WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

కిడ్నీ మార్పిడి | OMNI Hospitals

నెఫ్రాలజీ-కిడ్నీ మార్పిడి

శాఖ

కిడ్నీ మార్పిడి

శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, అధిక మొత్తంలో నీటిని రక్తంలో నుండి ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలు కీలకమైన బాధ్యతవహిస్తాయి. ఇది విటమిన్ డీని శరీరంలో ఉపయోగించబడే రూపంలోకి మార్చడంలో కూడా సహాయపడుతుంది. వివిధ కారణాలు వలన మూత్ర పిండాలు పూర్తిగా పని చేయడం ఆగిపోవడం వలన , దీనినే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీస్ అంటారు, రోగికి  డయాలిసిస్  తీసుకోవాలి లేదా మరణించిన లేదా జీవించి ఉన్న అవయవ దాత నుండి మూత్ర పిండాల మార్పిడి  పొందాలి.  

మూత్రపిండాలు పాడవటానిక గల కారణాలు 

మూత్ర పిండాలు పాడవడానికి వివిధ కారణాలు గలవు. అవి ఈ క్రింద ఇవ్వబడినవి:

  • తీవ్రమైన డయాబిటీస్ ఉన్నప్పుడు మూత్ర పిండాలు రక్తాన్ని సాధారణంగా ఫిల్టర్ చేయడంలో విఫలమవుతాయి.
  • మూత్ర పిండాల్లో సిస్ట్స్ ఏర్పడటం. ఇది వారసత్వం కూడా కావచ్చు. 
  • అధిక రక్తపోటు మూత్ర పిండాలకు సమీపంలో ఉన్న ధమనుల్ని సన్నగా చేసి చివరిగా పని చేయడంలో విఫలమవుతాయి.
  • పెద్ద ప్రమాదం వలన మూత్ర పిండాలకు గాయం కలుగుతుంది.

హిమోడయాలిసిస్ వెర్సెస్ మూత్ర పిండాల మార్పిడి & ఎందుకు

హీమోడయాలిసిస్ ప్రక్రియలో డయలైజర్ గా పిలువబడే బయటి యంత్రం రోగికి గ్రాఫ్ట్ ద్వారా జత చేయబడుతుంది. రోగి నుండి ఈ రక్తం డయలైజర్ కు బదిలీ చేయబడుతుంది, అక్కడ రక్తం కృత్రిమ మూత్ర పిండాలు వలే ఫిల్టర్ చేయబడుతుంది తరువాత ఫిల్టర్ చేయబడిన రక్తం శరీరంలోకి గొట్టాలు ద్వారా బదిలీ చేయబడుతుంది. ఈ విధంగా రోగి శరీరాన్ని బట్టి  వారానికి మూడుసార్లు లేదా దాదాపు ప్రతిరోజూ చేయాలి.

తదుపరి  మూత్రపిండాలు మార్పిడి వరకు రోగికి హిమోడయాలిసిస్ సూచించబడుతుంది.  ఈ క్రింది కొన్ని కారణాలు వలన హిమోడయాలిసిస్ కంటే మూత్ర పిండాల మార్పిడి సూచించబడుతుంది:

  • హిమోడయాలిసిస్ ప్రక్రియ కొన్నిసార్లు బాధాకరమైనది. 
  • రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ప్రతిసారి బయటి యంత్రం కావాలి. 
  • డయాలిసిస్ కోసం తరచుగా ఆసుపత్రికి రావలసి ఉంటుంది. 
  • డయాలిసిస్ తీసుకుంటున్న రోగి కంటే మూత్ర పిండాల మార్పిడి పొందిన వ్యక్తి జీవిత కాలం ఎక్కువ ఉంటుంది. 
  • మూత్ర పిండాల మార్పిడి అనేది సాధారణ పరీక్ష కోస ఆసుపత్రికి తక్కువసార్లు చేసే సందర్శనలతో  ఒకసారి చేసే ప్రక్రియ. 

రెండు మూత్ర పిండాల పూర్తిగా పని చేయడం ఆగిపోయినప్పుడు మూత్ర పిండాల మార్పిడి సూచించబడుతుంది. 

ప్రతి ఒక్కరు మూత్ర పిండాల మార్పిడి ఖర్చు భరించలేరు. ఎందుకంటే డయాలిసిస్ కోసం ప్రతి సెషన్ కు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయాలి.  ఆసుపత్రిని బట్టి మూత్ర పిండాల మార్పిడికి కొన్ని లక్షలు ఖర్చు చేయాలి. రెండవది మార్పిడి కోసం సరిపోలే అవయవ దాత అందుబాటులో ఉండాలి.

మూత్రపిండాలు మార్పిడి చేయడం చట్టబద్ధమేనా?

అవును, భారత ప్రభుత్వం జారీ చేసిన  1994, ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ చట్టం ప్రకారం, కేవలం చికిత్సా లక్ష్యాలు కోసం మాత్రమే మరియు వాణిజ్య లక్ష్యాలు కోసం కాకుండా  మరణించిన లేదా జీవించిన అవయవ దాత ద్వారా మూత్రపిండాల మార్పిడ చేయడం పూర్తిగా చట్టబద్ధం. 

మూత్రపిండాల మార్పిడి యొక్క ప్రక్రియ 

రోగి మరణించిన దాత యొక్క మూత్రపిండాలు క సం వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలి లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుడు దాతగా ఉండటానికి సిద్ధమైతే సాధ్యమైనంత త్వరగా రోగికి సర్జరీ చేయవచ్చు:

  • దాత నుండి సమ్మతి తీసుకున్న తరువాత, దాత మూత్రపిండాలు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు. కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి మరియు వైద్య చరిత్ర తీసుకోబడుతుంది. అందువలన ఆ రోగికి మూత్రపిండాలు సరిపోలుతాయి. 
  • ఒకసారి ప్రతిది చేసిన తరువాత, రోగి మరియు దాత ఇరువురికి అనస్థీషియా ఇవ్వబడుతుంది, ఎందుకంటే ఇరువురి శరీరాలకు ఒకేసారి ఆపరేషన్ జరుగుతుంది. 
  • అనస్థీషియా ప్రభావం తరువాత, సర్జన్ చిన్న గాటు పెట్టి  మూత్రపిండాన్ని తొలగిస్తారు. దీనినే నెఫ్రెక్టొమి అని అంటారు. 
  • వేరొక సర్జన్ రోగి శరీరం పై కావలసిన తయారీలు చేస్తారు. అందువలన కొత్త మూత్రపిండాల మార్పిడికి శరీరం అనుకూలంగా ఉంటుంది. 
  • దాత మూత్రపిండం రోగికి ఉంచబడుతుంది, సహజంగా పని చేయని మూత్రపిండాలు వాటి స్థానంలో అదే విధంగా ఉంటాయి. 
  • రోగి మరియు దాత ఇరువురికి సర్జికల్ కోతలు మూసివేయబడతాయి. 
  • రోగిని పరిశీలనలో ఉంచుతారు మరియు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని ఇతర పరీక్షలు నిర్వహించబడతాయి. 
  • పరిశీలన తరువాత దాత మరియు రోగి ఇరువురూ డిశ్చార్జ్ చేయబడతారు. 

సర్జరీ తరువాత

  • నెఫ్రోలజిస్ట్ తో సకాలంలో ఫాలో అప్ ని రోగి ఏడాది వరకు కొనసాగించాలి. 
  • ఆరోగ్యవంతమైన ఇమ్యూనిటీని నిర్వహించడానికి ఆపకుండా వివిధ మందులు తీసుకోవాలి, అందువలన శరీరం కొత్త మూత్రపిండాలను తిరస్కరించదు. 
  • వివిధ ఇన్ఫెక్షన్స్  మరియు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి అదనపు డ్రగ్స్ ని సకాలంలో తీసుకోవాలి. 
  • గుండె ఆరోగ్యంగా పని చేయడానికి ఆరోగ్యవంతమైన జీవన శైలి మరియు అత్యంత పరిశుభ్రతని నిర్వహించాలి. 

మూత్రపిండాల దానం గురించి వాస్తవాలు 

  • కేవలం  1 మూత్రపిండంతో ఒక వ్యక్తి జీవించగలరు. కాబట్టి దాతలు ఎల్లప్పుడూ చురుకుగా మరియు ఆరోగ్యవంతమైన జీవన శైలితో జీవించగలరు. 
  • మూత్రపిండాలు దానం చేయడం చట్టబద్ధం కానీ విక్రయించడం కాదు. 
Top