరువాత , ఆస్ప్రిన్ లేదా ఇబుప్రోఫెన్ లు ఉన్న మందులు (అడ్విల్, మోట్రిన్ ఐబీ మొదలైనవి) తీసుకోరాదు. ఈ మందులు రక్తస్రావం కలగడం అధ్వానం చేస్తాయి. మీ సర్జన్ ఆమోదించిన లేదా సూచించిన మందులు మాత్రమే తీసుకోండి. ఇంకా, ఓవర్ ది కౌంటర్ విటమిన్స్ మరియు హెర్బల్ మందులు తీసుకోరాదు.

మీకు పొగ త్రాగే అలవాటు ఉంటే ఆపుచేయాలి. పొగ త్రాగటం సర్జరీ నుండి కోలుకోవడానికి అడ్డంకులు కలిగిస్తంది మరియు ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఎక్కువ చేస్తుంది.

మీకు చేసే ప్రొసీజర్ ఎంత కష్టమైనది మరియు మీ సర్జన్ ఏమిటి ఎంచుకున్నారు ఆధారంగా, రైనోప్లాస్టిలో మత్తు కలిగించే లోకల్ అనస్థీషియా లేదా పూర్తి జనరల్ అనస్థీషియాను ఉపయోగిస్తారు. సర్జరీ చేయడానికి ముందు ఏ రకమైన అనస్థీషియా మీకు ఉత్తమమైనదో మీ సర్జన్ తో చర్చించండి.

మత్తు మరియు లోకల్ అనస్థీషియా

ఇది మీ శరీరంలో ఆ ప్రాంతం పై మాత్రమే ప్రభావం చూపిస్తుంది. ఇంట్రావీనస్ (ఐవీ)లైన్ ద్వారా మీ డాక్టర్ మీకు మందులు ఇస్తారు, మరియు మీ ముక్కు కణజాలంలోకి నొప్పిని తగ్గించే ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఫలితంగా మీకు మత్తు కలుగుతుంది కానీ నిద్రపోరు.

జనరల్ సెడేషన్ 

  • మీకు నోటి ద్వారా లేదా  మీ చేతి నరం, మెడ లేదా ఛాతీలో నరంలోకి ఐవీ లైన్ ద్వారా అనస్థీషియా ఇస్తారు.
  • రైనోప్లాస్టి కోసం మీ ముక్కు పుటాలు మధ్య ఉన్న స్థలంలో లేదా మీ ముక్కు లోపల,  మీ ముక్కు అడుగు భాగంలో చిన్న బాహ్య కోత (గాటు చేస్తారు. ) మీ చర్మం క్రింద ఉన్న ఎముక మరియు మృదులాస్థిలను మీ సర్జన్ మళ్లీ  సవరించవచ్చు.
  • తీయవలసిన లేదా చేర్చవలసిన మొత్తం, మీ ముక్కు నిర్మాణం మరియు లభిస్తున్న సామగ్రిలను బట్టి , మీ సర్జన్ మీ ముక్కు ఎముకల రూపం లేదా మృదులాస్థిని ఎన్నో విధాలుగా మార్చవచ్చు. చిన్న సర్దుబాట్లు చేయడానికి మీ ముక్కులో లోతుగా  మీ చెవి నుండి మీ సర్జన్ మృదులాస్థిని ఉపయోగించవచ్చు . సర్జన్ ఇంప్లాంట్స్, మీ శరీరంలో ఇతర భాగాలు నుండి ఎముక, లేదా మీ ప్రక్కటెముకలు నుండి మృదులాస్థిని మరిన్ని ప్రముఖమైన మార్పులు కోసం ఉపయోగించవచ్చు. ఈ సర్దుబాట్లు చేసిన తరువాత, డాక్టర్ మీ ముక్కులో గాట్లను మూసివేస్తారు మరియు చర్మం, కణజాలం మారుస్తారు.
  • మీ ముక్కు నిర్మాణానికి మార్పులు, మిల్లీ మీటర్లలో కూడా సాధారణంగా కొలవబడేవి, మీ ముక్కు ఏ విధంగా కనిపిస్తుంది విషయం పై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. నైపుణ్యం గల సర్జన్ సాధారణంగా ఉత్తమమైన ఫలితం అందిస్తారు. అయితే కొన్ని సందర్భాలలో, చిన్న సర్దుబాట్లు సరిపోవు మరియు మరిన్ని సర్దుబాట్లు కోసం  మీరు మరియు మీ సర్జన్ రెండవ రకం సర్జరీ చేయడాన్ని ఎంచుకోవచ్చు. ఆ విధంగా చేసినట్లయితే, ఫాలో-అప్ సర్జరీ చేయడానికి ముందు మీరు కనీసం ఒక ఏడాది ఆగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సమయానికి మీ ముక్కులో మార్పు కలగవచ్చు.
Top