WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

కోల్పోరాఫీ | OMNI Hospitals

అబ్ స్టిట్రిక్స్ మరియు గైనకాలజీ - కోల్పోరాఫీ

శాఖ

కోల్పోరాఫీ

కాల్పోర్‌హఫి అనగా ఇది ఒక సర్జికల్ ప్రక్రియ. మీ యోని గోడల బలహీనతలను బాగు చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది కటి అవయవం జారిపోయినప్పుడు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. మీ యోని గోడలో మద్దతునిచ్చే కండరాలు మరియు కణజాలం అవయవాలను వాటి స్థానంలో ఉంచడంలో చాలా బలహీనంగా ఉంటాయి, మీ కటి లోపలి అవయవాలు పీఓపీతో వాలిపోతాయి. కాల్పోర్‌హఫి ఈ కండరాలు మరియు కణజాలానికి బలాన్ని ఇస్తుంది , మలాశయం మరియు మూత్రకోశం వంటి కటి అవయవాలకు సహాయపడటానికి వాటికి అవకాశం ఇస్తుంది. 

కాల్పోర్‌హఫి రెండు శ్రేణులుగా వర్గీకరించబడింది. యోని గోడ అసాధారణ పరిస్థితులను బాగు చేయడానికి ఇతర ప్రక్రియలతో కలిసి మీ డాక్టర్ ఒకటి లేదా ఈ రెండు చికిత్సలను చేస్తారు.

  1. యాంటీరియర్ కాల్పోర్‌హఫి ( సిస్టోసిల్ రిపైర్ గా కూడా పిలువబడుతుంది) – మీ యోని మరియు మూత్రాశయం మధ్యలో బలహీనపడిన కండరాలు మీ మూత్రాశయం మీ యోని యొక్క ముందరి గోడ వైపు జారిపోయేలా చేస్తుంది. ఇది యాంటీరియర్ వాల్ ప్రొలాప్స్ గా ప్రసిద్ధి చెందిన ఒక రకమైన పీఓపీ. 
  2. పోస్టీరియర్ కాల్పోర్‌హఫి ( రెక్టోసిల్ రిపైర్ గా కూడా పిలువబడుతుంది) –  మీ యోని మరియు మలాశయం మధ్యలో బలహీనపడిన కండరాలు మీ మలాశయం మీ యోని యొక్క వెనక గోడ వైపు వాలిపోవడానికి కారణమవుతుంది. ఇది పోస్టీరియర్ వాల్ ప్రొలాప్స్ గా ప్రసిద్ధి చెందిన పీఓపీ రకం. మీ మలాశయాన్ని పట్టి ఉంచే వెనక గోడలో కండరాలు పోస్టీరియర్ కాల్పోర్‌హఫి చికిత్స సమయంలో బిగించబడతాయి. 

కాల్పోర్‌హఫి తీవ్రమైన సర్జికల్ ప్రక్రియా?

అవును. పీఓపీని రెండు రకాల సర్జరీతో చికిత్స చేస్తారు : అబ్లిటిరేటివ్ (తక్కువ కోతలతో) సర్జరీ మరియు రికనస్ట్రక్టివ్ సర్జరి (ఎక్కువ కోతలు) . కాల్పోర్‌హఫిని మీ యోని ద్వారా చేయబడే  రెస్టోరేటివ్ సర్జరి. కాల్పోర్‌హఫి  మీ కటి అవయవాలను చేరడానికి మీ పొట్టను తెరవడం వంటి ఇతర రికనస్ట్రిక్టివ్ సర్జరీస్ కంటే తక్కువ జోక్యం చేసుకున్నా కూడా ఇది ఇప్పటికీ ప్రధానమైన  సర్జరీగా చెప్పబడుతుంది. 

ఈ చికిత్స ఎందుకు చేయాలి?

మీ ఆరోగ్యంతో జోక్యం చేసుకునే  పీఓపీ లక్షణాలు నుండి ఉపశమనం కలిగించడానికి కాల్పోర్‌హఫి నిర్వహించబడుతుంది. మూత్రం లేదా మలం ఆపుకోలేకపోవడం ( మీరు మూత్రం లేదా మలవిసర్జన నిర్వహించడంలో సమస్య) వంటి పీఓపీ లక్షణాలు మరియు సంయోగంలో బాధ కలగడం మీ జీవిత నాణ్యత పై ప్రభావం చూపిస్తుంది. కాల్పోర్‌హఫి మీ కటిలో నిర్మాణపరమైన సమస్యలను సరిదిద్దుతుంది, ఈ సమస్యలు కలిగించే లక్షణాలను నివారించడానికి మీకు అవకాశం ఇస్తుంది. 

ఈ చికిత్స ఎవరికి కావాలి?

మీరు ఈ క్రింది ప్రమాణాలను నెరవేర్చితే, మీరు కాల్పోర్‌హఫి చేయించుకోవలసిన అభ్యర్థిగా పరిగణించబడతారు:

మీ పీఓపీ లక్షణాలు పై సంప్రదాయబద్ధమైన లక్షణాలు కొంచెం ప్రభావం చూపించినప్పుడు. మీ కటి కండరాలను శక్తివంతం చేయడానికి లేదా మీ అవయవాలను వాటి స్థానంలో ఉంచడానికి  పీఓపీ కోసం కోతలు లేని ప్రక్రియలు   మొదటగా ప్రాధాన్యతనిచ్చి ఎంచుకోబడతాయి. పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు (కెగెల్స్) , పెస్సారిస్ డివైజ్ లు, హార్మోన్ చికిత్సలు వంటివి అందుబాటులో ఉన్నాయి.

మీకు చికాకు కలిగించే లక్షణాలు ఉంటాయి – తమ దైనందిన జీవితంతో జోక్యం చేసుకునే లక్షణాలు పీఓపీ సమస్య  కలిగిన చాలామంది ప్రజలకు ఉండవు. ఎందుకంటే ఏ రకమైన సర్జరీతోనైనా (కాల్పోర్‌హఫి  సహా ) ప్రమాదాల ప్రమేయం ఉంటుంది కాబట్టి  పీఓపీ మీకు చికాకు కలిగించకపోతే సర్జరీతో కలిగే  పర్యవసానాలు ఎక్కువ నష్టాన్ని కలిగించవు. 

మీకు పిల్లలను కనే ఉద్దేశ్యం లేకపోతే – కాల్పోర్‌హఫి తరువాత బిడ్డను కనే ఆలోచన నిర్మాణపరమైన అసాధారణాలను పెంచవచ్చు మరియు లక్షణాలు మళ్లీ కనిపిస్తాయి. మీకు పిల్లలు కలిగేంత వరకు సర్జరీని వాయిదా వేయడం ఉత్తమం.

యాంటీరియర్ మరియు పోస్టీరియర్ కాల్పోర్‌హఫిల మధ్య తేడా ఏమిటి?

సాగిన అవయవాలను పునః స్థానంలో ఉంచడానికి మీ డాక్టర్ కు ఈ రెండు చికత్సలు అవకాశం ఇస్తాయి. బలహీమైన , కణజాలానికి, కండరాలకు మళ్లీ శక్తిని కలిగించడానికి  ఈ అవయవాలను మళ్లీ యధాస్థానంలో నిర్వహించడానికి డాక్టర్స్ కరిగిపోయే సూచర్స్ ఉపయోగిస్తారు. పునః శక్తివంతం చేయడం వలన మీ యోని గోడ మరియు అవయవాలు తమ స్థానంలో ఉంటాయి. 

కాల్పోర్‌హఫికి ముందు ఏమిటి జరుగుతుంది? 

మీ ప్రొవైడర్ కాల్పోర్‌హఫి వలన కలిగే నష్టాలు మరియు ప్రయోజనాలు గురించి మీకు వివరిస్తారు. అందువలన ఈ సర్జరీ మీకు అనుకూలమైనదో లేదో మీరు నిర్ణయించవలసిన అవసరమున్న సమాచారం మీకు ఉంటుంది. 

మీ వైద్య సంరక్షణ నిపుణులు మీకు సౌకర్యవంతంగా ఉండటానికి మొదట అనస్థీషియా ఇస్తారు. మీ కాళ్లకు మద్దకు కోసం బిల్ట్-ఇన్ సౌకర్యవంతమైన ఫుట్ రెస్ట్స్ ఉన్న బల్ల పై మిమ్మల్ని కూర్చోబెడతారు. మీరు మీ వీపుతో పడుకోవచ్చు, కాళ్ల పైకి ఎత్తవచ్చు , మోకాళ్లు 90 డిగ్రీలు వరకు ఒంచవచ్చు, కాలి పిక్కలకు ఫుట్ రెస్ట్స్ సహాయపడతాయి. డోర్సల్ లితోటమి భంగిమ మీ డాక్టర్ మీ యోనిని మరియు మీ యోని మరియు గుదము ( పెరినియమ్) మధ్యలో ఉండే కణజాలాన్ని  సులభంగా చేరుకోవడానికి అవకాశం ఇస్తుంది 

మీరు మంచి స్థానంలో ఉంటే, మీ ప్రొవైడర్ :

ప్రక్రియ జరిగే సమయంలో మీ మూత్రం ఆగడానికి బ్లాడర్ కథెటర్ అమర్చాలి మరియు జనరల్ అనస్థీషియా ( మీరు స్ప్రహలో ఉండరు) లేదా ప్రక్రియ జరిగే చోట రీజనల్ అనస్థీషియా ( మీరు స్ప్రహలో ఉంటారు కానీ ప్రక్రియ జరిగే స్థానం మొద్దుబారుతుంది) ఇస్తారు. మీ యోని గోడలను సులభంగా తనిఖీ చేయడానికి మీ యోనిని స్పెక్యులమ్ తో వెడల్పు చేస్తారు. 

కండరాలు మరియు కణజాలం కనిపించడానికి మీ యోని గోడలో నిలువుగా  కోత చేస్తారు. 

మీ యోని గోడ బలహీనమైన విభాగాలను అంచనా వేయడానికి, మీ యోని ( యాంటీరియర్ కాల్పోర్‌హఫి) ఎగువ గోడ వెంట లేదా మీ యోని (పోస్టీరియర్ కాల్పోర్‌హఫి) వెనక గోడ పై చిన్న, సూక్ష్మమైన కోతలు చేస్తారు. 

మీ యోని గోడ కఠినమైన విభాగాలను కలిపి కుడతారు. 

కోతను మూసివేయడానికి కరిగిపోయే స్యూచర్స్ ఉపయోగిస్తారు. 

కాల్పోర్‌హఫి సర్జరీ నుండి కోలుకోవడానికి ఎంత సమయం కావాలి?

బలహీనమైన కండరాలు చిన్న భాగానికి పరిమితమవుతాయి, సర్జరీకి  చాలా తక్కువగా 30 నిముషాలు సమయం పడుతుంది. మీ యోని గోడ యొక్క పెద్ద భాగాలకు  చికిత్స అవసరం, కాల్పోర్‌హఫి ఎక్కువ సమయం కావాలి. 

కాల్పోర్‌హఫి ప్రక్రియ తరువాత ఏమవుతుంది ?

మీ యోని గోడకు చేసిన మరమ్మతులను బట్టి, అదే రోజు మీరు ఆసుపత్రి నుండి వెళ్లవచ్చు లేదా ఆ రోజు రాత్రి ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం ఏర్పడవచ్చు. 

సర్జరీ చేసిన వెంటనే:

రక్తస్రావం ఆపుచేయడానికి, మీ ఫిజీషియన్ మీ యోని లోపలకు ఇంప్లాంట్ అమర్చవచ్చు. దీనిని 24 గంటలు లోగా తొలగిస్తారు. 

మీ అంతటం మీరు సొంతంగా మూత్ర విసర్జన చేయగలరా లేదా మీకు కథెటర్ అవసరమా అని మీ డాక్టర్ నిర్ణయిస్తారు. కాల్పోర్‌హఫి చేసిన 48 గంటలు లోగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కథెటర్స్ తొలగించబడతాయి.

కండరాలు మరియు కణజాలానికి ఎక్కువ ఒత్తిడి లేకుండా మీరు మల విసర్జన చేయడానికి మీకు స్టూల్ సాఫ్ట్ నర్ లేదా సున్నితమైన లాక్సేటివ్ ఇవ్వవచ్చు. 

మీరు ఈ క్రింది సాధారణ వ్యతిరేక ప్రభావాలను అనుభవించవచ్చు :

  • సర్జరీ తరువాత కొన్ని రోజులు వరకు, మీ మూత్రాశయం ( మూత్రకోశం నిలుపుదల) పూర్తిగా ఖాళీ చేయడంలో మీకు సమస్య కలగవచ్చు. 
  • సర్జరీ తరువాత కొన్ని రోజులు వరకు, యోని నుండి రక్తస్రావం కలగవచ్చు. 
  • సర్జరీ తరువాత కొన్ని వారాలు వరకు, మీ యోని నుండి మీగడ వంటి స్రావం కలగవచ్చు. ఇది మీ శరీరంలో స్యూచర్స్ కరుగుతున్నాయని సూచిస్తుంది. 
  • మీకు యోనిలో అసౌకర్యం ఉండవచ్చు. ఇది నాలుగు నుండి ఆరు వారాలలో తగ్గుతుంది. 
  • సర్జరీ తరువాత నాలుగు నుండి ఆరు వారాలకు పరీక్ష చేయించవలసిందిగా మీ డాక్టర్ మీకు సలహా ఇస్తారు. ఫాలో-అప్ అప్పాయంట్మెంట్స్ కోసం  మీ డాక్టర్ చేసిన సిఫారసులు  అనుసరించాలి. 

ఈ పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ?

కాల్పోర్‌హఫి మీ పొట్ట పై పెద్ద కోత లేకుండానే  మీ పీఓపీ లక్షణాలను తగ్గించవచ్చు. పునః స్థాపన చేసిన అవయవాలు సర్జరీ తరువాత యథాస్థానంలో ఉంటాయి మరియు లక్షణాలు మళ్లీ కనిపించవు. యాంటీరియర్ కాల్పోర్‌హఫికి ఎక్కువగా మిశ్రమ విజయాల రేటు ఉంది. సర్జరీ తరువాత కూడా. మీ యోని యొక్క ముందరి గోడ మీ అవయవం తన స్థానంలో ఉండకుండా జారిపోవడానికి అత్యంత సాధారణమైన స్థానంగా ఉంటుంది. సర్జరీ తరువాత కూడా గోడలు కొంచెంగా బలహీనమైతే, కాల్పోర్‌హఫి తరచుగా లక్షణాలను మెరుగుపరుస్తుంది. 

కటి అవయవం జారకుండా అనగా కాల్పోక్లీసిస్ వంటి కొన్ని చికిత్సలు వలే కాకుండా, కాల్పోర్‌హఫి తరువాత మీరు కోలుకున్నాక మీరు సంయోగంలో పాల్గొనవచ్చు. 

కాల్పోర్‌హఫితో కలిగే ప్రమాదాలు లేదా దుష్ప్రభావాలు ఏమిటి ?

కాల్పోర్‌హఫి సమస్యలు అసాధారణమైనా కూడా, అన్ని సర్జరీలతో ప్రమాదాలు ఉంటాయి. సర్జరీ చేయడానికి ముందు, మీ డాక్టర్ తో సాధారణ ఆరోగ్యం మరియు ఇంతకు ముందు నుండి ఉన్న ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనల  ప్రమాద అంశాలు గురించి తప్పనిసరిగా చర్చించండి. 

సమస్యలలో ఇవి భాగంగా ఉంటాయి:

  1. మలబద్ధకం.
  2. రక్తస్రావం.
  3. సంయోగంలో నొప్పి కలగడం. 
  4. అనస్థీషియాకి సంబంధించిన ప్రతిచర్య
  5. గాయమైన చోట ఇన్ఫెక్షన్.
  6. మీ కటి అవయవాలకు హాని కలగడం.
  7. మూత్రాశయానికి ఇన్పెక్షన్స్ కలగడం (యూటీఐలు).
  8. మలం లేదా మూత్ర విసర్జనలు నియంత్రించలేకపోవడం. 
  9. మీకు చేసిన మరమ్మతుకు బలాన్ని ఇవ్వడానికి మెష్ ఉపయోగించలసిందిగా మీ సర్జన్ మీకు సలహా ఇవ్వవచ్చు. 
Top