WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

న్యూమోనియా | OMNI Hospitals

పల్మనాలజీ-న్యూమోనియా

శాఖ

న్యూమోనియా

శ్వాస తీసుకునే ప్రక్రియ సమయంలో రక్తం ఊపిరితిత్తులలో కార్బన్ డయోక్సైడ్ మరియు ఆక్సిజన్ లను మారుస్తుంది. అల్వియోలిగా పిలువబడే చిన్న గాలి తిత్తులు  ఆక్సిజన్ రక్త ప్రవాహంలోకి, చివరిగా శరీరం అంతటా   కణజాలంలోకి  రావడానికి బాధ్యతవహిస్తాయి. ఊపిరితిత్తుల్లో ఏదో ఒక దానిలో లేదా రెండిటిలో ఈ గాలి సంచులు చీము లేదా ద్రవంతో నిండుతాయి మరియు పెద్దవిగా మారి ఆక్సిజన్ మరియు కార్బన్ డయోక్సైడ్ సక్రమంగా మార్పిడి అవడాన్ని పరిమితం చేస్తాయి. ఈ పరిస్థితిని న్యుమోనియాగా నిర్థారిస్తారు.

ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ,ఫంగి లేదా వైరస్ లు వలన కలగవచ్చు. న్యుమోనియా ఆసుపత్రులు వంటి వివిధ ప్రదేశాలలో కలగవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా ప్రాణాంతకమైన వైద్య మందులకు నిరోధకతని కలిగి   ఉండవచ్చు. 

ఇది ఆసుపత్రులు కాని చోటు నుండి కూడా అనగా సాధారణ వాతావరణం నుండి కూడా కలగవచ్చు. 

తెలియని కారణాలు వలన చాలాకాలం వెంటిలేటర్ పై ఉన్న రోగిలో కూడా న్యుమోనియా ఉండవచ్చు. 

తినే పదార్థాలు, పానియాలు మరియు ఉమ్మి నుండి సూక్ష్మ క్రిముల్ని  ఊపిరితిత్తుల్లోకి పీల్చడం వలన కూడా రోగుల్లో న్యుమోనియాను నిర్థారించవచ్చు. దీనిని ఆస్పిరేషన్ న్యుమోనియా అని పిలుస్తారు.

లక్షణాలు 

న్యుమోనియా లక్షణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:

  1. శ్వాస తీసుకోవడంలో క్లిష్టత.
  2. జ్వరం.
  3. చలి.
  4. చీము లేదా కళ్లెతో తీవ్రమైన దగ్గు.
  5. శ్వాస తీసుకునే సమయంలో లేదా దగ్గేటప్పుడు ఛాతీలో సమస్య.
  6. అలసట.
  7. ఆకలి లేకపోవడం.
  8. వికారం/వాంతులు.
  9. తలనొప్పి.

న్యుమోనియాకు గురైన ప్రతి ఒక్కరూ దీని గురించి అప్రమత్తంగా ఉంటారని భావించరాదు. అవును, వాకింగ్ న్యుమోనియా పరిస్థితిలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉండి రోగిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉండదు. లక్షణాలు న్యుమోనియావి ఉంటాయి కానీ స్వల్పంగా ఉంటాయి. డాక్టర్స్ సాధారణంగా దీనిని ‘అటిపికల్ న్యుమోనియా  ‘ అని పిలుస్తారు.

న్యుమోనియా అంటువ్యాధా?

బ్యాక్టీరియా మరియు వైరస్ లు వలన గుర్తించబడిన న్యుమోనియా పూర్తిగా అంటువ్యాధి. దగ్గు మరియు తుమ్మడం ద్వారా గాలిలో ఉండే చిన్న కణాల రూపంలో ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఇది వ్యాపించవచ్చు మరియు రోగి తుమ్మిన లేదా దగ్గిన ఉపరితలాలు మరియు వస్తువులను తాకినప్పుడు కూడా ఇది సోకవచ్చు. ఎవరికైనా వాతావరణం నుండి ఫంగల్ న్యుమోనియా కలగవచ్చు కానీ ఇది అంటువ్యాధి కాదు. 

బ్యాక్టీరియా /వైరస్/ఫంగిని కలిగించే న్యుమోనియా అల్వియోలిని పెద్దది చేస్తాయా ?

కాదు, అల్వియోలి లేదా గాలి సంచులు ఊపరితిత్తుల్లో కలిగిన ఇన్ఫెక్షన్ వలన వ్యాధి నిరోధక శక్తి ద్వారా  శరీరం ద్వారా పెద్దవి అవుతాయి. ఈ అల్వియోలి చీము, శ్లేష్మం మరియు ఇతర ద్రవాలతో నిండి ఉంటుంది. అవి పెద్దవి అయినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 

చికిత్స

సూక్ష్మ క్రిములను కలిగించే ఇన్ఫెక్షన్ ను తెలుసుకోవడానికి వివిధ రక్త పరీక్షలు ద్వారా  మరియు ఇన్ఫెక్షన్ తీవ్రత మరియు  ఉండటాన్ని  గుర్తించడానికి ఎక్స్-రే సహాయంతో వ్యాధి నిర్థారణ జరిగినప్పుడు , ఈ క్రింది విధంగా తత్సంబంధిత విధాలుగా చికిత్స తీసుకోబడుతుంది.  

  • ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన న్యుమోనియా కలిగితే యాంటీబయోటిక్స్ సూచించబడతాయి.
  • రోగులలో పైరెక్సియా మరియు హైపర్ పైరెక్సియా (తీవ్రమైన జ్వరం) ని నిర్మూలించడానికి పారాసిటమోల్ మరియు అటువంటి మందులు సూచించబడతాయి.
  • దగ్గు, కళ్లె మరియు చీము ఏవైనా ఉంటే వాటి తీవ్రతని తగ్గించడానికి సిరప్స్ మరియు మందులు సూచించబడతాయి.
  • ఛాతీలో అసౌకర్యం కలిగిన కేసులలో, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది (టాచీకార్డియా ) లేదా చాలా తక్కువగా కొట్టుకుంటుంది (బ్రాడీకార్డియా), మూత్రపిండాలు పాడవడం లేదా రక్తపోటులో గణనీయంగా తేడాలు వంటి లక్షణాలు ఉండవచ్చు మరియు రోగి 50-60 సంవత్సరాల వయస్సులో ఉండే ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఏర్పడుతుంది.
  • రోగి 2 నెలల వయస్సు లేదా అంతకంటే తక్కువ వయస్సులో ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి. వారికి అధిక జ్వరం, బద్ధకం, ఒంట్లో నీరు లేకపోవడం మరియు శ్వాస తీసుకోవడంలో సమస్య ఉండవచ్చు. 

నివారణ 

న్యుమోనియాను  ఈ క్రింది విధంగా నివారించవచ్చు:

  • ఆరోగ్యవంతమైన జీవనశైలిని నిర్వహించాలి. 
  • ఊపిరితిత్తులు ఇమ్యూనిటీని కలిగి ఉండటానికి పొగ త్రాగడం వదిలివేయాలి. 
  • పరిశుభ్రతను పాటించలి.
  • ప్రతి ఏడాది ఇన్ ఫ్లూయెంజా షాట్ తీసుకోవాలి. 
  • న్యూమోకోకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్ వీ 23) మరియు న్యూమోకోకల్ జంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) వంటి న్యుమోనియాను నివారించే వివిధ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి న్యూమోకోకల్ వ్యాక్సిన్ శ్రేణిలోకి వస్తాయి. 
  • హీమోఫీలిస్ ఇన్ ప్లూయెంజా కోసం వ్యాక్సిన్. 
  • డాక్టర్ సూచించే అదనపు సంబంధిత వ్యాక్సిన్స్. 
Top