WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

చీలిక పెదవి మరియు అంగిలి | OMNI Hospitals

సాధారణ శస్త్రచికిత్స-చీలిక పెదవి మరియు అంగిలి

శాఖ

చీలిక పెదవి మరియు అంగిలి

ఎగువ పెదవి, అంగిలిలో పగుళ్లు లేదా తెరిచి ఉండటం లేదా రెండూ కూడా తొర్రి పెదవి మరియు చీలిన అంగిలి అని అంటారు. గర్భంలో ఉండే శిశువు యొక్క పెరుగుతున్న  ముఖ కణజాలం పూర్తిగా మూసుకోనప్పుడు, తొర్రి పెదవి మరియు చీలిన అంగిలి  ఏర్పడతాయి. 

పుట్టుకతో కలిగే అత్యంత ప్రబలమైన లోపాలు తొర్రి పెదవి మరియు చీలిన అంగిలి. అవి ఏకైక పుట్టుక లోపాలుగా తరచుగా కనిపించినా కూడా, అవి జన్యుపరంగా సంభవించే రకరకాల  వ్యాధులు లేదా రోగాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 

తొర్రి పెదవి మరియు చీలిన అంగిలిలను సరిదిద్దవచ్చు. ఎక్కువమంది శిశువుల్లో, కొన్ని ఆపరేషన్స్ సాధారణమైన రూపాన్ని ఇచ్చి ఆపరేషన్ కి సంబంధించి  కొంచెంగా లేదా  అసలు మచ్చే లేకుండా సాధారణంగా పని చేయడాన్ని పునరుద్ధరిస్తాయి. 

లక్షణాలు

పెదవిలో లేదా అంగిలిలో చీలిక  (విభజన) పుట్టుక నుండే కనిపిస్తుంది. తొర్రి పెదవి మరియు చీలిన అంగిలి లక్షణాలలో ఇవి భాగంగా ఉంటాయి:

  1. పెదవి మరియు అంగిలిలో ( నోటి లోపల పై భాగం) చీలిక ద్వారా ముఖానికి ఒక వైపు లేదా రెండు వైపులు ప్రభావానికి గురి కావచ్చు. 
  2. పెదవిలో కలిగిన చీలిక పెదవిలో కేవలం చిన్న గాటు వలే కనిపించవచ్చు లేదా ఎగువ చిగురు  మరియ అంగిలి  ద్వారా మరియు ముక్కు అడుగు భాగంలోకి పొడిగించబడవచ్చు. 
  3. ముఖం రూపాన్ని  నోటి లోపల పై భాగంలో ఖాళీ ఎటువంటి ప్రభావం కలిగించదు. 

తక్కువ తరచుగా, తొర్రి పెదవి కేవలం మృదువైన అంగిలి  కండరాలకు ( సబ్ మ్యూకస్ క్లెఫ్ట్ పలేట్) మాత్రమే ప్రభావితం చేస్తుంది, ఇవి నోటి వెనక భాగంలో ఉంటాయి మరియు నోటి లైనింగ్ ద్వారా కాపాడబడతాయి. ఈ రకమైన తొర్రి పుట్టినప్పుడు తరచుగా గుర్తించబడదు మరియు లక్షణాలు కనిపించేంత వరకు కూడా గుర్తించబడకపోవచ్చు. 

  1. తొర్రి పెదవి, తొర్రి అంగిలి  లేదా రెండూ నవజాత శిశువులకు కలగవచ్చు.
  2.  పెదవికి ఒక వైపు  లేదా రెండు వైపులు తొర్రి పెదవితో ప్రభావానికి గురి కావచ్చు. 
  3. ఇది చిన్న గాటుగా స్వల్పంగా కనిపించవచ్చు లేదా ముక్కు వరకు పొడిగించబడిన పెద్ద ఖాళీగా ఉండవచ్చు. 
  4. చీలిన అంగిలి నోటి ముందరి భాగానికి పొడిగించబడిన అంగుడిలో చీలికగా తొర్రి అంగిలి ఉండవచ్చు లేదా నోటి వెనక ఇది ద్వారంగా ఉండవచ్చు. 
  5. నోటి లోపలి పై భాగం లైనింగ్ అప్పుడప్పుడు దానిని దాచవచ్చు. 

గర్భంలో శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఎగువ పెదవి లేదా అంగిలిని కలిపే ఆకృతి విడిపోవచ్చు, ఫలితంగా తొర్రి పెదవి లేదా అంగిలి ఏర్పడుతుంది. కొంతమంది శిశువులకు ఇది కలుగుతుందో తెలియదు. గర్భం ధరించిన సమయంలో మీరు ఏదైనా చేసినా లేదా చేయకపోయినా ఈ సమస్యని కలిగించే అవకాశం ఉంది. 

తొర్రి పెదవి మరియు అంగులి అప్పుడప్పుడు ఈ క్రింది వాటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి:

  1. తల్లితండ్రులు తమ బిడ్డలకు అందిచే జన్యువులు ( చాలా కేసులు కేవలం ఒక్కసారే  అయినప్పటికీ).
  2. గర్భం ధరించిన సమయంలో పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడం లేదా ఆల్కహాల్ వినియోగించడం. 
  3. ఊబకాయం కలిగిన గర్భిణీ మహిళ లేదా కావలసినంత ఫోలిక్ యాసిడ్ పొందని మహిళ. 
  4. గర్భం ధరించిన మొదటి మూడు మాసాల సమయంలో కొన్ని మందులు ఉపయోగించడం అనగా యాంటీ-సీజర్ డ్రగ్స్ మరియు స్టిరాయిడ్ మాత్రలు. 

కొన్ని సందర్భాలలో, 22q11 డిలీషన్ సిండ్రోమ్ వంటి వ్యాధి ( డిజార్జ్ సిండ్రోమ్ లేదా వెలోకార్డియోఫేషియల్ సిండ్రోమ్ గా కూడా పిలువబడుతుంది) లేదా పియరీ రాబిన్ సీక్వెన్స్  పుట్టుకతో వచ్చిన ఇతర సమస్యలతో పాటు తొర్రి పెదవిని లేదా అంగులిని కలిగిస్తాయి. 

తొర్రి పెదవి మరియు అంగులిని నిర్థారించడం

మీరు 18 మరియు 21 వారాల గర్భం ధరించినప్పుడు, మిడ్-ప్రెగ్నసీ అనామల్సీ స్కాన్ నిర్వహించాలి. ఈ సమయంలోనే తొర్రి పెదవి సాధారణంగా గుర్తించబడుతుంది. అల్ట్రా సౌండ్ స్కాన్ లో తొర్రి పెదవిని గుర్తించడం కష్టం మరియు అన్ని రకాల తొర్రి పెదవులు ఈ స్కాన్ లో కనిపించవు. స్కాన్ తొర్రి పెదవి లేదా అంగులిని వెల్లడించకపోతే, పుట్టిన తరువాత  లేదా కొత్తగా పుట్టిన శిశువును 72 గంటలు లోగా  శారీరకంగా పరీక్షించినప్పుడు మాత్రమే గుర్తించబడుతుంది. 

మా నిపుణులు మీ బిడ్డ పరిస్థితిని, కావలసిన ప్రక్రియలు వివరిస్తారు,  మరియు తొర్రి పెదవి లేదా అంగులిని నిర్థారించిన తరువాత మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే పరిష్కరిస్తారు. 

తొర్రి పెదవి మరియు అంగులికి చికిత్స 

మీ బిడ్డ  పెద్దయ్యాక వారికి అవసరమైన చికిత్సలు మరియు అంచనాలు సాధారణంగా దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళకలో చేర్చబడతాయి. ప్రాథమిక చికిత్సలు :

  • మీ బిడ్డ 3 నుండి 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు, తొర్రి పెదవికి సాధారణంగా ఆపరేషన్ జరుగుతుంది మరియు మీ బిడ్డకు 6 నుండి 12 నెలల వయస్సు ఉన్నప్పుడు, చీలిన అంగులికి ఆపరేషన్ జరుగుతుంది. 
  • మీ బిడ్డ తినడంలో సహాయపడటానికి, మీ రొమ్ముకు వారిని ఏ విధంగా తాకించి ఉంచాలి లేదా మీరు ప్రత్యేకమైన సీసాను ఉపయోగించవలసిన అవసరం గురించి మీకు సూచనలు అవసరం. 
  • బిడ్డ వినికిడి శక్తి గురించి దృష్టిసారించడం ప్రధానం . ఎందుకంటే గ్లూ ఇయర్ చీలిన అంగులితో ఉన్న బిడ్డల్లో వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది. వినికిడి పరికరం కేటాయించబడవచ్చు లేదా  గ్లూ ఇయర్ తీవ్రంగా వారి వినికిడి శక్తి పై ప్రభావం చూపిస్తుంటే చెవిలో ఉండే ద్రవం కారిపోవడానికి  గ్రోమ్మెట్స్ గా పిలువబడే చిన్న ట్యూబ్స్ వారి చెవుల్లో అమర్చబడవచ్చు. వారి వినికిడిని బాగా  గమనించడం ప్రధానం. 
  • స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ: స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ మీ బిడ్డ భాష మరియు మాటలు అభివృద్ధి గురించి వారి బాల్యం అంతటా గమనిస్తారు మరియు ఏవైనా సమస్యలు కలిగితే సహాయపడతారు. 
  • ఆర్థోడాంటిక్ సంరక్షణ మరియ పళ్లకు సరైన పరిశుభ్రత – మీ బిడ్డ పళ్లు గురించి ఏ విధంగా శ్రద్ధవహించాలో మీరు సలహా అందుకుంటారు వారి అడల్ట్ టీత్ సరిగ్గా ఏర్పడకపోతే, వారికి బ్రేసెస్ కావాలి. 

తొర్రి పెదవి మరియు అంగులి చిహ్నాలు:

తొర్రి పెదవి లేదా అంగులి కోసం చికిత్స తీసుకున్న చాలామంది పిల్లలు వయోజనులు వలే పూర్తిగా సాధారణ జీవితాలను గడుపుతారు. 

చికిత్స సాధారణంగా ముఖం ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు తినడంలో, మాట్లాడటంలో ఉండే సమస్యలను తగ్గిస్తుంది మరియు ఈ లోపానికి గురైన చాలామంది పిల్లలకు అదనంగా తీవ్రమైన వైద్యపరమైన సమస్యలు ఉండవు. 

 తొర్రి పెదవికి సర్జరీ చేసిన తరువాత పెదవులకు పైన చిన్న గులాబీ రంగు మచ్చ కనిపించవచ్చు. మీ బిడ్డ పెద్ద అవుతున్నప్పుడు ఇది కాలక్రమేణా తగ్గిపోతుంది మరియు చాలా తక్కువగా కనిపిస్తుంది. 

జీవితంలో తరువాత దశలో తొర్రి పెదవి మరియు అంగులి కనిపించే అవకాశం :

  • మీ రెండవ బిడ్డ తొర్రి పెదవి లేదా అంగులితో పుట్టడం చాలా అరుదు. ఎందుకంటే చాలా కేసులు విలక్షణంగా ఉంటాయి. తొర్రి పెదవి లేదా అంగులితో మీకు ఇప్పటికే బిడ్డ ఉంటే, మరొక బిడ్డకు ఇదే సమస్య ఉండే ప్రమాదం కొంత వరకు పెరుగుతుంది, అయితే ఇలా జరిగే అవకాశం 2 నుండి 8%గా అంచనా వేయబడింది. 
  • మీరు లేదా మీ భాగస్వామి ఇరువురూ కూడా తొర్రి పెదవి లేదా అంగులితో పుట్టినప్పుడు మీకు తొర్రి పెదవితో బిడ్డ పుట్టే అవకాశం కూడా 2 నుండి 8%గా ఉంటుంది. 
  • వారసత్వ సమస్యలు ఉన్న పరిస్థితిలో, లేదా తల్లితండ్రి ఈ సమస్యను తమ బిడ్డకు  బదిలీ చేసినప్పుడు కూడా  రెండవ బిడ్డకు కూడా తొర్రి పెదవి లేదా అంగులితో పుట్టే అవకాశం అధికంగా ఉంటుంది. 

డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి

మీరు ఈ క్రింది లక్షణాలను గమనిస్తే, మీరు మా నిపుణుల్ని సంప్రదించవచ్చు:

  • ఫీడింగ్ సమస్యలు.
  • ముక్కు నుండి ఆహారం లేదా ద్రవాలు కారిపోవడానికి కారణమయ్యే మింగడంలో సమస్యలు.
  • ముక్కు స్వరంతో  మాట్లాడటం.
  • తరచుగా చెవిలో ఇన్ఫెక్షన్స్ వస్తుండటం.
Top