WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

గురక | OMNI Hospitals

పల్మనాలజీ-గురక

శాఖ

గురక

ఒక వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు,  గాలి ప్రవాహం  కొంత విశ్రాంతిగా ఉన్న కణజాలం ద్వారా వెళ్లిన వెళ్లినప్పుడు నాలుక, మృదువైన అంగిలి, వాయు మార్గం పెద్దగా కదలవు. ఈ కణజాలం సాగుతుంది కాబట్టి అవి గాలి మార్గాన్ని సన్నగా చేస్తాయి కాబట్టి గాలి వాటి ద్వారా వెళ్లినప్పుడు ప్రకంపనం చెంది ప్రభావం కలిగిస్తాయి, దానినే మనం సాధారణ భాషలో గురక అని పిలుస్తాం. గురక శబ్దం తక్కువగా ఉన్నప్పుడు సాధారణమే కానీ పెద్ద శబ్దం వచ్చినప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి. 

లక్షణాలు

ఎక్కువసేపు గురక పెట్టడం నిద్రకు సంబంధించిన వ్యాధుల్ని కలిగిస్తుంది, అనగా వీటిలో అత్యంత సాధారణమైనది అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ). లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • నిద్రించే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
  • నిద్రించే సమయంలో ఉక్కిరిబిక్కిరి అవడం. 
  • పగటి వేళ అతి నిద్ర. 
  • నిద్ర నుండి మేల్కొన్నప్పుడు గొంతులో నొప్పి. 
  • రాత్రి వేళ ఛాతీ ప్రాంతంలో నొప్పి.
  • అధిక రక్తపోటు. 
  • రోజూవారీ కార్యకలాపాల్లో ఏకాగ్రత లేకపోవడం. 
  • మానసికమైన అలసట
  • భాగస్వామి నిద్రించలేని విధంగా అధికంగా గురక శబ్దం.
  • తలనొప్పి. 

డాక్టర్ ను సంప్రదించడానికి ముందు గమనించవలసిన విషయాలు:

గురుక గురించి తెలుసుకునే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. గురక సమస్య గురించి మనం తెలుసుకోవలసినది ఉంటే గురక మాత్రమే ఒక లక్షణంగా డాక్టర్ ఉత్తమంగా నిర్థారణ చేయడానికి సహాయపడదు. రోగి నిద్రిచే నమూనాని గమనించవలసిందిగా భాగస్వామిని లేదా ఎవరినైనా మనం అడిగితే మెరుగ్గా ఉంటుంది. ప్రధానంగా గురక రకం, పెద్ద శబ్దం రావడం, ఏదైనా అసాధారణమైన శరీర కదలిక, శ్వాశ తీసుకోవడంలో సమస్య, నిద్రించే వేళలు మరియు నిద్రించే నాణ్యత. 

 వ్యాధి నిర్థారణ:

గట్టిగా గురక పెట్టడానికి గల కారణాల్లో ఒకటి ముక్కులో ఉండే నిర్మాణం సెప్టమ్ దారి తప్పడం. దీనిని గుర్తించడంలో సహాయపడటానికి డాక్టర్ ఎంఆర్ఐ మరియు ఎక్స్-రే వంటి కొన్ని పరీక్షలు సూచిస్తారు. 

నిద్ర గురించ అధ్యయనం: 

డాక్టర్ నిద్రా చక్రంగా పిలువబడే పరీక్షని నిర్వహిస్తారు. దీనిలో  పాలీసోమ్నోగ్రఫీగా పిలువబడే రోగి నిద్రించే పూర్తి సమయం పర్యవేక్షించబడుతుంది. దీనిని ఆసుపత్రి మరియు ఇంట్లో రెండిటిలో చేయవచ్చు. 

 నిద్రా అధ్యయనంలో నిద్రించే సమయంలో వివిధ సమయాల్లో ఈ క్రింది వాటిని విశ్లేషించడానికి రోగి శరీరానికి  ఎన్నో సెన్సర్స్ కనక్ట్ చేయబడి ఉంటాయి:

  • గుండె కొట్టుకునే రేట్.
  • శ్వాస తీసుకునే రేట్.
  • రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు. 
  • నిద్రించే వివిధ దశలలో మెదడు తరంగం కార్యకలాపం.
  • శరీర కదలికలు. 
  • వివిధ నిద్రా దశలలో నిద్రించే నాణ్యత. 

సాధారణ గురకను ఏ విధంగా తగ్గించాలి

గురకను నిర్థారించినప్పుడు వివిధ రకాల చికిత్సలు ఉన్నాయి. డాక్టర్ సూచించే అత్యంత సాధారణ అంశాల్లో ఒకటి కేవలం జీవిత శైలి మార్చడం. గురకతో పాటు ఓఎస్ఏ (అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా) కూడా నిర్ధారించబడి  ఉంటే వివిధ రకాల మందులు మరియు సామగ్రిలు ఉపయోగించబడతాయి. సాధారణ గురక విషయంలో ఈ క్రింది విధంగా  జీవన శైలిలో  మార్పులు చేయాలి:

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించడం. 
  • నిద్రించడానికి ముందు ఆల్కహాల్ వినియోగించడం మరియు మత్తు కలిగించేవి నివారించడం. 
  • వీపు పై నిద్రించరాదు. 
  • ముక్కు దిబ్బడ ఉండరాదు
  • ముక్కులో డ్రాప్స్ వేసుకోవాలి.
  • పొగ త్రాగరాదు.
  • కావలసినంత మరియు సరైన సమయంలో నిద్రించాలి. 
Top