WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

మూత్రం ఆపుకోలేకపోవడం | OMNI Hospitals

యూరాలజీ-మూత్రం ఆపుకోలేకపోవడం

శాఖ

మూత్రం ఆపుకోలేకపోవడం

మూత్రం ఆపుకోలేకపోవడం ఒక సమస్య. ఈ సమస్య ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జనను నియంత్రించలేరు. వీరు తమకు తెలియకుండానే ఎప్పటికప్పుడు మూత్ర విసర్జన చేస్తారు. ఈ వ్యాధిని లాస్ ఆఫ్ బ్లాడర్ కంట్రోల్ అని పిలుస్తారు. మూత్రాన్ని పట్టి ఉంచడానికి బాధ్యతవహించే కండరాలు మరియు నరాలు బలహీనపడినప్పుడు ఈ పరిస్థితి నిరంతరంగా సంభవిస్తుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా అందరి మధ్యలో ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ అంతిమంగా ఇది ఒక అనారోగ్య స్థితి. ఇది మహిళలు, మగవారు ఇద్దరికీ కలగవచ్చు, కానీ మగవారితో పోల్చితే మహిళలు కొంచెం ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. ప్రజలు వృద్ధులు అవుతున్న కొద్దీ వారితో మూత్రం ఆపుకోలేని పరిస్థితి అధికంగా ఉంటుంది. తీవ్రత మూత్రం కొన్ని చుక్కలు కారడం నుండి మూత్రాశయం ఖాళీ చేయడానికి బాత్రూంని ఉపయోగించాలనే కోరిక వరకు ఉంటుంది. 

మూత్రం ఆపుకోలేకపోవడం (యూరినరి ఇన్ కాంటినెన్స్) రకాలు 

కొన్ని రకాల యూరినరి ఇన్ కాంటినెన్స్ ఈ క్రింది విధంగా ఉంటాయి.

  1. స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ – తుమ్మడం, దగ్గు లేదా భారీ బరువులు ఎత్తడం వలన మూత్రాశయం పై ఒత్తిడి కలిగి  మూత్రం కారడానికి లేదా మూత్ర విసర్జనకు దారితీస్తుంది. 
  2. ఓవర్ ఫ్లో ఇన్ కాంటినెన్స్ – మూత్రం పూర్తిగా విసర్జన అవకపోవడం తరచుగా మూత్ర విసర్జనను కలిగిస్తుంది. ఎందుకంటే మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాదు. 
  3. అర్జ్ ఇన్ కాంటినెన్స్ – ఈ కేసులో, మూత్రం విసర్జించాలని ఆకస్మిక కోరిక తరువాత  మూత్రం తెలియకుండానే ప్రవహిస్తుంది. ఈ మూత్రం సమస్యను ప్రజలు తరచుగా ఎదుర్కొంటారు. ఇది  యూటీఐ (యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ) గా పిలువబడే స్వల్పమైన తాత్కాలిక స్థితి వలన లేదా నరాల సంబంధిత వ్యాధులు వంటి ప్రధాన అనారోగ్యాలు వలన కలుగుతుంది. డయాబిటీస్ కూడా దీనికి ఒక కారణం. 
  4. ఫంక్షనల్ ఇన్ కాంటినెన్స్ – ఏదైనా మానసికమైన లేదా శారీరకమైన లోపం కావలసిన సమయంలో వాష్ రూంను ఉపయోగించనీయకపోవడాన్ని ఫంక్షనల్ ఇన్ కాంటినెన్స్ అంటారు. 
  5. మిక్స్ డ్ ఇన్ కాంటినెన్స్ – దీనిలో ఏదైనా ఒక దాని కంటే ఎక్కువ యూరినరి ఇన్ కాంటినెన్స్ రూపం ఉంటుంది. 

తాత్కాలికం వెర్సెస్ నిరంతరంగా మూత్రం ఆపుకోలేకపోవడం 

మన రోజూవారీ పనులు మరియు జీవన శైలి కూడా మూత్రం ఆపుకోలేని పరిస్థితిలో ప్రధాన భాగాన్ని ప్రభావితం చేస్తుందని గమనించాలి,  ఇది కేవలం తాత్కాలిక ఆధారితమైనది, మరియు నిరంతర ఆధారితమైనది కాదు. తాత్కాలికంగా మూత్రం ఆపుకోలేని పరిస్థితి ప్రస్తుత సమయానికి ఉంటుంది కాగా నిరంతరంగా మూత్రం ఆపుకోలేకపోవడం దీని పేరు సూచించిన విధంగానే జీవనశైలి అలవాట్లతో సంబంధం లేకుండా నిరంతరంగా ఉంటుంది. తాత్కాలికంగా మూత్రం ఆపుకోలేని పరిస్థితి గురించి డాక్టర్ ను సంప్రదించవలసిన అవసరం లేదు.  డాక్టర్ ని సంప్రదించటం అవసరమా కాదా అని నిర్ణయించడంలో లక్షణాలు సహాయపడతాయి.

తాత్కాలికంగా మూత్రం ఆపుకోలేకపోవడానికి కారణాలు

మనం  సాధారణంగా వినియోగించే కొన్ని ఆహారాలు లేదా కొన్నిసార్లు మిగులులో ఉండేవి డైయురిటిక్స్ గా పని చేస్తాయి. అనగా అధికంగా ఉన్న ద్రవాన్ని తొలగించడానికి మనల్ని అవి అదనంగా మూత్ర విసర్జన చేయిస్తాయి. ఈ ఆహారాలు క్రింద ఇవ్వబడినవి. 

  • చాకొలెట్.
  • ఆల్కహాల్.
  • కెఫిన్.
  • కెఫినేటెడ్ ఎనర్జీ డ్రింక్స్.
  • కృత్రిమ స్వీట్ నర్స్.
  • చిల్లీ పెప్పర్స్.  
  • నిమ్మ జాతి పండ్లు వంటి విటమిన్ c ని వినియోగించే ఆహారం అధిక మోతాదు.
  • మసాలా, యాసిడ్ లేదా ఉప్పు వంటి పెద్ద మొత్తాలను కలిగిన ఆహారాలు

మత్తుని కలిగించే మందులు మరియు మజిల్ రిలాక్సెంట్స్, గుండె మరియు రక్తపోటును నియంత్రించే మందులు వంటి మందులు కూడా దీనికి కారణంగా నిలిచాయి. 

తాత్కాలికంగా మూత్రం ఆపుకోలేని పరిస్థితికి దారితీసే ఇతర కారణాలు యూటీఐలు మరియు మలబద్ధకం. 

యూటీఐ

 మూత్రకోశంలో ఇన్ఫెక్షన్ మూత్రాశయం మరియు మూత్రనాళం వ్యవస్థ  ఇన్ఫెక్షన్ కి సంబంధించినది. ఈ ఇన్ఫెక్షన్ మూత్రాశయానికి మరియు దాని చుట్టుప్రక్కల కండరాలకు  చికాకు కలిగిస్తుంది. అంతిమంగా ఇది మూత్ర విసర్జన చేయాలని కోరికను పెంచుతుంది మరియు కొన్నిసార్లు ఆపుకోలేకపోవడం ద్వారా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. 

మలబద్ధకం 

అవును, మలబద్ధకం కూడా తాత్కాలికంగా మూత్రం ఆపుకోలేని పరిస్థితికి కారణంగా చెప్పబడుతుంది. మూత్రాశయం మరియు మలాశయం దగ్గరగా ఉండటం మరియు ఆ ప్రాంతానికి చుట్టుప్రక్కల నరాలను అత్యంతగా పంచుకుంటాయి. మలబద్ధకం ఆ ప్రాంతంలో నరాల పనిని పెంచుతుంది, ఫలితంగా తరచుగా మూత్ర విసర్జన చేయడం పెరుగుతుంది. 

నిరంతరంగా మూత్రం ఆపుకోలేని పరిస్థితికి కారణాలు

వివిధ కారణాలు శాశ్వతంగా మూత్రం ఆపుకోలేని పరిస్థితిని కలిగిస్తాయి. అవి  ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

  1. ఊబకాయం.
  2. వారసత్వం.
  3. పొగాకు ఎక్కువగా వినియోగించడం.
  4. నరాల వ్యాధి.
  5. మెదడులో కంతి/స్ట్రోక్.
  6. వెన్నుముకకు గాయం. 
  7. ప్రోస్టేట్ కాన్సర్. 
  8. గర్భం ధరించడం – గర్భస్థ శిశువు అదనపు బరువు వలన తల్లి బరువులో పెరుగుదల స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ కు దారితీస్తుంది. 
  9. హార్మోన్స్ లో మార్పులు – సహజంగా వయస్సు పెరగడం, గర్భం ధరించడం మరియు బహిష్టులు ఆగిపోవడం వలన అసంఖ్యాకంగా హార్మోనల్ మార్పులు కలుగుతాయి. 
  10. రడం – వ్యక్తులు వృద్ధులు అవుతున్నప్పుడు మూత్రాశయాన్ని నియంత్రించే కండరాలు బలహీనంగా మారుతాయి కాబట్టి మూత్రం యొక్క పరిమాణం నిల్వ చేయడం  మరియు ఆపి ఉంచే వ్యవధి రెండిటిలో సామర్థ్యం తగ్గిపోతుంది.
  11. బహిష్టులు ఆగిపోవడం – బహిష్టులు ఆగిపోయిన తరువాత, మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది మూత్రాశయం మరియు దాని లైనింగ్ ను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడానికి బాధ్యతవహిస్తుంది. మూత్రాశయంలో కణజాలాన్ని బలహీనపరుస్తుంది మరియు మూత్రం ఆపుకోలేని పరిస్థితిని ప్రేరేపిస్తుంది. 
  12. ఎన్ లార్జ్ డ్ ప్రోస్టేట్ – మగవారిలో  వీర్య గ్రంధి విస్తరించడాన్ని వైద్యపరంగా బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా అని పిలుస్తారు. ఇది మూత్రం ఆపుకోలేని పరిస్థితికి దారితీస్తుంది. మగవారిలో మూత్రం ప్రవహించడానికి వీర్య గ్రంధి కూడా కారణం. 
  13. బ్లాకేజ్ – మూత్రపిండాల్లో (రీనల్ కాల్ క్యులస్) రాళ్ల ఏర్పడటం వంటి అడ్డంకులు లేదా మూత్రాశయంలో కణితి లేదా మూత్రకోశంలో ( మూత్రాశయంలో రాళ్లు) రాళ్లు ఏర్పడటం కూడా మూత్రం అసాదారణంగా ప్రవహించడానికి కారణమవుతాయి.

చికిత్స

రోగికి గల తీవ్రమైన పరిస్థితిని బట్టి ఎన్నో పద్ధతులలో మూత్రం ఆపుకోలేని స్థితికి చికిత్స చేయబడుతుంది.  కావలసిన చికిత్సా రూపాన్ని నిర్ణయించడానికి  రోగికి నిర్థారణ చేసే డాక్టర్ ఉత్తమమైన వ్యక్తి. చికిత్స యొక్క మూడు ప్రాథమికమైన రూపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

  1. ఔషధేతర రూపం – దీనిలో ప్రాథమికంగా జీవన శైలిని కొంత కాలం మార్చవలసి ఉంది, అనగా బీఎంఐకి  (బాడీ మాస్ ఇండెక్స్ ) సంబంధంలో సరైన బరువును నిర్వహించడానికి శరీరంలో ఉండే అధిక క్రొవ్వును తగ్గించడం , మూత్రకోశాల శిక్షణ మరియు పెల్విక్ ఫ్లోర్ కి సంబంధించిన వ్యాయామాలు. 
  2. మందులు – మూత్రం రేట్ /ప్రవాహాన్ని నియంత్రించడానికి మందులు సూచించబడతాయి. 
  3. సర్జరీ గాటు – అన్ని పద్ధతులు సహాయపడటంలో విఫలమైతే, మూత్రం ఆగని పరిస్థితి నుండి శాశ్వతమైన ఉపశమనానికి సర్జరీ నిర్వహించడమే పరిష్కారం.  ఒత్తిడి వలన ప్రేరేపించబడిన ఇన్ కాంటినెన్స్ ను మహిళల్లో నియంత్రించడానికి రిట్రోబ్యూబిక్ సస్పెన్షన్ లేదా ప్రోలాప్స్ కోసం పెల్విక్ ఫ్లోర్ పై సర్జరీ చేయాలి లేదా మూత్రాశయం మరియు మూత్రకోశానికి మద్దతుగా స్లింగ్ ప్రొసీజరన్ నిర్వహించాలి. 

 

Top