WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

కరోనరి ఏంజియోగ్రామ్ | OMNI Hospitals

కార్డియాలజీ-కరోనరి ఏంజియోగ్రామ్

శాఖ

కరోనరి ఏంజియోగ్రామ్

గుండె యొక్క ధమనికి సంబంధించిన రక్త నాళాలు కొలెస్ట్రాల్ నిల్వ ఉండటం వలన అడ్డగించబడతాయి, దీనిని కరోనరి ఆర్టరి డిసీజ్ అంటారు. దీనిని గుర్తించడానికి, ఆంజియోగ్రఫి ప్రొసీజర్ నిర్వహించబడుతుంది. దీనిలో గుండెలో రక్తం పంపిణీ చేసే సమయంలో ఏవైనా అడ్డంకులను గుర్తించడానికి ఎక్స్-రే తీస్తారు. ఈ ఆంజియోగ్రఫి నుండి వచ్చే ఇమేజింగ్ ఫలితాలను ఆంజియోగ్రామ్ అంటారు. ఈ పద్ధతిని కార్డియాక్ కథెటిరిజేషన్ అని పిలుస్తారు.

ఇది ఏ విధంగా పని చేస్తుంది 

ఆంజియోగ్రామ్ కోసం డాక్టర్ మనుష్యులకు సరిపోయే రకం సురక్షితమైన డైని గుండె రక్తనాళాల్లో కథెటర్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. ఈ డై రక్త ప్రవాహం ద్వారా ప్రవహించినప్పుడు , రక్తనాళాలకు దగ్గరగా వచ్చినప్పుడు, ఎక్స్-రే మెషీన్ ద్వారా అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇమేజెస్ సెట్ (ఆంజియోగ్రామ్) డాక్టర్ కరోనరి ఆర్టరి వ్యాధి తీవ్రతను విశ్లేషించడంలో డాక్టర్ కు సహాయపడుతుంది.

ఇది ఎప్పుడు మరియ ఎందుకు చేస్తారు 

రోగికి ఈ క్రింది పరిస్థితులు ఉన్నప్పుడు ఆంజియోగ్రామ్ పరీక్ష చేయించవలసిందిగా డాక్టర్ సూచిస్తారు:

  • ఏంజినా, ఛాతీలో తీవ్రమైన నొప్పి.
  • గుండెకు వివిధ రకాల పరీక్షలు చేసినప్పుడు అసాధారణ ఫలితాలు వచ్చినప్పుడు.
  • వివరించలేని విధంగా గుచ్చుకునే నొప్పి ప్రధానంగా దవడ, మెడ మరియు భుజం, చేయి వంటి ప్రధానమైన ప్రదేశాలలో.
  • ఏవైనా ప్రమాదాలు వలన ఛాతీలో గాయం కలిగినప్పుడు.
  • కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ (సీహెచ్ డీలు) అనగా పుట్టుకతోనే గుండెలో లోపం ఉన్నప్పుడు.
  • కరోనరి ఆర్టరి వ్యాధి లక్షణాలు.

ప్రొసీజర్

ఆంజియగ్రామ్ లేదా ఆంజియోప్లాస్టి ప్రక్రియ చేయడానికి ముందు డాక్టర్ రోగి వైద్య చరిత్ర, జీవన శైలి, ప్రస్తుతం తీసుకుంటున్న మందులు, సాధారణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఫలితాలను బట్టి డాక్టర్  గుండెకు ఈసీజీ (ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ) , ఇకోకార్డియోగ్రామ్, గుండెకు స్కానింగ్ వంటి  నాన్ ఇన్ వేజివ్ వైద్య పరీక్షలను సూచించవచ్చు. ఫలితాలను బట్టి డాక్టర్ ఆంజియోగ్రామ్ ను సూచిస్తే, ఆరంభంలో రోగికి నరాలు ద్వారా కొంత మత్తు ఇస్తారు. తరువాత కథెటెర్ గా పిలువబడే  సన్నని, మెత్తని గొట్టాన్ని మణికట్టు లేదా గజ్జలు వద్ద ఉన్న ప్రాంతం నుండి రోగి శరీరంలోకి పంపిస్తారు. ఈ కథెటర్ ద్రవం/డైని స్రవిస్తుంది, ఇది ఎక్స్-రే మరియు దాని రిపోర్ట్స్ ప్రక్రియ కోసం సహాయపడుతుంది. ఆంజియోగ్రామ్స్ పై ఆధారపడి, గుండె ధమనులలో ఉన్న అడ్డంకుల సంఖ్యని తెలుసుకోవచ్చు. రోగికి గుండెలో తీవ్రంగా అడ్డంకులు ఉంటే రోగి ధమనుల్లోకి స్టెంట్ ను అమరుస్తారు, ఇది ముడుచుకుపోయిన ధమనులలో అడ్డంకిని తొలగించి రక్తనాళాల్లో రక్తం మెరుగ్గా ప్రవహించడానికి సహాయపడుతుంది. ఈ ప్రొసీజర్ తరువాత కథెటర్ సురక్షితంగా తొలగించబడుతుంది.

సమయం వ్యవధి 

ఆంజియోగ్రామ్ యొక్క ప్రక్రియ సాధారణంగా 30 నిముషాలు నుండి ఒక గంట సమయం  తీసుకుంటుంది. రోగి పరిస్థితిని బట్టి ప్రొసీజర్  మరియు స్టెంట్ ను ఉంచే అవసరం పొడిగించబడుతుంది.

ప్రొసీజర్ తరువాత 

పూర్తి ప్రక్రియ తరువాత రోగిని కొన్ని గంటలు పరిశీలనలో ఉంచుతారు మరియు పరిశీలనల నివేదికలను బట్టి రోగిని అదే రోజు లేదా మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తారు. సకాలంలో అప్పాయంట్మెంట్ యొక్క ఫాలో అప్ ను డాక్టర్ ప్రణాళిక చేస్తారు. దానితో పాటు కొంత వ్యాయామం మరియు ఆల్కహాల్, పొగాకు ఉపయోగించడం లేదా పొగ త్రాగడం వంటివి వదిలేయడం వంటి  ఆరోగ్యవంతమైన జీవన శైలి కూడా సూచించబడుతుంది.

Top