WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

క్రీడల గాయం | OMNI Hospitals

ఆర్థోపెడిక్స్ - క్రీడల గాయం

శాఖ

క్రీడల గాయం

క్రీడలకు సంబంధించిన గాయాలు ఏదైనా క్రీడను ఆడుతున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు కలుగుతాయి. పెద్దలకు కూడా ఈ రకమైన గాయాలు కలుగుతున్నా కూడా, ప్రధానంగా పిల్లలు వాటికి గురవుతుంటారు.

మీరు ఈ క్రింది పరిస్థితులలో క్రీడలకు సంబంధించిన గాయాలకు గురవుతారు:

  • రెగ్యులర్ గా చురుకుగా లేనప్పుడు.
  • వ్యాయామం చేయడానికి ముందు కావలసినంతగా వార్మింగ్ అప్ చేయనప్పుడు.
  • కాంటాక్ట్ క్రీడలో నిమగ్నమైనప్పుడు.
  • క్రీడల సమయంలో కలిగే గాయాలు, మీ చికిత్సా ఎంపికలు మరియు వాటిని నివారించడానికి ఈ రంగంలో మొత్తంగా ఉన్న వ్యూహాలు గురించి మరింత తెలుసుకోండి.

క్రీడల సమయంలో కలిగే గాయాల రకాలు :

వివిధ క్రీడా గాయాలు వివిధ లక్షణాలు మరియు తదనంతర ప్రభావాలు కలిగిస్తాయి. అత్యంత సాధారణమైన క్రీడలకు సంబంధించిన గాయాల రకాలలో ఇవి ఉన్నాయి.

  1. బెణుకులు : లిగమెంట్స్ ను ఎక్కువగా చాచటం వలన లేదా లిగమెంట్ చీలిపోవడం వలన బెణుకులు కలుగుతాయి. ఒక కీలులో రెండు ఎముకలను కలిపి ఉంచే కనక్టివ్ కణజాలం యొక్క తంతువులను లిగమెంట్స్ అంటారు.
  2. స్ట్రెయిన్స్ : కండరాలు లేదా టెండన్స్ చినిగిపోవడం వలన లేదా ఎక్కువగా సాగిపోవడం వలన స్ట్రెయిన్స్ కలుగుతాయి. ఎముకను కండరానికి కలిపే టెండన్స్, కణజాలం యొక్క ప్రధానమైన, ఫైబ్రస్ తంతువు . స్ప్రెయిన్స్, స్ట్రెయిన్స్ తో తరచుగా గందరగోళానికి గురవుతాము. వాటిని వేర్వేరుగా వాటి గురించి ఏ విధంగా చెప్పవచ్చో ఈ క్రింద పేర్కొనబడినది.
  3. మోకాలు గాయాలు: మోకాలు కీలు కదలికను పరిమితం చేసే ఏదైనా క్రీడా సంబంధిత గాయం అనగా మోకాలు కణజాలం లేదా కండరాలు అధికంగా సాగిపోవడం నుండి చినిగిపోవడం వరకు కావచ్చు.
  4. కండరం వాపు : కండరం వాచడం అనేది గాయం యొక్క సాధారణ ఫలితం. కండరం వాచినప్పుడు నొప్పి కూడా కలుగుతుంది.
  5. అచిలీస్ టెండన్ రప్చర్ : మీ కాలి చీలమండ వెనక ఉన్న అచిలీస్ టెండన్ , ఒక బలమైన, సన్నని టెండన్, మీరు క్రీడలు ఆడుతున్నప్పుడు విరిగిపోవచ్చు లేదా పగిలిపోవచ్చు. అలా జరిగినప్పుడు, మీకు తీవ్రమైన, భరించలేని నొప్పి కలిగి మీకు నడవడంలో సమస్య కలగవచ్చు.
  6. ఎముకలు విరగడం : బోన్ ఫ్రాక్చర్స్ కు ఎముకలు విరగటం అనేది మరొక పేరు.
  7. ఎముకలు స్థాన మార్పిడి : క్రీడలకు సంబంధించిన గాయాలు వలన అవి సంభవిస్తాయి. అది కలిగినప్పుడు ఎముక తన సాకెట్ నుండి బయటకు వస్తుంది. దీని వలన వాపు, బలహీనత కలిగి అసౌకర్యం కలగవచ్చు.
  8. రొటేటర్ కఫ్ కు గాయం: రొటేటర్ కఫ్ నాలుగు వేర్వేరు కండరాల సమూహాలతో తయారవుతాయి. రొటేటర్ కఫ్ సహాయంతో మీ భుజం ఏదైనా దిశలో కలగవచ్చు. ఈ కండరాలలో ఒకటి చినిగిపోతే రొటేటర్ కఫ్ తక్కువ బలంగా మారుతుంది.

క్రీడా గాయాలకు కారణాలు

  • క్రీడలకు సంబంధించిన గాయాలు కలగడానికి వివిధ కారణాలు ఉండవచ్చు, అవి:
  • జారిపడిపోవడం వంటి ప్రమాదాలు
  • కావలసినంతగా వార్మింగ్ అప్ లేదా చాచడం చేయకపోవడం.
  • భద్రతా సామగ్రి లేకపోవడం, విరిగిన లేదా సక్రమంగా అరగని సామగ్రి.
  • అసౌకర్యవంతమైన బూట్లు లేదా కావలసినంత మద్దతు ఇవ్వనివి.
  • ఆకస్మికంగా వ్యాయామం నియమావళిని ఆరంభించడం లేదా మీ శరీరానికి అలవాటైన దాని కంటే ఎక్కువగా మీ శారీరక కార్యకలాపాల స్థాయిని పెంచడం.

వ్యాధి నిర్థారణ :

  • క్రీడలకు సంబంధించిన గాయాలను గుర్తించడానికి మీ ఆరోగ్య సంరక్షణ నిపుణులు మీకు శారీరక పరీక్ష చేస్తారు. అసలు ఏమిటి జరిగింది మరియు మీరు అనుభవించిన లక్షణాలు ఏమిటి గురించి వారు ప్రశ్నిస్తారు. ఇంకా, గాయపడిన ప్రాంతాన్ని పరీక్షిస్తారు మరియు అది ఏ విధంగా కదులుతోంది కూడా పరీక్షించవచ్చు.
  • మీకు కలిగిన హాని రకం మరియు తీవ్రతను బట్టి మీ డాక్టర్ ఇమేజింగ్ పరీక్షలు కూడా సూచించవచ్చు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ లేదా ఎక్స్-రేలు మీ శరీరం లోపల ఉన్న అవయవాల ఇమేజెస్ ను ఉత్పన్నం చేయవచ్చు. ఫోటోస్ సహాయంతో వాటిని గుర్తించవచ్చు, మీ యొక్క ప్రత్యేకమైన గాయానికి చికిత్స చేస్తారు.
  • క్రీడా గాయాల స్వభావం మరియు తీవ్రతను బట్టి, వివిధ రకాల చికిత్సలు ఉన్నాయి. విశ్రాంతి మరియు గృహ చికిత్సలతో, చాలా క్రీడా సంబంధిత గాయాలు కొన్ని రోజులు లేదా వారాలలో తగ్గిపోతాయి.

అయితే, మరింత తీవ్రమైన గాయాలకు చికిత్స అవసరం కావచ్చు:

  • వాకింగ్ బూట్, కాస్ట్, స్ప్లింట్, స్లింగ్ లేదా ఇతర వైద్య పరికరాలతో కదలకుండా చేయడం.
  • నొప్పి, వాపు తగ్గడానికి ఇంజెక్షన్స్ చేయడం.
  • ప్రిస్క్రిప్షన్ లో యాంటీ-ఇన్ ఫ్లమేటరి డ్రగ్స్ సూచించడం.
  • లిగమెంట్, టెండన్ లేదా కార్టిలేజ్ గాయాలు లేదా ఫ్రాక్చర్స్ ను బాగు చేయడానికి సర్జరీ .
  • విరిగిన శరీర భాగాలకు శక్తిని కలిగించడం మరియు నయం చేయడానికి, ఫిజికల్ థెరపీ (తరచుగా రీహాబిలిటేషన్ లేదా రీహాబ్ గా సూచించబడుతుంది) ఉపయోగించబడుతుంది.

ముందు జాగ్రత్తల

వ్యాయామం చేసే సమయంలో మీకు హాని కలిగితే ఆడటం లేదా పని చేయడం వెంటనే ఆపు చేయాలి. మీరు కొనసాగిస్తే, మీ కండరాలను మరింత ఒత్తిడికి గురి చేయవచ్చు. రైస్ విధానం చాలా వరకు స్వల్పమైన క్రీడా గాయాలను కొన్ని రోజులలో నయం చేస్తుంది:

  1. విశ్రాంతి: కొన్ని రోజులు కోసం, హాని కలిగిన ప్రాంతాన్ని ఉపయోగించరాదు. మీకు దిగువ శరీరంలో గాయం కలిగితే గాయపడిన చోట బరువు ఉంచడం నివారించడానికి క్రచెస్ ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
  2. ఐస్: నొప్పి, వాపు నుండి ఉపశమనం కలగడానికి, దెబ్బతిన్న ప్రాంతంలో ఐస్ లేదా కోల్డ్ కంప్రెసెస్ ఉపయోగించాలి. ( ఉదాహరణకు, ప్రతి నాలుగు గంటలకు 15 నుండి 20 నిముషాలు).
  3. కంప్రెషన్ : వాపుకు మద్దతు ఇచ్చి, తగ్గించడానికి, ప్రభావానికి గురైన ప్రాంతంలో ఎలాస్టిక్ బ్యాండేజ్ చుట్టాలి. అది హత్తుకొని ఉండేలా నిర్థారించాలి కానీ గట్టిగా పట్టుకోరాదు, ఎందుకంటే అది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది లేదా నొప్పి కలిగిస్తుంది.
  4. ఎత్తైన ప్రదేశం: వాపు తగ్గించడానికి, విశ్రాంతి ఇవ్వడానికి, దెబ్బతిన్న శరీర భాగాన్ని సాధ్యమైనంత వరకు మీ గుండె స్థాయికి ఎగువ ప్రాంతంలో ఉంచాలి. కుషన్ లేదా అటువంటి వస్తువును ఉపయోగించి మీ ఛాతీకి పై భాగంలో గాయాన్ని ఉంచాలి.

డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి

చాల క్రీడా గాయాలకు ఇంట్లో చికిత్స చేసినా కూడా, మీకు ఈ క్రింది లక్షణాలు ఏవైనా ఉంటే మీరు డాక్టర్ ను సంప్రదించాలి:

  • సమయం గడిచినా మెరుగుపడని కదలికను పరిమితం చేసిన నొప్పి.
  • క్రమేణా తగ్గని పెద్ద వాపు.
  • తీవ్రమైన రక్తస్రావం లేదా కమలడం.
  • స్పష్టంగా కనిపిస్తున్న అసాధారణత్వం అనగా సక్రమంగా వంగని కాలు వంటివి.
Top