WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

ఆంజియోప్లాస్టి | OMNI Hospitals

కార్డియాలజీ-ఆంజియోప్లాస్టి

శాఖ

ఆంజియోప్లాస్టి

కరోనరి ఆంజియోప్లాస్టి, వైద్యపరంగా పెర్క్యుటనియస్ కరోనరి ఇంటర్ వెన్షన్ లేదా సాధారణంగా ఆంజియోప్లాస్టీగా పిలువబడుతంది. మూసుకుపోయిన గుండె ధమనులను తెరిచే ప్రక్రియ ఇది. ఆంజియోప్లాస్టీలో  సాధారణంగా గుండె ధమనుల్లో స్టెంట్ ని ఉంచుతారు. ఆంజియోగ్రామ్ ద్వారా ధమనుల్లో అడ్డంకిని గుర్తిస్తారు. కొలెస్ట్రాల్ లేదా క్రొవ్వు కణజాలం లేదా అధికంగా గార నిల్వ ఉండటం వలన ఈ అడ్డంకులు ఏర్పడి గుండె పోటుకు దారితీస్తాయి, కాబట్టి గుండె పోటు వచ్చిన రోగులకు ఆంజియోప్లాస్టీ సాధారణంగా సిఫారసు చేయబడుతుంది. 

ఆంజియోప్లాస్టి 

ఈ క్రింది లక్షణాలు కలిగిన రోగులు కోసం ఆంజియోప్లాస్టి సిఫారసు చేయబడుతుంది:

  • హార్ట్ స్ట్రోక్. 
  • ఆంజినా (తీవ్రమైన గుండె నొప్పి).
  • గుండె ధమనుల్లో అడ్డంకులు /అతిరోస్కోలిరోసిస్.
  • గుండెకు వివిధ రకాల స్కాన్స్ చేసిన తరువాత వచ్చిన అసాధారణ ఫలితాలు దాగున్న సంభావ్య గుండె వ్యాధికి దారితీస్తుంది
  • గుండెకు సంబంధించిన ఇతర అసాధారణ లక్షణాలు ఆధారంగా డాక్టర్ సిఫారసులు

ప్రొసీజర్

ఆంజియోగ్రామ్ లో అసాధారణ రిపోర్ట్ పరిస్థితులు కలిగినప్పుడు ఆంజియోప్లాస్టి నిర్వహిస్తారు. ఇది ధమనుల్లో అడ్డంకి ( బ్లాకేజ్ ) స్థాయిని సూచిస్తుంది. ఆరంభంలో రోగికి లోకల్ అనస్థీషియా ఇస్తారు, తరువాత రోగి గజ్జల్లో లేదా మణికట్టులో కోత ద్వారా మెత్తని, సన్నని గొట్టాన్ని ఉంచారు. పంప్ చేసినప్పుడు తను ఉండే స్థానంలోనే బెలూన్ వలే విస్తరించగలిగే సామర్థ్యం కలిగిన ప్రత్యేకమైన కథెటర్ ఇది. ఎక్స్-రే ఇమేజింగ్ ద్వారా కథెటర్ బ్లాకేజ్ పాయింట్ కు చేరుకున్నప్పుడు ధమనుల గోడ విస్తరించడానికి పంప్ చేయబడుతుంది. ఈ ప్రక్రియ వలన క్రొవ్వు గార రక్త నాళాలు ద్వారా తోయబడుతుంది మరియు బ్లాకేజ్ తొలగిపోతుంది. కొన్ని కేసుల్లో  కథెటర్ బెలూన్ గోడలు పై బహిర్గత హ్యూమన్ సేఫ్ గ్రేడ్ మెటల్ మెష్ ఉంచబడుతుంది. ఈ మెష్ భవిష్యత్తులో తన స్థానంలో ధమనులు ముడుచుకోకుండా అడ్డంకిగా పని చేస్తుంది. తరువాత కథెటర్ సురక్షితంగా తొలగించబడుతుంది. 

ప్రక్రియ వ్యవధి

ఆంజియోప్లాస్టి ప్రక్రియ రోగిని బట్టి 30 నిముషాలు నుండి కొన్నిగంటల సమయం తీసుకుంటుంది.

కరోనరి తరువాత ఆంజియోప్లాస్టి 

ఆంజియోప్లాస్టి ప్రక్రియ తరువాత రోగి తప్పనిసరిగా:

  • మంచి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలి. 
  • ఆల్కహాల్, పొగ త్రాగడం మరియు పొగాకు నమలటం వదిలేయాలి. 
  • ఎల్ డీఎల్ కొలెస్ట్రాల స్థాయిని సాధారణ శ్రేణిలో నిర్వహించాలి. 
  • డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారం వ్యాయామం చేయాలి. 

కోలుకోవడానికి సమయం

ఆంజియోప్లాస్టి ప్రక్రియను ప్రణాళిక చేయకపోతే సాధారణ జీవన శైలిలో పని చేయడానికి  కోలుకునే సమయం సుమారు 7 రోజులుగా ఉంటుంది. అయితే గుండె పోటు వంటి అత్యవసర పరిస్థితిలో ఇది జరిగితే కోలుకునే సమయం కొన్ని వారాలు నుండి కొన్ని నెలలుగా రోగికి గల తీవ్రతను బట్టి ఉంటుంది. 

 

Top