WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
సంగ్రహం- వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ప్రజలు గురకను అనుభవిస్తారు. గొంతు వెనక భాగంలో ఉన్న కణజాలాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు గురక వస్తుంది మరియు నిద్రావస్థలో ప్రకంపిస్తాయి. గురకతో వచ్చే శబ్దం శ్రేణి స్వల్పం నుండి తీవ్రమైన పెద్ద శబ్దంగా కూడా ఉండవచ్చు. జీవనశైలిలో మార్పులు నుండి ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ) మందులు వరకు గురకను తగ్గించడంలో సహాయపడే వివిధ విధానాలు ఉన్నాయి. కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ (సీపీఏపీ):
కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ (సీపీఏపీ) చికిత్సలో భాగంగా , మీరు నిద్రించే సమయంలో మీ నోటికి మరియు /లేదా ముక్కుకు మీరు మాస్క్ ధరించాలి. ముక్కు పుటాలులోకి నిరంతరంగా గాలిని పంపించే డివైజ్ మాస్క్ కి జత చేయబడి ఉంటుంది. శ్వాశకు ఆటంకం కలగకుండా నివారించడానికి, ముక్కు పుటాల్లోకి ప్రవేశించే గాలి ఒత్తిడి వాయుమార్గం తెరిచి ఉండటానికి సహాయపడుతుంది. బైపాప్ వంటి ఎన్నో పీఏపీ యంత్రాలు లభిస్తున్నాయి. దీనికి ద్వంద్వ వాయు ఒత్తిళ్ల స్థాయి ఉంటుంది, మరియు వీపీఏపీకి, వేరియబుల్ ప్రెషర్ ఎయిర్ లెవెల్స్ ఉంటాయి.
సాధారణంగా డాక్టర్ వోవద్ ది కౌంటర్ మార్గాలను సూచిస్తారు కానీ అన్నీ లేదా చాలా వరకు పద్ధతులను ప్రయత్నించిన తరువాత, ఓరల్ అప్లయన్సెస్ లేదా మౌస్ పీసెస్ వంటి నాన్-ఇన్ వేజివ్ చికిత్సలకు ప్రతిస్పందించకపోవచ్చు, కాబట్టి గురక సమస్య నిరంతరంగా ఉండవచ్చు లేదా కొంత మేరకు మాత్రమే నియంత్రించబడుతుంది. అలాంటి కేసులలో, గురక కోసం చేసే సర్జరీ కీలకమైన ఆప్షన్ గా పరిగణన చేయబడుతుంది.
దీనిని శాశ్వతంగా నయం చేయడానికి పలు సర్జరీలు ఉన్నాయి. రోగికి అత్యంత ప్రభావవంతమైన ఒక దానిని డాక్టర్ సూచిస్తారు.
పిల్లర్ ప్రొసీజర్ (పలాటల్ ఇంప్లాంట్):
పలాటల్ ఇంప్లాంట్ గా కూడా పిలువబడే ద పిల్లర్ టెక్నిక్, వేగంగా చేయబడే ఆపరేషన్. ఇది గురక మరియు స్లీప్ అప్నియాల స్వల్పమైన లక్షణాలను నయం చేయడానికి ఉపయోగించబడుతుంది. దీనిలో నోటి లోపల మృదువైన ఎగువ అంగుడి లోపల చిన్న పాలియెస్టర్ (ప్లాస్టిక్) కడ్డీలను సర్జరీ ద్వారా అమరుస్తారు. ఇది కణజాలాన్ని గట్టిగా ఉంచుతుంది ఫలితంగా కదలడం ,గురక తక్కువయ్యేలా చేస్తుంది.
వులోపలాటోఫారింగోప్లాస్టి (యూపీపీపీ)
వాయు మార్గం మరింత తెరిచి ఉంచడానికి, మెడ వెనక మరియు ఎగువ భాగంలో ఉండే మృదు కణజాలం యొక్క ఒక భాగం లోకల్ అనస్థీషియా ద్వారా సర్జరీ ప్రక్రియ యూపీపీపీ ద్వారా తొలగించబడుతుంది. దీనిలో అంగుటి భాగాలు మరియు గొంతు గోడలు, యువుల ఉంటాయి. ఇది గొంతు నోటిలో వేలాడుతుంది.
టాన్సిలెక్టొమి మరియు అడినోయిడెక్టమి:
గురకను ఆపుచేయడానికి, టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ ని లేదా కొన్ని కేసులలో రెండిటిని తొలగించాలని సలహా ఇవ్వబడుతుంది.
మాక్సిల్లోమాండిబ్యులార్ అడ్వాన్స్ మెంట్ (ఎంఎంఏ):
ఎంఎంఏ అనేది గణనీయమైన సర్జరీ ఆపరేషన్. మీరు మరింత సులభంగా శ్వాస తీసుకోవడంలో సహాయపడే దిగువ (మండిబ్యులార్) మరియు ఎగువ (మాక్సిల్లా) దవడలకు ఆపరేషన్ చేస్తారు. వాయు మార్గాలు మరింతగా తెరుచుకుంటాయి, ఇది అడ్డుపడే అవకాశాన్ని తగ్గిస్తాయి మరియు గురక పెట్టే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి.
హైపోగ్లోస్సల్ నరం ప్రేరేపణ :
ఎగువ వాయు మార్గంలో కండరాలను నియంత్రించే నరాన్ని ప్రేరేపించడం ద్వారా వాయు మార్గాలు తెరిచి ఉంచడాన్ని నిర్వహించడం మరియు గురకను తగ్గించడం సాధ్యమే. హైపోగ్లాస్సల్ నరం సర్జికల్ గా ఇంప్లాంట్ చేయబడిన డివైజ్ ద్వారా ప్రేరేపించబడుతుంది. ఇది నిద్రించే సమయంలో ఆన్ చేయబడుతుంది మరియు ధరించిన వారిలో క్రమబద్ధంగా లేని శ్వాశను గుర్తిస్తుంది.
సెప్టోప్లాస్టి మరియు టర్బినేట్ తగ్గింపు :
ముక్కులో అసాధారణత్వాలు వలన గురక లేదా అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్)లు అనేవి కొన్నిసార్లు కలుగుతాయి. డాక్టర్ సెప్టోప్లాస్టీ గురించి సలహా ఇస్తారు లేదా కొన్ని పరిస్థితులలో టర్బినేట్ రిడక్షన్ సర్జరీని సలహా ఇస్తారు. సెప్టోప్లాస్టి సమయంలో మీ ముక్కు లోపలి కణజాలాలు మరియు ఎముకల ప్రధాన భాగం తిన్నగా చేయబడుతుంది. మీరు శ్వాస తీసుకునే గాలిని వేడి చేసి మరియు తేమగా చేయడంలో సహాయపడే మీ ముక్కు లోపల ఉన్న కణజాలం సైజ్ టర్బినేట్ తగ్గింపుతో తగ్గుతుంది.
జీనియోగ్లోస్సస్ పురోగతి :
దిగువ దవడను కలిపే నాలుక కండరం జీనియోగ్లోస్సస్ పురోగతి ప్రక్రియ సమయంలో ముందుకు లాగబడుతుంది. ఫలితంగా నాలుక గట్టిగా మారుతుంది మరియు మీరు నిద్రించేటప్పుడు తక్కువ విశ్రాంతికి గురవుతుంది. ఇది నాలుకను జత చేసిన చోట దిగువ దవడలో కోత చేయడం ద్వారా జరుగుతుంది, దీనిని పొందడానికి ఎముక ముందుకు లాగబడుతుంది. సరైన స్థానంలో ఉంచడానికి చిన్న స్క్రూ లేదా ప్లేట్ తో ఎముక దిగువ దవడకు కలపబడుతుంది.
హైయోడ్ సస్పెన్షన్ :
సర్జన్ నాలుక బేస్ మరియు ఎపిగ్లోట్టిస్ గా పిలువబడే ఎలాస్టిక్ గొంతు కణజాలాన్ని హైయోడ్ సస్పెన్షన్ సర్జరీలో ముందుకు తోస్తాడు. అత్యధిక వెడల్పుతో తెరుచుకోవడానికి గొంతు యొక్క శ్వాస మార్గాన్ని వెడల్పు చేయడంలో ఇది సహాయపడుతుంది. సర్జరీ స్వర పేటిక పై ప్రభావం చూపించదు కాబట్టి సర్జరీ తరువాత రోగి స్వరంలో ఎలాంటి మార్పు ఉండదు.
మిడ్ లైన్ గ్లోస్సెక్టొమి మరియు లింగువల్ ప్లాస్టీ :
వాయు మార్గాన్ని పెంచడానికి, మిడ్ లైన్ గ్లోస్సెక్టమీగా పిలువబడే సర్జరీ ద్వారా నాలుక సైజ్ చిన్నది చేయబడుతుంది. నాలుక యొక్క మధ్య భాగం మరియు వెనక భాగం ఒక సాధారణ మిడ్ లైన్ గ్లోస్సెక్టొమీ చికిత్స సమయంలో తొలగించబడుతుంది. అవసరమైతే సర్జన్ టాన్సిల్స్ ను కూడా కత్తిరిస్తారు మరియు ఎపిగ్లోట్టిస్ భాగాన్ని కూడా తొలగిస్తారు.
సర్జరీ తరువాత సమస్యలు :
సాధారణంగా సర్జరీ తరువాత గొంతులో పుండు , మింగడంలో లేదా నవ్వడంలో సమస్య కలగడం, గొంతులో మంట మరియు గొంతులో కొంచెంగా నొప్పి వంటి చాలా స్వల్ప సమస్యలు నుండి అసలు సమస్యలు ఏమీ లేకుండా కూడా ఉంటాయి. కొన్ని గంటలు నుండి కొన్ని రోజుల మధ్యలో ఈ అసౌకర్యాలు నుండి రోగు కోలుకుంటాడు కాబట్టి ఈ విషయం గురించి విచారించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా పెద్ద అసౌకర్యం కలిగితే డాక్టర్ ను సంప్రదించవలసిందిగా సలహా ఇవ్వడమైంది.
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.