WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

మల్టిపుల్ స్క్లేరోసిస్ | OMNI Hospitals

న్యూరాలజీ విభాగం - మల్టిపుల్ స్క్లేరోసిస్

శాఖ

మల్టిపుల్ స్క్లేరోసిస్

మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఎంఎస్) ఒక రకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి. మీకు ఈ వ్యాధి ఉన్నప్పుడు, మీ ఇమ్యూన్ వ్యవస్థ తప్పుగా మీ ఆరోగ్యవంతమైన కణాలు పై ప్రభావం చూపిస్తుంది.  ఇమ్యూన్ వ్యవస్థ మెదడు, వెన్నుముకలో నరాలను కప్పి ఉంచే రక్షణ కవచమైన  మైలిన్ లో కణాలను లక్ష్యంగా దాడి చేస్తుంది. 

మైలిన్ షీత్ కు హాని కలగడం వలన మీ మెదడు నుండి మీ శరీరంలో ఇతర భాగాలకు నరాల ప్రసారాలను ఆటంకం కలుగుతుంది. గాయం మీ మెదడు, వెన్నుముక మరియు కళ్లల్లో లక్షణాలను కలిగించవచ్చు. 

మల్టిపుల్ స్క్లిరోసిస్ నాలుగు రకాలుగా వర్గీకరించబడింది.

  • క్లీనికల్లీ ఐసోలేటెడ్ సిండ్రోమ్ (సీఐఎస్) : ఎవరైనా తమ ఎంఎస్ లక్షణాలను మొదటిసారి అనుభవించినప్పుడు, వైద్యులు దానిని సీఐఎస్ గా వర్గీకరిస్తారు. సీఐఎస్ ఉన్న ప్రతి వ్యక్తికి మల్టిపుల్ స్క్లిరోసిస్ అభివృద్ధి చెందదు. 
  • రిలాప్సింగ్ : రిమిట్టింగ్ మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఆర్ఆర్ఎంఎస్) అత్యంత తరచుగా సంభవించే మల్టిపుల్ స్క్లిరోసిస్ రకం. ఆర్ఆర్ఎంఎస్ తో ఉన్న వ్యక్తులు కొత్త లేదా అధ్వానమైన లక్షణాలు  పునరావృతమవడం లేదా వ్యాధి ప్రకోపించడంగా కూడా ప్రసిద్ధి చెందిన వ్యాధి తీవ్రతను అనుభవిస్తారు.  తగ్గిన సమయాలు వస్తాయి ( లక్షణాలు తగ్గిపోవడం లేదా స్థిరపడటం). 
  • ప్రైమరీ ప్రోగ్రసివ్ ఎంఎస్ (పీపీఎంఎస్) పీపీఎంఎస్ ఉన్న ప్రజలకు పునరావృతమయ్యే విరామాలు లేదా వ్యాధి లక్షణాలు తిరుగుముఖం పట్టడం లేకుండా  క్రమేణా క్షీణిస్తాయి. 
  • సెకండరీ ప్రోగ్రసివ్ ఎంఎస్ (ఎస్ పీఎంఎస్) : ఆర్ఆర్ఎంఎస్ తో మొదటిసారి నిర్థారించబడిన చాలామంది ప్రజలకు తదనందరం ఎస్ పీఎంఎస్ అభివృద్ధి చెందుతుంది. సెకండరీ-ప్రోగ్రసివ్ మల్టిపుల్ స్క్లిరోసిస్ తో, కాలక్రమేణా నరాలకు హాని కలుగుతుంది. మీ లక్షణాలు కాల క్రమేణా అధ్వానమవుతాయి. మీకు ఇంకా పునరావృతమవుతుంటాయి లేదా తీవ్రమవుతాయి (లక్షణాలు అధ్వానమవుతాయి), మీకు  తిరుగుముఖం పట్టిన సమయాలు ఉండవు ( లక్షణాలు వెళ్లిపోయినప్పుడు లేదా స్థిరపడినప్పుడు). 

మల్టిపుల్ స్క్లిరోసిస్ కి గల కారణం ఏమిటి (ఎంఎస్)?

మల్టిపుల్ స్క్లిరోసిస్ దేని వలన కలుగుతుందో నిపుణులకు ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. ఈ పరిస్థితి ఏర్పడటానికి గల కారణాలను నిర్ణయించడంలో సహాయపడటానికి నిరంతరంగా పరిశోధన జరుగుతోంది. ఎంఎస్ ను పెంచే అంశాలలో ఇవి భాగంగా ఉన్నాయి:

  1. నిర్దిష్టమైన వైరస్ లు లేదా బ్యాక్టీరియాకు బహిర్గతమవడం :  ఒక అధ్యయనం ప్రకారం, ప్రత్యేకమైన అనారోగ్యాలకు బహిర్గతమవడం (ఎప్ స్టీన్ -బార్ వైరస్ వంటివి) జీవితంలో ఎంఎస్  తదుపరి దశలో కలుగవచ్చు. 
  2. పర్యావరణం : మీ పర్యావరణం మీకు ఎంఎస్ సంక్రమించే ప్రమాదం పై ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు ఇతరుల కంటే ఎక్కువ వ్యాధి స్థాయిలు ఉన్నాయి. భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలలో ఎంఎస్ అత్యంత సర్వ సాధారణం. దీనికి కారణం ఈ ప్రాంతాలలో సూర్యరశ్మి తక్కువగా సోకుతుంది. తక్కువ ఎండని పొందే ప్రజలకు తక్కువ విటమిన్ డి ఉంటుంది, ఇది ఎంఎస్ కు ప్రమాదకరమైన అంశంగా మారుతుంది. 
  3. మల్టిపుల్ స్క్లిరోసిస్ మీ వ్యాధి నిరోధక వ్యవస్థ పై ప్రభావం చూపించే ఆటోఇమ్యూన్ అనారోగ్యం. కొంతమంది వ్యక్తుల ఇమ్యూన్ కణాలు ఆరోగ్యవంతమైన కణాలను పొరపాటున దాడి చేయడానికి ఏవి కారణాలుగా నిలుస్తున్నాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. 
  4. జన్యు మార్పులు : కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఎంఎస్ ఉంటే ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే, ఏ జన్యువులు లమరియు ఏ విధంగా మల్టిపుల్ స్క్లిరోసిస్ ఆరంభమవడానికి బాధ్యతవహిస్తాయో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. 

ఆప్టిక్ న్యూరైటిస్ ( మసకబారడం మరియు ఒక కంటిలో నొప్పి) వంటి  దృష్టి సమస్యలు మల్టిపుల్ స్క్లిరోసిస్ యొక్క ఆరంభ లక్షణాలలో తరచుగా కనిపిస్తాయి. ఇతర సాధారణ లక్షణాలలో  ఈ క్రిందివి భాగంగా ఉన్నాయి:

  • అలసట.
  • సమతుల్యం లేదా సమన్వయం సమస్యలు.
  • కండరాల ఈడ్పులు. 
  • కండరాల అలసట.
  • మొద్దుబారటం లేదా జలదరింపు ప్రత్యేకించి కాళ్లు లేదా చేతులలో. 

వ్యాధి నిర్థారణ :

ఎంఎస్ గురించి అంతిమ డయోగ్నోసిస్ ని అందించే ఏకైక పరీక్ష ఏదీ లేదు.  మీకు లక్షణాలను ఏవి కలిగిస్తున్నాయో నిర్ణయించడానికి శారీరక పరీక్ష నిర్వహిస్తారు. రక్త పరీక్షలు మరియు  ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించబడతాయి. మెదడు లేదా వెన్నుముకలో గాయాలు (దెబ్బతిన్న ప్రదేశాలు) కోసం చూసే ఎంఆర్ఐ స్కాన్ మల్టిపుల్ స్క్లిరోసిస్ ను సూచిస్తుంది. నరాల చుట్టూ ఉండే మైలిన్ షీత్ హాని చెందినప్పుడు గాయాలు ఏర్పడతాయి. స్పైనల్ ట్యాప్ (లుంబార్ పంక్చర్) కూడా కావాలి. 

మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఎంఎస్) ఏ విధాలలో నియంత్రించబడుతుంది లేదా చికిత్స చేయబడుతుంది ?

ప్రస్తుతం ఎంఎస్ కు ఎలాంటి చికిత్స లేదు.  లక్షణాల నిర్వహణ, పునరావృతమవడం తగ్గించడం ( లక్షణాలు తీవ్రంగా ఉన్న సమయాలు) మరియు వ్యాధి పురోగమించే వేగాన్ని తగ్గించడం పై చికిత్స దృష్టిసారిస్తుంది.  మీ సమగ్రమైన చికిత్సా ప్రణాళికలో ఈ క్రింది అంశాలు ఉంటాయి:

  1. డిసీజ్- మాడిఫైయింగ్ థెరపీస్ (డీఎంటీలు): పునరావృతమవడం ( ఫ్లేర్-అప్స్ లేదా దాడులు) తగ్గించడంలో మందులు సహాయపడతాయి. అవి వ్యాధి పురోగమించే వేగాన్ని తగ్గిస్తాయి.  అవి మెదడులో మరియు వెన్నుముకలో  కొత్త గాయాలు సంభవించడాన్ని నివారిస్తాయి. 
  2. పునరావృతమయ్యే నిర్వహణ కోసం మందులు : మీకు తీవ్రమైన దాడి జరిగితే, మీ న్యూరాలజిస్ట్ కార్టికోస్టిరాయిడ్స్ యొక్క పెద్ద మోతాదు సూచిస్తారు. మందు వెంటనే ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అవి మీ నరాల కణాల చుట్టూ ఉండే మైలిన్ షీట్ నెమ్మదిగా క్షీణించేలా చేస్తాయి. 
  3. శారీరక చికిత్స : మల్టిపుల్ స్క్లిరోసిస్ మీ శారీరక విధులను ఆటంకపరుస్తుంది. మీరు శారీరకంగా ఆరోగ్యంగా మరియు కండరాలు కలిగి ఉంటే మీరు సంచరించడం సులభమవుతుంది. 
  4. మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్ : దీర్ఘకాలం అనారోగ్యంతో సర్దుబాటు చేసుకోవడం ఉద్వేగభరితమైన సమస్య. ఎంఎస్ మీ మనోస్థితి మరియు జ్ఞాపకశక్తి పై కూడా ప్రభావం చూపిస్తుంది. న్యూరోసైకాలజిస్ట్ తో పని చేయడం లేదా ఇతర ఉద్వేగభరితమైన సహాయాన్ని అందుకోవడం కూడా వ్యాధిని నిర్వహించడానికి కీలకం. 

మల్టిపుల్ స్క్లిరోసిస్ పునరావృతం అవకుండా నేను ఏ విధంగా నివారించగలను ?

 ఫ్లేర్ అప్స్ ( దాడులు లేదా పునరావృతాలుగా కూడా పేరు పొందాయి) తరచుదనం తగ్గించడానికి  వ్యాధిని సవరించే మందులు అత్యంత ప్రభావవంతమైన వ్యూహం. ఆరోగ్యవంతమైన జీవన శైలి కూడా ప్రధానం. మీ ఎంపికలు అనారోగ్యం అభివృద్ధి చెందకుండా ఆపుచేయడంలో సహాయపడతాయి. మంచి వైద్య సంరక్షణ కూడా మీ లక్షణాలను తగ్గిస్తాయి మరియు మీ పూర్తి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. 

మీ పరిస్థితికి సహాయపడే  జీవనశైలి సర్దుబాట్లలో ఇవి భాగంగా ఉన్నాయి:

  1. ఆరోగ్యవంతమైన ఆహారం తినడం : అద్భుతమైన ఎంఎస్ ఆహారంగా ఏదీ లేదు. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ఆరోగ్యవంతమైన క్రొవ్వులు మరియు లీన్ ప్రొటీన్ లలో సంతులితమైన, సమృద్ధియైన ఆహారాన్నినిపుణులు ప్రచారం చేసారు. చేర్చబడిన చక్కెరలు, చెడు క్రొవ్వులు మరియు ప్రాసెస్ చేయబడిన భోజనాలు తీసుకోవడం తగ్గించాలి. 
  2. క్రమం తప్పకుండా శారీరకంగా పని చేయడం : కండరాల బలహీనత, సమతుల్యం కోల్పోవడం మరియు నడకలో సమస్య మల్టిపుల్ స్క్లిరోసిస్ లక్షణాలుగా ఉంటాయి. ఏరోబిక్ పని, సరళత మరియు శక్తి కోసం శిక్షణ తీసుకోవడం కండరాల బలం నిర్వహించడానికి  మరియు శారీరకంగా పని చేయడానికి కావాలి. 
  3. ఒత్తిడి నిర్వహణ : ఒత్తిడి వలన శారీరకమైన మరియు ఉద్వేగభరితమైన పర్యవసానాలు ఉంటాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది, ఎంఎస్-సంబంధిత అలసటను ఎక్కువ చేస్తుంది. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి ఒత్తిడితో సర్దుకోవడానికి టెక్నిక్కులు కనుగొనడం ప్రధానం మరియు మానసిక ఆరోగ్య నిపుణులతో పని చేయడం అవసరం. 

నేను డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?

మీకు ఈ క్రింది వాటిలో ఏవైనా లక్షణాలు ఉంటే, మీరు డాక్టర్ ను సంప్రదించాలి:

  • వేడి తట్టుకోలేకపోవడం.
  • ఊగుతున్నట్లు అనిపించడం లేదా అనారోగ్యంగా ఉండటం.
  • జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు.
  • మొద్దుబారటం లేదా జలదరింపు, ప్రత్యేకించి కాళ్లు లేదా చేతులలో.
  • ఊహించని విధంగా దృష్టి మారడం.
  • కాళ్లు లేదా చేతులలో మీకు బలహీనత కలగవచ్చు.
Top