WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

ఈసోఫగెక్టొమి | OMNI Hospitals

గ్యాస్ట్రోఎంటరాలజీ - ఈసోఫగెక్టొమి

శాఖ

ఈసోఫగెక్టొమి

సంగ్రహం- ఈసోఫగెక్టొమి ఒక సర్జికల్ ఆపరేషన్.  మీ నోరు మరియు కడుపుకు మధ్య ఉండే ఆహారాన్ని మింగే నాళం (ఈసోఫేగస్) పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించబడుతుంది, తరువాత వేరొక అవయవం నుండి సాధారణంగా కడుపు నుండి కణజాలం ఉపయోగించబడి పునర్నిర్మితమవుతుంది. 

ఈసోఫగెక్టొమి ఎందుకు చేయాలి

అన్నవాహిక కాన్సర్ కు ప్రధానమైన సర్జికల్ చికిత్స ఈసోఫగెక్టొమి. కాన్సర్ నిర్మూలించబడుతుంది లేదా లక్షణాలు తగ్గుతాయి. తీవ్రమైన కాన్సర్ కు ముందు ఉండే కణాలు ఉంటే, ఈసోఫగెక్టొమి ని  ముందిరిన అన్నవాహిక కాన్సర్ కోసం సాధారణ చికిత్సకు అదనంగా బరెట్స్ ఈసోఫేగస్ కు చికిత్స చేయడానికి అప్పుడప్పుడు ఉపయోగిస్తారు. అన్నవాహిక సమస్యకు ఇతర ప్రయత్నాలు విఫలమైనప్పుడు, అనగా ఎండ్-స్టేజ్ అలాసియా లేదా స్ట్రిక్చర్స్ లేదా ఏదైనా తినిన తరువాత  అన్నవాహిక లైనింగ్ కు హాని కలిగిస్తుంటే,  కాన్సర్ కాని వ్యాధులు కోసం ఈసోఫగెక్టొమి చేయవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. 

దీనిని ఏ విధంగా చేస్తారు 

ఓపెన్ ఈసోఫగెక్టొమీ సమయంలో  మెడ, ఛాతీ లేదా పొట్టలో కోత పెడతారు. ఈ ప్రక్రియలో సర్జన్ పూర్తిగా లేదా సగం భాగం అన్నవాహికను తొలగిస్తారు. చాలా కేసులలో వేరొక అవయవంతో సాధారణంగా కడుపుతో అప్పుడప్పుడు చిన్న లేదా పెద్ద ప్రేగులను కూడా ఉపయోగించి అన్నవాహిక మార్పిడి చేయబడుతుంది. 

ఈసోఫగెక్టొమిని తరచుగా లాపరోస్కోపీ, రోబోట్ సహాయం లేదా ఈ రెండు టెక్నిక్కుల కలయికని ఉపయోగించి అతి తక్కువ కోతలతో నిర్వహిస్తారు. అవసరమైనప్పుడు చిన్న కోతల సీరీస్ ద్వారా ఈ ఆపరేషన్స్ నిర్వహించబడతాయి, ఇవి తక్కువ బాధాకరమైనవి మరియు సంప్రదాయబద్ధమైన సర్జరీ కంటే వేగంగా కోలుకుంటారు. 

ఈసోఫగెక్టొమి రకాలు

మెక్యిన్ ఈసోఫగెక్టొమి లేదా ఓపెన్ ఈసోఫగెక్టొమి-  ఓపెన్ ఈసోఫగెక్టొమి చేసే సమయంలో, మెడ, ఛాతీ లేదా పొట్టలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోతలు పెడతారు మరియు గ్యాస్ట్రోఇంటస్టైనల్ నాళాన్ని పునర్నిర్మిస్తారు. అన్నవాహికను తొలగించడానికి  ట్రాన్స్ హొరాసిక్ ఈసోఫగెక్టొమిలో  ఛాతీ, పొట్టలో కోతలు చేయడం సర్జన్ కి ఒక ఆప్షన్. ప్రత్యామ్నాయంగా, డాక్టర్ ట్రాన్స్ హియాటల్ ఈసోఫగెక్టొమిని నిర్వహిస్తారు, దీనిలో మెడ, పొట్టలో కోతలు పెడతారు. అప్పుడప్పుడు, త్రీ-ఫీల్డ్ ఈసోఫగెక్టొమి అవసరం, దీనిలో మెడ, ఛాతీ మరియు పొట్టలో కోతలు చేస్తారు. 

  • థొరాకోఅబ్డామినల్ ఈసోఫగెక్టొమి – ఈ ప్రక్రియలో, ఎడమ వైపు, ఒకే కోత చేయబడుతుంది, ఇది ఛాతీ నుండి పొట్టకు, మెడకు చేసిన కోతగా విస్తరిస్తుంది. 
  • ట్రాన్స్ హియాటల్ ఈసోఫగెక్టొమి – మెడ, పొట్టలో కోతలు చేస్తారు మరియు వాటి మధ్య ఉండే అన్నవాహిక  విభజించబడుతుంది(వేళ్లతో) .
  • ఐవర్ లూయిస్ ఈసోఫగెక్టొమి – ఛాతీకి కుడి వైపు ఒక కోత ఉంటుంది మరియు కడుపుకి మరొక కోత చేస్తారు. 
  • మినిమల్లీ ఇన్ వేజివ్ ఈసోఫగెక్టొమి – ఈ పద్ధతిలో కడుపు (లాపరోస్కోపికల్లీ ) (థొరాకోస్కోపికల్లి) లేదా ఛాతీలో పలు చిన్న కోతలు చేయడం ద్వారా అన్నవాహిక తొలగించడుతుంది. థొరాకోస్కోప్ మరియు లాపరోస్కోప్ లు రెండు పొడవైన, సన్నని , ఒంగే సాధనాలు. వీటిని ఛాతీ మరియు పొట్ట పరీక్షించడానికి ఉపయోగిస్తారు. లాపరోస్కోపిక్ సర్జరీలో, సర్జన్ చిన్న కోతలు చేస్తారు మరియు ఏదైనా కండరం ముక్కలవకుండా లేదా ఏవైనా ప్రక్కటెముకలు విరిగిపోకుండా పరీక్షించడానికి మరియు ప్రక్రియను చేయడానికి కెమేరా ఉన్న డివైజ్ మరియు సాధానాలు అమర్చి సర్జన్ చిన్న కోతలు చేస్తారు. కొన్ని ఆసుపత్రులలో ఈ టెక్నిక్ కు రోబోట్ లు సహాయపడతాయి. 

సర్జరీ తరువాత

  • ఏ రకమైన ఈసోఫగెక్టొమి నిర్వహించినా కూడా, సర్జికల్ ఈసోఫగెక్టొమి చేసిన తరువాత రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ( 24-48 గంటలు) ఉంచుతారు. రోగికి వెంటిలేటర్ తీసివేసిన తరువాత నొప్పి నుండి సాధ్యమైనంత ఉపశమనం కలిగించడానికి ఎపిడ్యూరల్ సవరించబడుతుంది మరియు జెజునోస్టోమి ట్యూబ్ (ఫీడింగ్ ట్యూబ్) సహాయంతో ట్యూబ్ ద్వారా ఆహారాలు అందిస్తారు. ఇది ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయబడుతుంది. రోగి మింగగలిగే సామర్థ్యాన్ని తిరిగి పొందినప్పుడు, సర్జరీ చేసిన తరువాత 30 రోజులు వరకు పోషకాలు అందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. 
  • ముక్కు ద్వారా ప్రవేశించే నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ కూడా రోగిలో ఉంటుంది. కడుపు పై ఒత్తిడి తగ్గించానికి ఈ ట్యూబ్ అవసరం. కడుపు మరియు అన్నవాహికకు మధ్య ఈ  కొత్తగా రూపొందించబడిన లింక్ నయం చేయడంలో కీలకమైన బాధ్యతవహిస్తుంది. 
Top