WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

డయాలసిస్హీ మోడయాలిసిస్ | OMNI Hospitals

నెఫ్రాలజీ - డయాలసిస్హీ మోడయాలిసిస్

శాఖ

డయాలసిస్హీ మోడయాలిసిస్

హీమోడయాలిసిస్, లేదా సాధారణంగా డయాలిసిస్ గా పిలువబడే ఈ ప్రక్రియలో  శాశ్వతంగా మూత్రపిండాలు పాడైనప్పుడు మరియు ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ (ఈఎస్ ఆర్ డీ)గా కూడా పిలువబడే పరిస్థితి ఏర్పడినప్పుడు బయటి యంత్రం ఒకటి మూత్రపిండాల స్థానంలో పని చేస్తుంది. దీని విధుల్లో మూత్రపిండాలు యొక్క విధులు కూడా భాగంగా ఉంటాయి, అనగా వ్యర్థాలు, లవణాలను ఫిల్టర్ చేయడం నుండి రక్తంలో అధికంగా ఉన్న విష పదార్థాలను ఫిల్టర్ చేయడం వరకు అన్ని పనులు నిర్వహిస్తుంది. ఇది రోగి చురుకైన జీవన శైలిని జీవించడంలో సహాయపడుతుంది. 

డయాలిసిస్ ను ఎప్పుడు నిర్వహించాలి?

  • డయాలిసిస్ ను సాధారణంగా రెండు పరిస్థితులలో నిర్వహించాలి అనగా.
  • మూత్రపిండాలు మొత్తం దెబ్బతినడం /శాశ్వతంగా మూత్రపిండాలు పాడవడం.
  • డ్రగ్స్, విషాలు మరియు విష పదార్థాలను శరీరం నుండి ఫిల్టర్ చేయడానికి/బయటకు పంపించడానికి. 

డయాలిసిస్ రకాలు 

రెండు రకాలైన డయాలిసిస్ లు గలవు అవి

హీమోడయాలిసిస్ – ఇక్కడ, డయాలిజర్ గా పిలువబడే  బయటి నుండి ఒక యంత్రం రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఫిస్టులాలోకి లేదా గ్రాఫ్ట్ అనగా సిరకు మరియు ధమనులకు మధ్య ఒక కనక్షన్ ఏర్పరిచి  2 సూదులు కనక్ట్ చేయబడతాయి. ఎన్నో ఫైబర్స్, డయాలిసేట్ కలిగిన డయాలైజర్, వ్యర్థాలను ఫిల్టర్ చేస్తుంది మరియు ఫిల్టర్ చేయబడిన రక్తాన్ని రోగి శరీరంలోకి రెండవ సూది ద్వారా పంపిస్తుంది. ఈ సెషన్ తరువాత సూదులు/గొట్టాలు సురక్షితంగా తొలగించబడతాయి మరియు రోగిని డిశ్చార్జ్ చేస్తారు. 

అత్యవసరంగా డయాలిసిస్ చేయవలసిన పరిస్థితిలో ఒక కేంద్ర వీనస్ కథెటర్ గజ్జలలోని సిరల్లోకి లేదా మెడ ఉపరితలంలోకి అమర్చబడుతుంది.  డయాలిసిస్  ప్రక్రియ తరువాత  కథెటర్ ( సన్నని , మెత్తని గొట్టపు ఆకారం) సురక్షితంగా తొలగించబడుతుంది. 

పెరిటోనియల్ డయాలిసస్

ఇక్కడ, రక్తం మెషీన్ యొక్క ఏదైనా బయటి ప్రాంతానికి బదిలీ కాదు కాబట్టి  కడుపులో పెరిటోనియల్ లైనింగ్ ఫిల్టరేషన్ కోసం కీలకమైన బాధ్యతవహిస్తుంది. కథెటర్ బొడ్డు చుట్టూ ఉన్న ప్రాంతం ద్వారా కడుపులోకి అమర్చబడుతుంది, దీని ద్వారా డయాలిసేట్ కడుపులోకి వెళ్తుంది. తరువాత ప్రత్యేకమైన ద్రవంగా పిలువబడే డయాలిసేట్ తో కడుపు నింపబడుతుంది. చివరిగా, అన్ని విష పదార్థాలు మరియు రక్తంలో ఉండే ఇతర వ్యర్థ పదార్థాలు డయాలిసేట్ లోకి తీసుకోబడతాయి. తరువాత ఇది వేరొక చివర అమర్చబడిన ప్రత్యేకమైన సంచీలోకి సేకరించబడి మరియు పడవేయబడుతుంది. 

మూత్రపిండాలు పాడవడానికి కారణాలు

సాధారణంగా మూత్రపిండాలు ఆకస్మికంగా దెబ్బతినవు కానీ మూత్రపిండాల సామర్థ్యం క్రమేణా క్షీణిస్తుంది. ఇది కేవలం ఒక అంశం వలన కాకుండా వివిధ అంశాలు కలిసి జరుగుతుంది. అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • అధిక రక్తపోటు.
  • రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండటం.
  • మూత్రపిండాల్లో వాపు, వైద్యపరంగా దీనిని గ్లోమెరులోనెఫ్రైటిస్ గా పిలుస్తారు.
  • మూత్ర పిండాల్లో (పీకేడీ) సిస్ట్స్ ఏర్పడటం లేదా పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి.
  • రక్త నాళాలు వాపు.
  • మూత్రపిండాలకు గాయం కలగడం /ప్రమాదం కలగడం.
  • గుండె పోటు.

ఎంత తరచుగా డయాలిసిస్ చేయాలి?

డయాలిసిస్ ను రోగి యొక్క తీవ్రమైన అనారోగ్యం ఆధారంగా నిర్వహించాలి. వ్యాధి నిర్థారణ చేసే డాక్టర్ మాత్రమే తమ సంబంధిత సమయంలో చేయవలసిన డయాలిసిస్ సెషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీని ఉత్తమంగా సూచించగలరు. 

సాధారణంగా చాలామంది ప్రజలు వారానికి మూడుసార్లు డయాలిసిస్ పొందుతారు, ఇన్-సెంటర్ హీమోడయాలిసిస్ గా దీనిని పిలుస్తారు. ప్రతి సెషన్ 3 నుండి 5 గంటల సమయం తీసుకుంటుంది. 

తీవ్రమైన పరిస్థితులలో ఉన్న రోగులు కోసం, ప్రతిరోజూ  అయితే స్వల్ప సమయం వరకు మాత్రమే దాదాపుగా డయాలిసిస్ చేస్తారు. దీనిని ఇంట్లో చేస్తారు. ప్రతి సెషన్ 2 నుండి 3 గంటల సమయం తీసుకుంటుంది. 

Top