WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
పర్మనెంట్ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ (పీపీఐ) లేదా పేస్ మేకర్ అనగా ఒక చిన్న ఎలక్ట్రానికి డివైజ్. బ్రాడికార్డియా లేదా క్రమబద్ధంగా గుండె కొట్టుకోని అతి తక్కువ హార్ట్ రేట్ గల రోగుల్లో సరిగ్గా గుండె కొట్టుకోవడాన్ని నిర్వహించడంలో సహాయపడే పరికరం. ఇది ప్రాణాంతకరమైన పరిస్థితి. ఈ సమస్యను వెంట్రిక్యులార్ డిస్ సింక్రొనిగా పిలుస్తారు. పేస్ మేకర్ ను రోగి కాలర్ ఎముక క్రింద అమరుస్తారు.
ఇది ఏ విధంగా పని చేస్తుంది
పేస్ మేకర్ అనగా ఒక చిన్న లోహంతో చుట్టబడిన సర్క్యూట్. మైక్రో కంప్యూటర్ ద్వారా ఎలక్ట్రానికల్ గా ఇది పని చేస్తుంది. ఈ మైక్రోచిప్ ప్రధానంగా 2 భాగాలుగా ఉప విభజన చేయబడుతుంది. ప్రతి లీడ్ కు ఎలక్ట్రోడ్స్ మరియు పల్స్ జనరేటర్ ఉంటాయి. రోగి గుండె ఏకరీతిగా కొట్టుకోని సమయంలో లేదా కావలసిన దాని కంటే అతి తక్కువగా కొట్టుకుంటున్నప్పుడు సక్రమం కాని రక్త పరిమాణం శరీరంలో పంపిణీ చేయబడుతుంది, ఇది ప్రమాదకరం, కాబట్టి ఈ సమయంలో పేస్ మేకర్ పని చేస్తుంది. ఇది విద్యుత్తు ప్రేరేపణలు ద్వారా గుండెకు సంకేతాలు అందచేస్తుంది, తద్వారా గుండె సరైన లయలో తిరిగి పని చేసేలా సహాయపడుతుంది.
పేస్ మేకర్ ఎలా పని చేస్తుంది
పేస్ మేకర్ చిన్న ఎలక్ట్రానిక్ బ్యాటరీ ద్వారా పని చేస్తుంది. దీనిని పేస్ మేకర్ యూనిట్ లో ఉంచుతారు. ఇది 7 నుండి 10 సంవత్సరాలు దీర్ఘకాలం పని చేస్తుంది.
పేస్ మేకర్ ఇంప్లాంట్స్ రకాలు
మనుష్యుల గుండెకు నాలుగు కవాటాలు ఉంటాయి అనగా ఎగువ వైపు 2 మరియు దిగువ వైపు 2 ఉంటాయి . పేస్ మేకర్ యూనిట్స్ 3 రకాలుగా ఉంటాయి, వాటిని రోగి గుండెకు గల సమస్యని బట్టి రోగి ఎగువ ఛాతీలో ఇంప్లాంట్ చేస్తారు. ఈ మూడు రకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
పేస్ మేకర్ ఏ విధంగా ఇంప్లాంట్ చేయబడుతుంది
ఇంప్లాంట్ చేయడానికి ముందు, చికిత్స చేసే డాక్టర్ రోగి వైద్య నివేదికలు, కుటుంబ చరిత్ర, అలెర్జీలు, ప్రక్రియలు మరియు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి.
సర్జరీ కోసం, రోగికి ఐవీ డ్రిప్ ద్వారా , అనస్థీషియా (మత్తు) ఇస్తారు. చిన్న గాటుతో సర్జన్ సన్నని మెత్తని గొట్టాన్ని కాలర్ బోన్ క్రింద అమరుస్తారు. ఇది రక్త నాళాలు ద్వారా గుండె వద్దకు చేరుకుంటుంది. ఫ్లూరోస్కోపి ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా దాని స్థానం గమనించబడుతుంది. ప్రతిది దాని స్థానంలో అమరిని తరువాత పేస్ మేకర్ చర్మం క్రింద అమర్చబడుతుంది. అదే సమయంలో వివిధ రకాలుగా గుండెకు స్కాన్స్ తీసి ప్రధానమైన అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని నిర్థారిస్తారు.
సర్జరీ తరువాత, రోగిని ప్రధానమైన పరిశీలనలో ఉంచుతారు, అతని అవయవాలు సాధారణంగా పని చేస్తున్నాయని మరియు ఇంప్లాంట్ వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవని గమనించి నిర్థారిస్తారు. గుండె కొట్టుకునే రేట్ మరియు శరీరంలో రక్తానికి సంబంధించి ఇతర అవయవాలు సరిగ్గా పని చేస్తున్నాయని నిర్థారించిన తరువాత రోగిని రికవరీ వార్డ్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు.
శరీరం చేసే పనికి అనుగుణంగా సరైన గుండె లయ కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు:
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.