WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

అప్పెండెక్టొమి | OMNI Hospitals

గ్యాస్ట్రోఎంటరాలజీ - అప్పెండెక్టొమి

శాఖ

అప్పెండెక్టొమి

అప్పెండెక్టొమి లేదా అప్పెండిసిక్టొమి సాధారణ మాటలలో మనుష్యుల శరీరం నుండి అప్పెండిక్స్ ను తొలగించడానికి చేసే సర్జికల్ ప్రక్రియ. 

చిన్న, గొట్టం ఆకారపు సంచీకి కలపబడిన పొడవైన పేగులను అప్పెండిక్స్ అంటారు. ఇది  పొట్టకు అడుగు వైపు కుడి వైపున ఉంటుంది. పేగులకు కలిగిన ఇన్ఫెక్షన్స్, వాపు మరియు అతిసారం నుండి కోలుకోవడానికి సహాయపడుతుందని విశ్వసించబడింది.  ఇవి కీలకమైన కార్యకలాపాలుగా కనిపించినా కూడా, అప్పెండిక్స్ లేకుండా కూడా శరీరం సాధారణంగా   పని చేస్తుందని నిరూపించబడింది. 

చాలా పరిస్థితులలో, అప్పెండెక్టొమి తీవ్రమైన అప్పెండిసైటిస్ చికిత్స కోసం చేయబడుతుంది. ఎందుకంటే చికిత్స చేయకుండా వదిలేస్తే బ్యాక్టీరియా వేగంగా చీము ఏర్పడటానికి దారితీస్తుంది, అంతిమంగా అప్పెండిక్స్ పగిలిపోతుంది ( పెర్ఫోరేటెడ్ అప్పెండిక్స్),  వివిధ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వెంటనే అత్యవసర వైద్య సహాయం అవసరమవుతుంది. అప్పెండెక్టొమీని లాపరోస్కోపి లేదా పెద్ద కోత చేయడం ద్వారా నిర్వహించవచ్చు. 

అప్పెండక్టొమీని ఎందుకు చేయాలి – వైరస్ లు, బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు తీసుకువచ్చిన వాటితో సహా గ్యాస్ట్రోఇంటస్టైనల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అప్పెండిసైటస్ కు దారితీస్తుంది.  మీ పెద్ద పేగులకు కలపబడిన గొట్టంలో అడ్డంకి లేదా అంతరాయం మరియు అప్పెండిక్స్ కూడా ఈ పరిస్థితికి దారితీయవచ్చు.  అప్పెండిక్స్ లో కలిగిన ఈ పరిస్థితులు చివరిగా కడుపు ఉబ్బరానికి మరియు నొప్పికి దారితీస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే అప్పెండిక్స్ కు వాపు కలుగుతుంది మరియు చీము మరియు విషపూరితమైన పదార్థాలను కడుపులో  స్రవిస్తూ పగిలిపోతుంది . ఇది ప్రాణాంతకమైనది. ఈ పరిస్థితిని నిర్మూలించడానికి అత్యంత ఆచరణసాధ్యమైన పరిష్కారం అప్పెండిక్స్ ను తొలగించడానికి సర్జరీ చేయాలి. సర్జరీ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తికి వివిధ ఇతర మందులు సూచించబడతాయి కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు మరియు భవిష్యత్తులో ఏ సమయంలోనైనా మళ్లీ అప్పెండిసైటిస్ కలిగే ప్రమాదం ఉంది. 

ఇది ఏ విధంగా నిర్వహించబడుతుంది సమస్యను నిర్థారించిన డాక్టర్ మొదట ఇతర పరీక్షలైన కడుపులో సున్నితంగా ఒత్తిడి చేయడం ద్వారా శారీరక పరీక్ష చేస్తారు మరియు కడుపు కండరాలు మరియు వాటి గట్టిదనం విశ్లేషిస్తారు.   ఇతర వైద్య, ఆరోగ్య పరిస్థితుల అవకాశాలను నిర్థారించడానికి రక్త పరీక్షలు (  ఇన్ఫెక్షన్ ను సూచించే అత్యధికంగా ఉన్న తెల్ల రక్త కణాల కౌంట్ నిర్థారించడానికి )సహా ఇతర పరీక్షలు , డిజిటల్ గా మలాశయం పరీక్షించడం, మూత్రం పరీక్షించడం ( మూత్రాశయం ఇన్ఫెక్షన్స్ మరియు రీనల్ కాల్ కులిని తనిఖీ చేయడానికి)  మరియ ఇతర ఇమేజింగ్ పరీక్షలైన సీటీ స్కాన్, ఎక్స్-రే మరియు ఎంఆర్ఐలను నిర్వహిస్తారు.  నొప్పిని కలిగించే ఇతర స్త్రీ సంబంధిత సమస్యలను నిర్థారించడానికి  గర్భిణీ స్త్రీలకు కటి పరీక్ష చేస్తారు. 

అప్పెండిక్స్ ను తొలగించడానికి రెండు రకాల సర్జరీలు ఉన్నాయి. ఓపెన్ అప్పెండెక్టొమీ, ఇది సంప్రదాయబద్ధమైన ప్రక్రియ. రెండవది లాపరోస్కోపిక్ అప్పెండెక్టొమి. ఇది ఇటీవల అభివృద్ధి చెందింది,మినిమల్లీ ఇన్ వేజివ్ టెక్నిక్ గా పేరు పొందింది. 

ఓపెన్ అప్పెండెక్టొమి అప్పెండెక్టొమీ చేసే సమయంలో సర్జన్ కడుపుకు కుడి వైపు చిన్న కోత పెడతారు. అప్పెండెక్స్ తొలగించబడుతుంది మరియు అప్పెండిక్స్ దెబ్బతింటే, ఈ సర్జరీ డాక్టర్ కడుపు లోపల శుభ్రం చేయడానికి వీలు కల్పిస్తుంది. తరువాత ఆ గాయానికి కుట్లు వేయబడి  సురక్షితంగా మూసివేయబడుతుంది. 

అప్పెండిక్స్ పగిలిపోయి ఇతర అవయవాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించిన సంఘటనలలో కూడా డాక్టర్ ఓపెన్ అప్పెండెక్టొమీ నిర్వహించడానికి నిర్ణయిస్తారు. ఇప్పటికే కడుపుకు సర్జరీ చేయించుకున్న వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. 

లాపరోస్కోపిక్ అప్పెండెక్టొమీ అప్పెండిక్స్ ను మరియు ఇతర అంతర్గత అవయవాలను  సులభంగా పరీక్షించడానికి  కడుపులోకి కార్బన్ డయోక్సైడ్ గ్యాస్ ను పంపించి రోగి కడుపు పెద్దది చేస్తారు. 

కడుపు పెద్దగా అయిన తరువాతు లాపరోస్కోపిక్ ను కోత ద్వారా లోపలికి పంపిస్తారు. పొడవైన, సన్నని గొట్టం ముందు భాగంలో  హై-రిజల్యూషన్ కెమేరా మరియు అత్యంత తీవ్రత కలిగిన లైట్  ఉంటాయి. సర్జన్ పొట్ట లోపల చూడగలరు మరియు స్క్రీన్ పై కెమేరా సృష్టించిన చిత్రాలు చూడటం ద్వారా పరికరాలను ఉపయోగించగలరు.  అప్పెండిక్స్ ను గుర్తించి, తొలగిస్తారు, తరువాత కుట్లు వేస్తారు. తదుపరి, చిన్న కోతలను శుభ్రం చేస్తారు, కుడతారు మరియు డ్రెస్సింగ్ చేస్తారు. కడుపులో అమర్చబడిన  గొట్టపు ఆకారం ద్వారా అదే సమయంలో కార్బన్ డయోక్సైడ్ గ్యాస్ విడుదల చేయబడుతుంది. 

అనస్థీషియా  ప్రభావం  ఇంకా కొంచెం ఉండటం వలన డ్రైవ్ చేయడం ప్రమాదంతో కూడినది. అందువలన  చిన్న సర్జరీ అయితే , రోగిని వారి కుటుంబ సభ్యుడు లేదా సంరక్షకుని సహాయంతో అదే రోజు ఇంటికి పంపిస్తారు. ఓపెన్ సర్జరీ అయితే మరియు రోగి ఆసుపత్రిలో చేరిన పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేయడానికి ఒకటి లేదా రెండు రోజులు ముందు పరిశీలనలో ఉంచుతారు. 

అప్పెండెక్టొమీ  చేసిన తరువాత కోతలు చేసిన చోట ఆరంభపు రోజులలో కొంత నొప్పి ఉంటుంది. కొద్ది రోజులలోనే ఏదైనా నొప్పి లేదా గాయం తగ్గిపోతుంది. నొప్పికి చికిత్స చేయడానికి, మీ డాక్టర్ మందులు సూచించవచ్చు. సర్జరీ తరువాత కలిగే ఇన్ఫెక్షన్ ను నివారించడానికి యాంటీబయోటిక్స్ ను కూడా సిఫారసు చేయవచ్చు. కోతలను శుభ్రంగా ఉంచడం ద్వారా, మీరు ఇన్ఫెక్షన్ ను తక్కువ చేసే అవకాశాన్ని మరింత తగ్గించవచ్చు. 

పొట్టలో కొంచెం కార్బన్ డయోక్సైడ్ మిగిలిపోవడం వలన లేదా కోతలు వలన  కడుపులో కొంచెంగా నొప్పి ఉండవచ్చు. ఇది సూచించిన విరామాల్లో నిర్దేశించిన మందులు మరియు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ద్వారా  క్రమేణా తగ్గిపోతుంది. డాక్టర్ కూడా కొంచెం కొంచెంగా , నిత్యం నడవాలని సూచిస్తారు. 

తదుపరి అప్పాయంట్మెంట్ సందర్శన సమయంలో ఏవైనా సర్జికల్ స్టేపుల్స్ లేదా కుట్లు తీసివేయబడతాయి. అడ్ హెసివ్ స్ట్రిప్స్ ను ఉపయోగించితే, వాటిని పొడిగా ఉంచడం ఉత్తమం. అవి కొద్ది రోజులలోనే రాలిపోతాయి. 

Top