WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
పార్కిన్ సన్ వ్యాధి అనగా మీ మెదడులో ఒక భాగం క్షీణిస్తుంది, కాల క్రమేణా లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాధి కండరాల నియంత్రణ , బ్యాలెన్స్, మరియు కదలికలు పై ప్రభావం చూపిస్తుందని పేరు పొందింది కానీ ఇది మీ ఇంద్రియాలు, ఆలోచించే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం మరియు ఇతర అంశాలు పై కూడా ప్రభావం చూపిస్తుంది.
పార్కిన్ సన్ వ్యాధి వయస్సుతో పాటు సహజంగా అభివృద్ధి చెందుతుంది మరియు ఇది ఆరంభమయ్యే సగటు వయస్సు 60. ఇది మహిళల్లో లేదా పీపుల్ బార్న్ ఫీమేల్ (డీఎంఏబీ) (డీఎఫ్ఏబీ) కంటే మగవారిలో లేదా పర్శన్స్ బార్న్ మేల్ (డీఎంఏబీ)లో కొంచెంగా ఎక్కువగా ఉంటుంది.
పార్కిన్ సన్స్ వ్యాధి సంప్రదాయబద్ధంగా వృద్ధాప్యంతో సంబంధాన్ని కలిగి ఉండటంతో, ఇది వయోజనులను 20 ఏళ్ల చిన్న వయస్సులోనే (ఇది ఎంతో అరుదైనా కూడా, తరచుగా ఈ పరిస్థితితో తల్లితండ్రి లేదా బిడ్డను కలిగిన ఉన్న ప్రజలకు )కలుగుతోంది.
ఈ పరిస్థితిలో ఏది ప్రాబల్యంగా ఉంటుంది?
పార్కిన్సన్ వ్యాధి అనేది వయస్సుకు సంబంధించిన రెండవ అతి సాధారణమైన క్షీణించిన మెదడు అనారోగ్యం. ఇది అత్యంత తరచుగా మోటార్ (కదలిక) మెదడు వ్యాధి కూడా. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన వయోజనులలో కనీసం 1 % వయోజనులు పై ప్రభావం చూపిస్తుంది.
ఇది నా శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
పార్కిన్ సన్స్ వ్యాధి మీ మెదడులో నిర్దేశిత ప్రాంతం బాసల్ గాంగ్లియాను క్షీణింపచేస్తుంది. ఈ ప్రాంతం క్షీణిస్తే, మీకు ఇంతకు ముందు నియంత్రణ ఉన్న నైపుణ్యాలను కోల్పోతారు. పరిశోధన ప్రకారం పార్కిన్ సన్స్ వ్యాధి మీ మెదడు రసాయనంలో గణనీయమైన మార్పు చూపిస్తుంది.
సాధారణ పరిస్థితులలో, మీ మెదడు మీ మెదడు కణాలు (న్యూరాన్స్) వేరొక దానితో ఏ విధంగా కనక్ట్ చేయబడతాయో నియంత్రించడానికి న్యూరోట్రాన్స్ మిట్టర్స్ గా పిలువబడే రసాయనాలను ఉపయోగిస్తుంది. పార్కిన్ సన్స్ వ్యాధి డోపమైన్ లోపం కలిగిస్తుంది. ఇది అత్యంత కీలకమైన న్యూరోట్రాన్స్ మిట్టర్స్.
మీ మెదడు మీ కండరాలకు యాక్టివేషన్ సంకేతాలను పంపించినప్పుడు, ఇది మీ కదలికలను ఉపయోగించి డోపమైన్ అవసరమైన కణాలను సర్దుబాటు చేస్తుంది. అందుకే తగ్గిన కదలికలు మరియు ఒణుకు వంటి పార్కిన్ సన్స్ వ్యాధి లక్షణాలు డోపమైన్ కొరత వలన కలుగుతాయి.
పార్కిన్ సన్స్ వ్యాధి లక్షణాలు అధ్వానమవుతాయి మరియు వ్యాధి అభివృద్ధి చెందుతున్న కొద్దీ వ్యాపిస్తాయి. మీ మెదడు ఏ విధంగా పని చేస్తుందో వ్యాధి తదుపరి దశ తరచుగా ప్రభావితమవుతుంది, ఫలితంగా మతి స్థిమితం కోల్పోవటం వంటి లక్షణాలు మరియు మానసిక ఒత్తిడి వంటివి కలుగుతాయి.
పార్కిన్ సన్స్ వ్యాధి మరియు పార్కిన్ సోనిజమ్ ల మధ్య గల భేదం ఏమిటి ?
పార్కిన్ సోనిజమ్ అనేది పోల్చదగిన లక్షణాలతో పార్కిన్ సన్స్ వ్యాధి మరియు ఇతర అనారోగ్యాలు కోసం ఒక విస్త్రతమైన పదజాలం. ఇది పార్కిన్ సన్స్ వ్యాధి కాకుండా , బహుళ వ్యవస్థల అట్రోఫి లేదా కార్టికోబాసల్ క్షీణత వంటి ఇతర వ్యాధులను సూచిస్తుంది.
చిహ్నాలు మరియు లక్షణాలు ఏమిటి ?
కండరాలు నియంత్రణ కోల్పోవడం పార్కిన్ సన్స్ వ్యాధి యొక్క అత్యంత ప్రసిద్ధి చెందిన లక్షణాలలో ఒకటి.
మోటార్ డిస్ ఫంక్షన్ లక్షణాలు.
పార్కిన్ సన్స్ వ్యాధి మోటార్ లక్షణాలు లేదా కదలికకు సంబంధించిన లక్షణాలలో ఈ క్రిందివి భాగంగా ఉంటాయి:
ఇతర మోటార్ చిహ్నాలలో ఇవి భాగంగా ఉన్నాయి:
సాధారణం కంటే తక్కువ తరచుగా కళ్లు ఆర్పడం. ఇది కూడా అధ్వానమైన ముఖ కండరాల నియంత్రణకు చిహ్నం.
నాన్ మోటార్ లక్షణాలు
కదలిక మరియు కండరాల నియంత్రణతో సంబంధం లేని పలు లక్షణాలు కూడా సాధ్యమే. నాన్-మోటార్ లక్షణాలు మోటార్ లక్షణాలు కంటే ముందుగా కనిపిస్తే ఈ వ్యాధి కోసం ప్రమాదకరమైన అంశాలుగా భావించబడ్డాయి. కానీ, వ్యాధి యొక్క ఆరంభ దశలలో ఈ లక్షణాలు కనిపిస్తాయని సాక్ష్యం ఉంది. ఈ లక్షణాలు మోటార్ సమస్యలకు ముందు, దశాబ్దాలు కాకపోయినా, సంవత్సరాలలో కనిపించే హెచ్చరిక సూచికలుగా ఉండవచ్చని ఇది సూచిస్తుంది.
నాన్-మోటార్ లక్షణాలు ( సంభావ్యమైన ఆరంభపు హెచ్చరిక సంకేతాలు ప్రధానంగా కనిపించినవి) :
ఆలోచించడంలో మరియు ఏకాగ్రతలో సమస్యలు (పార్కిన్ సన్స్ డిమెన్షియా).
ఇది ఏ విధంగా గుర్తించబడుతుంది?
పార్కిన్ సన్స్ వ్యాధి సాధారణంగా వైద్యపరంగా గుర్తించబడుతుంది, అనగా మీ డాక్టర్ మీ లక్షణాలను పరీక్షితారు, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు మరియు మీ వైద్య చరిత్రను సమీక్షిస్తారు. ఇతర అనారోగ్యాలు లేదా కారణాలను నిర్థారించడానికి సాధారణంగా అవసరమైన కొన్ని వ్యాధి నిర్థారణ మరియు లేబరేటరీ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు పార్కిన్ సన్స్ వ్యాధి చికిత్సకు మీరు ప్రతిస్పందించనంత వరకు అధికశాతం రక్త పరీక్షలు అవసరం లేదు, ఇది మీకు వేరొక అనారోగ్యం ఉందని సూచిస్తుంది.
ఈ పరిస్థితి తీవ్రతను నిర్ణయించడానికి ఏయే పరీక్షలు చేయబడతాయి?
పార్కిన్ సన్స్ వ్యాధి ఉందని లేదా ఇతర అనారోగ్యాలను నిర్థారించవలసిన అవసరం ఉందని మీ డాక్టర్ అనుమానించినప్పుడు వివిధ ఇమేజింగ్ మరియు డయోగ్నిస్టిక్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
దీని కోసం చికిత్స ఉందా మరియు ఇది నయమవుతుందా?
పార్కిన్ సన్స్ వ్యాధి ఇప్పుడు నయం చేయలేనటువంటిది, అయితే దాని లక్షణాలను నిర్వహించడానికి ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సలు కూడా ఆయా వ్యక్తుల వ్యక్తిగత లక్షణాలు మరియు కొన్ని చికిత్సల ప్రభావాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఈ అనారోగ్యానికి ప్రధాన చికిత్స మందులు.
రెండవ చికిత్సా రకం ప్రకారం మీ మెదడులో డివైజ్ అమర్చడం. ఇది చిన్న విద్యుత్తు కరంట్ ( లోతైన మెదడు ప్రేరేపరణగా పిలువబడుతుంది) ని అందిస్తుంది. స్టెమ్ సెల్-ఆధారిత చికిత్స వంటి కొన్ని ప్రయోగాత్మకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి లభ్యత భిన్నంగా ఉంటుంది మరియు పార్కిన్ సన్స్ వ్యాధి గల వ్యక్తులకు చాలా చికిత్సలు అందుబాటులో లేవు.
ఏయే డ్రగ్స్ మరియు చికిత్సలు ఉపయోగించబడతాయి?
పార్కిన్ సన్ వ్యాధి కోసం మందుల చికిత్సలు ప్రత్యక్షమైనవిగాలేదా లక్షణాలు కలిగినవిగా వర్గీకరించబడ్డాయి. ప్రత్యక్ష చికిత్స పార్కిన్ సన్స్ వ్యాధి కోసం ఉద్దేశ్యించబడింది. లక్షణాల చికిత్సలు కేవలం పరిస్థితి యొక్క నిర్దేశిత అంశాలకు ఉద్దేశ్యించబడ్డాయి.
మందులు
పార్కిన్ సన్ వ్యాధి మందులు వివిధ రకాలుగా పని చేస్తాయి. ఫలితంగా, మందులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఈ క్రింది విధంగా పని చేస్తాయి:
పార్కిన్ సన్ వ్యాధి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను పరిష్కరించడానికి పలు డ్రగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రింది లక్షణాలకు తరచుగా చికిత్స చేయబడతాయి:
చికిత్సలకు వ్యతిరేక ప్రభావాలు లేదా సమస్యలు ఉండవచ్చు.
పార్కిన్ సన్ వ్యాధి చికిత్సలు యొక్క దుష్ప్రభావాలు మరియు పర్యవసానాలు, అనారోగ్యం తీవ్రత, మీకు గల పైకి కనిపించని ఆరోగ్య సమస్యలు మరియు ఇతర అంశాలను మందులు నిర్ణయిస్తాయి. రావడానికి అవకాశమున్న ప్రభావాలు, పర్యవసానాలు గురించి మీకు మరింత చెప్పడానికి మీ డాక్టర్ మీకు ఉత్తమమైన వ్యక్తి. మీ జీవితంలో ఆ దుష్ప్రభావాలు లేదా సమస్యలు యొక్క ప్రభావాన్ని ఏ విధంగా తగ్గించాలో కూడా వారు మీకు సలహా ఇస్తారు.
నేను నా డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి లేదా వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి ?
సూచించిన విధంగా లేదా లేదా మీరు మీ లక్షణాలలో లేదా డ్రగ్ సామర్థ్యంలో మార్పులు గుర్తిస్తే మీరు మీ డాక్టర్ ,ప్రాక్టీషనర్ ను చూడాలి. మందులు మరియు మోతాదులో మార్పులు ఏ విధంగా పార్కిన్ సన్ వ్యాధి ప్రభావాన్ని మీ జీవితంలో గణనీయమైన తేడా చూపించగలవు.
అత్యవసర గదికి నేను ఎప్పుడు వెళ్లాలి.
మీరు ఆసుపత్రికి వెళ్లి వైద్యసహాయం తీసుకోవాలని సూచించే లక్షణాలు లేదా చిహ్నాలు గురించి సమాచారాన్ని మీ డాక్టర్ మీకు సలహా ఇవ్వగలరు మరియు సమాచారం కేటాయించవచ్చు. సాధారణంగా, మీరు పడిపోతే, మీరు వైద్య సహాయం కోరుకోవాలి, ప్రత్యేకించి మీరు స్ప్రహ కోల్పోతే లేదా మీ తల, మెడ, ఛాతీ, వీపు లేదా కడుపుకు గాయం కలిగితే ఇటువంటి సలహా లేదా సూచన అందచేస్తారు.
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.