WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
పాలిప్ అనగా కణజాలంలో ఆరంభమైన ఎదుగుదల మరియు బోలుగా ఉన్న చుట్టు ప్రక్కల వ్యాపిస్తుంది. పాలీపెక్టొమిగా పిలువబడే ప్రక్రియ ద్వారా పాలిప్ తొలగించబడుతుంది. గర్భాశయం మరియు పెద్ద ప్రేగు పాలిపెక్టోమీస్ రెండు అత్యంత ప్రసిద్ధి చెందిన పాలీపెక్టొమీ రూపాలు. పాలీపెక్టొమి లక్షణాలు కలిగిన, కాన్సర్ కారకమైన పాలిప్స్ ను తొలగించడం అనివార్యం చేస్తుంది. లేదా పరీక్షించబడవలసిన అవసరం కలిగించవచ్చు. దీనిని కోతలు లేకుండా సాధారణంగా కలనోస్కోపి ద్వారా ఏకకాలంలో చేస్తారు.
పాలీపెక్టొమీ ఎందుకు చేయాలి
పాలిప్స్ ను తొలగించాలి , ఎందుకంటే కొన్ని కాన్సర్ కారకమైనవి లేదా కాన్సర్ కు ముందు వచ్చేవిగా ఉంటాయి మరియు కొన్ని సంఘటనలలో కాన్సర్ రహితమైనవిగా ఉండవచ్చు. ఏవైనా పాలిప్స్ ను కనుగొనడానికి మొదటి స్టెప్ కలనోస్కోపీ ప్రక్రియ చేయించుకోవాలి. ఏవైనా గుర్తించబడితే, పాలిపెక్టొమీ సమయంలో కణజాలం తొలగించబడుతుంది. ఈ విధంగా పెద్ద ప్రేగు కాన్సర్ ను నివారించవచ్చు.
పాలిప్స్ ఎక్కడ కలుగుతాయి- పాలిపెక్టొమి కోసం అదనంగా సహేతుకంగా తరచుగా కలిగే ప్రదేశాలు :
పాలిప్స్ ను తొలగించకపోతే ఏమిటి జరుగుతుంది
కొన్ని పాలిప్స్ కాన్సర్ కారకాలు మరియు కాన్సర్ కు ముందు పరిస్థితి కావచ్చు. వాటిని తొలగించవలసిన అవసరం ఉంది. కొన్ని పాలిప్స్ నాన్ కాన్సరస్ కానీ వీటిని తొలగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పాలిప్స్ కాన్సర్ ను కలిగించేవి కాకపోయినా పెద్ద పరిమాణంలోకి విస్తరిస్తాయి . అవి కలిగితే, రక్త ప్రవాహాన్ని మార్చవచ్చు, అవయవాలు పై ఒత్తిడి కలిగించవచ్చు మరియు ఇతర వివిధ రకాల లక్షణాలను కలిగించవచ్చు.
సర్జరీ
సర్జికల్ ప్రక్రియ మరియు పాలిప్స్ ఉండే స్థాన పాలిపెక్టొమీ కోసం ఏ విధంగా సిద్ధంగా ఉండాలో నిర్ణయిస్తాయి. ప్రొసీజర్ కోసం, చాలామంది రోగులు మెళుకువగా ఉండటానికి ప్రాధాన్యతనిస్తారు. కొంతమంది జనరల్ అనస్థీషియాను కోరుకుంటారు. ఈ పరిస్థితిలో, వైద్య నిపుణులు ఐవీ సూది ఆధారంగా రోగికి మత్తు కలిగిస్తారు. ఫలితంగా వారికి మత్తు కలిగి నిద్రపోతారు.
ఎండోస్కోప్ తో, డాక్టర్ చాలా వరకు పాలిప్స్ ను తొలగిస్తారు. పెద్ద కోత చేయడానికి బదులు శరీరంలోకి డాక్టర్ గొట్టాన్ని అమరుస్తారు. కాలన్ పాలిపెక్టొమీ చేయడానికి ముందు, ప్రేగులు ఖాళీగా ఉండాలి. లాక్సేటివ్స్, ఎనిమాలు లేదా రెండూ కూడా సర్జరీ చేయడానికి 12 నుండి 24 గంటలకు ముందు కావాలి. రోగి పరిస్థితిని బట్టి వివిధ సర్జికల్ పద్ధతులను ఉపయోగించి పాలిప్స్ ను తొలగిస్తారు. అత్యంత సాధారణమైన విధానాలు
హాట్ స్నేర్ పాలిపెక్టొమి (హెచ్ఎస్ పీ)- వేడి చేసిన స్నేర్ తో చేసే పాలిపెక్టొమి ని హాట్ స్నేర్ పాలిపెక్టొమి (హెచ్ఎస్ పీ) గా పేరు పొందింది మరియు అత్యధిక శాతం పాలిప్స్ కోసం ఎన్నుకున్న చికిత్స ఇది. స్నేర్ గా పిలువబడే లూప్ పాలిప్ ను పట్టుకుని తొలగిస్తుంది. పాలిప్ కణజాలం యొక్క అవశేషాలను కాల్చివేయడానికి, సర్జన్ ఎలక్ట్రోకాటరీని కూడా ఉపయోగిస్తారు.
కోల్డ్ స్నేర్ పాలిపెక్టొమి (సీఎస్ పీ)- కోల్డ్ స్నేర్ పాలిపెక్టొమి అనగా కోల్డ్ స్నేర్ ఉపయోగించబడుతుంది, ప్రత్యేకించి చిన్న (1-5 మీమీ ) పాలిప్స్ కోసం ఉపయోగించబడే పద్ధతి ఇది.
కోల్డ్ లేదా హాట్ ఫోర్సెప్స్ పాలిపెక్టొమి- ఇది చిన్న పాలిప్స్ ను తొలగించడానికి పాత లేదా వాడుకలో లేని పద్ధతి. దీనిలో ఫోర్సెప్స్ ను ఉపయోగించి పాలిప్ ను బయటకు లాగుతారు. దీనిని కోల్డ్ లేదా హాట్ ఫోర్సెప్స్ పాలిపెక్టొమీ అని పిలుస్తారు. సర్జన్ పాలిప్ ను ,కణజాలం పై దాడి చేసిన భాగాన్ని కోయడానికి వైర్ ఉపయోగిస్తారు, పాలిప్ ను ప్రత్యేకించి వేడి చేస్తే, సర్జన్ ఏదైనా పాలిప్ కణజాలం అవశేషాన్ని కాల్చడానికి (కాటరైజేషన్) మరియు ఏదైనా రక్తస్రావం ఆపుచేయడానికి అదనంగా ఎలక్ట్రోకాటరీని ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ సమయంలో, రోగి ఒత్తిడికి లేదా గుచ్చుకున్న భావనకు గురవచ్చు. కానీ వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదు. పాలిప్ ఉన్న స్థానం మరియు ఇతర అంశాలను బట్టి చికిత్స చేయడానికి ముందు, చేస్తున్న సమయంలో, తరువాత కూడా డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఉపయోగించవచ్చు. పాలిప్ ను తొలగించిన తరువాత అది కాన్సర్ కారకమా అవునో కాదో తెలుసుకోవడానికి కణజాలం శ్యాంపిల్ ను ప్రయోగశాలకు పంపిస్తారు. ఫలితాలు ఒక వారం రోజులలో వెల్లడవుతాయి.
పెద్ద పాలిప్స్ విషయంలో సర్జరీ
పెద్ద పాలిప్స్ ను చికిత్స చేయడం సాంకేతికంగా మరింత కష్టమవి భావిస్తారు లేదా వాటి పరిమాణం, అవి ఉన్న స్థానం లేదా నిర్మాణాన్ని బట్టి అత్యధిక ప్రమాదంగా భావిస్తారు. ఎండోస్కోపిక్ సబ్ మ్యూకసల్ డైసెక్షన్ (ఈఎస్ డీ) లేదా ఎండోస్కోపిక్ మ్యూకసల్ రీసెక్షన్ (ఈఎంఆర్) ప్రొసీజర్ లను ఈ పరిస్థితులలో ఉపయోగిస్తారు. ఈ ద్రవ ఇంజెక్షన్ ను ఉపయోగించడానికి సెలైన్ ను తరచుగా ఉపయోగిస్తారు. పాలిప్ ను ఒకసారి తొలగించడానికి పీస్ మీల్ రీసెక్షన్ సూచిస్తుంది. ఈఎస్ డీ కోత లోపల లోతుగా ద్రవాన్ని ఇంజెక్ట్ చేసే ప్రమేయాన్ని కలిగి ఉంది, ఇది పాలిప్ పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఇస్తుంది. ఎండోస్కోప్ ద్వారా తొలగించడానికి సాధ్యం కాని కొన్ని పెద్ద పాలిప్స్ కోసం బౌల్ సర్జరీ చేయవలసిన అవసరం ఉంది.
సర్జరీ తరువాత /కోలుకోవడం
పాలిపెక్టొమి చేసిన తరువాత 24 గంటలు వరకు డ్రైవింగ్ చేయరాదు.
సాధారణంగా త్వరగా కోలుకుంటారు. కడుపు ఉబ్బరం, ఈడ్పులు గ్యాస్ వంటి స్వల్పమైన దుష్ప్రభావాలు ఒకటి లేదా రెండు రోజులలో తగ్గిపోతాయి. మరింత క్లిష్టమైన సర్జరీ నుండి పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాల సమయం కావాలి.
కెఫిన్, టీ, సోడాలు/ఏరేటెడ్ పానియాలు, మద్యం మరియు మసాలా, కారం వంటి ఆహారాలను కొన్ని వారాలు తీసుకోకూడదని ఆహారానికి సంబంధించి డాక్టర్ కొన్ని ఆంక్షలు విధించవచ్చు.
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.