WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
ఆంటీరియర్ క్రుసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) సర్జరీలో లిగమెంట్ పునర్నిర్మాణం లేదా బాగు చేయడంతో ప్రమేయాన్ని కలిగి ఉంది. ఊర్విక మరియు టిబియాలను కలిపే ఏసీఎల్ మోకాలు యొక్క కీలకమైన సున్నితమైన కణజాలం యొక్క భాగం. ఏసీఎల్ పూర్తిగా లేదా పాక్షికంగా అథ్లెట్స్ లో తరచుగా దెబ్బతింటుంది. పూర్తి ఈసీఎల్ గాయాలను తరచుగా క్రీడా వైద్య డాక్టర్స్, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఏసీఎల్ పునర్నిర్మాణం ఆపరేషన్ తో చికిత్స చేస్తారు. దీనిలో భాగంగా అసలు ఏసీఎల్ ను పోలి ఉండే టిష్యూ గ్రాఫ్ట్ తో చినిగిన లిగమెంట్ మార్చబడుతుంది. అయితే, ఓమ్నీలో మేము ఏసీఎల్ గాయాలను అంతర విభాగం విధానం ఉపయోగించి చికిత్స చేస్తాము. దీనిలో రేడియాలజిస్ట్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, క్రీడా వైద్యం చేసే డాక్టర్స్, ఫిజియాట్రిస్ట్స్ ప్రతి రోగి కోసం సరైన చర్య తీసుకోవడానికి కలిసి పని చేస్తారు.
ఓమ్నీలో మా డాక్టర్స్ మరియు సర్జన్స్ రోగి స్వల్పకాలిక , దీర్ఘకాలిక ఫలితాలను మెరుగుపరచడానికి నిరంతరంగా పరిశోధనా ఏసీఎల్ సర్జరి పద్ధతులను పరిశోధన చేస్తారు. ఎందుకంటే ఏసీఎల్ గాయం కలిగిన వారు అలాంటి గాయం లేని వారితో పోల్చినప్పుడు తమ జీవితంలో మోకాలిలో ఆస్టియోఆర్థ్రైటిస్ ను కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
ఏసీఎల్ సర్జరీ అవసరమని ఏ విధంగా తెలుసుకోవాలి?
ఏసీఎల్ టియర్ తీవ్రత మరియు రోజి జీవనశైలిలు సర్జరీ అవసరమా కాదా అని నిర్ణయిస్తాయి. పూర్తిగా చినిగిన ఏసీఎల్ సొంతంగా కోలుకోదు. అయితే, కొంతమంది ప్రజలలో పాక్షికంగా ఏసీఎల్ చినిగితే, సర్జరీ అవసరం లేకుండా దానంతట అదే లిగమెంట్ సొంతంగా కోలుకోవచ్చు.
ఏసీఎల్ టియర్స్ ( పూర్తిగా మరియు పాక్షికంగా):
టియర్ పాక్షికమా లేదా పూర్తిగా చినిగిందా అని గుర్తించడానికి డాక్టర్ రెండు మేన్యువల్ పరీక్షలు నిర్వహిస్తారు.
పాక్షికంగా చినిగిన రోగులకు సర్జరీ చేయడంలో జాప్యం చేసి, లిగమెంట్ పూర్తిగా బాగయ్యేంత వరకు వేచి ఉండి సర్జరీ నిర్వహించాలని సలహా ఇవ్వబడుతుంది.
ఏసీఎల్ పూర్తిగా చినిగినప్పుడు రోగులు తాము ఇంతకు ముందు పనులు చేసుకున్న విధంగా వీలు కల్పించడానికి మరియు మరింతగా గాయం కలగకుండా నివారించడానికి సర్జరీ కావాలి. ఇది పోటీలో పాల్గొనే అథ్లెట్స్ కోసం ప్రత్యేకించి నిజం. నాన్ సర్జికల్ చికిత్స కొంతమంది సీనియర్ వ్యక్తులకు లేదా ఏసీఎల్ అదే విధంగా ఉండి తమ నిత్యకృత్యాలు మళ్లీ చేయడానికి అలసటతో కూడిన వ్యాయామాలు లేని జీవన శైలులు కలిగిన వారికి వీలు కల్పించవచ్చు .
ఏసీఎల్ పూర్తిగా దెబ్బతిని, నిబంధనలు లేని పనులను మళ్లీ ఆరంభించిన వారికి మోకాలిలో కొంత అస్థిరత ఉండవచ్చు. వారికి లోపల మెనిస్కస్ బాగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోకాలి కీలు వద్ద కలుసుకునే ఎముకలు మధ్య కార్టిలేజ్ మెనిస్కస్ కుషన్ వలే పని చేస్తుంది. ప్రతి మోకాలుకు రెండు మెనిస్కిలు ఉంటాయి: పార్శ్వపు మెనిస్కస్ మోకాలి బయట ఉటుంది, మీడియల్ మెనిస్కస్ లోపల ఉంటుంది. గాయపడిన మెనిస్కస్ మోకాలిలో నొప్పిని కలిగిస్తుంది, అప్పుడప్పుడు నీరు చేరుతుంది. కానీ మరింత ప్రధానంగా, చినిగిన లేదా విరిగిన మెనిస్కస్ రోగికి అంతిమంగా మోకాలిలో ఆస్టియోఆర్థ్టైటిస్ కలిగే అవకాశం ఉంటుంది.
ఏసీఎల్ సర్జరీని ఎప్పుడు చేయించుకోవాలి:
మొత్తం ఏసీఎల్ టియర్ కు పునఃనిర్మాణ సర్జరి సాధారణంగా ప్రమాదం జరిగిన మూడు నుండి ఆరు వారాలకు ప్రణాళిక చేయబడుతుంది. ఇది స్థానికంగా కలిగిన వాపు తగ్గిపోవడానికి వీలు కల్పిస్తుంది. సర్జరీ చేయించుకున్న రోగులకు కూడా తీవ్రమైన స్కారింగ్ రియాక్షన్ గా పిలువబడే ఆర్థ్రో ఫైబ్రోసిస్ త్వరలోనే కలగవచ్చు.
మొదటగా పరిష్కరించవలసిన తదుపరి కలిగిన గాయాలు ఉన్నప్పుడు, రోగికి ఉన్న నొప్పి స్థాయి, రోగి కదలిక శ్రేణి, వంచినప్పుడు లేదా కాలి తిన్నగా చాచినప్పుడు రోగి కండరాల నియంత్రణ స్థాయిని బట్టి ఆర్థోపెడిక్ డాక్టర్స్ రీకనస్ట్రక్షన్ సర్జరీని నిర్వహించాలని నిర్ణయిస్తారు.
ఒక పరిశోధన ప్రకారం, గాయమైన తరువాత ఏసీఎల్ రీకనస్ట్రక్షన్ సర్జరీని ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువగా ఆలస్యం చేసినట్లయితే వైద్యపరంగా గణనీయమైన ఫలితాన్ని తగ్గిస్తుంది భవిష్యత్తులో అదనపు సవరణ సర్జరీలు రోగికి అవసరమయ్యే అవకాశం పెరుగుతుంది.
ఏసీఎల్ పునః నిర్మాణ సర్జరీలో, రెండు ఆధారాలలో ఒక దాని నుండి రీప్లేస్మెంట్ కణజాలం యొక్క గ్రాఫ్ట్ కొత్త ఏసీఎల్ ను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది:
ఏసీఎల్ పునఃనిర్మాణ సర్జరీని సాధించడానికి ఫైబర్ ఆప్టిక్స్, చిన్న కోతలు, చిన్న డివైజ్ లు కలపడం ద్వారా, మినిమల్లీ ఇన్ వేజివ్ ఆర్థ్రకోస్కోపిక్ ప్రక్రియలు ఉపయోగించబడతాయి. కణజాలం గ్రాఫ్ట్ ను కొంచెం పెద్ద గాటు ద్వారా పొందాలి. ఏసీఎల్ సర్జరీ అనేది అవుట్ పేషంట్ (అంబులేటరి) ఆపరేషన్ అవడం వలన, రోగుల ప్రొసీజర్ పూర్తయిన తరువాత అదే రోజు రోగులు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లడానికి వీలు కల్పిస్తంది.
ఏసీఎల్ సర్జరీ నుండి కోలుకోవడానికి ఎంత సమయం కావాలి?
పోటీ మరియు పని రకం తీవ్రతను బట్టి, ఏసీఎల్ ను బాగు చేసిన తరువాత క్రీడలలో మళ్లీ పాల్గొనడానికి సాధారణంగా రోగికి ఆరు నుండి తొమ్మిది నెలల సమయం కావాలి.
సర్జరీ రోజు, రోగులు క్రచెస్ మరియు కాలికి బ్రేస్ ని ఉపయోగించి నడవగలరు. సర్జరీ తరువాత, మోకాలు తన శక్తి, స్థిరత్వం , కదిలే శ్రేణిని మళ్లీ పొందడానికి రోగులు చాలా త్వరగా పునరావాస కార్యక్రమంలో నమోదు చేయబడతారు. పునరావాస ప్రక్రియలో వ్యాయామాల సీరీస్ ఉపయోగించబడతాయి:
నయమయ్యే ప్రక్రియ సమయంలో ఆరంభంలో, శక్తివంతం చేయడం మరియు కదలిక కార్యక్రమాల శ్రేణి ఆరంభమవుతుంది. నాలుగు నెలల సమయంలో పరిగెత్తడానికి వ్యాయామాలు ఆరంభమవుతాయి.
ఏసీఎల్ పునరుద్ధరణను నిర్వహించడానికి సంప్రదాయబద్ధమైన పద్ధతి ఓపెన్ సర్జరీతో పోలిస్తే, ఆర్థ్రోస్కోపిక్ సర్జికల్ ప్రొసీజర్స్ కోలుకునే ప్రక్రియను సులభం చేసాయి మరియు వేగవంతమయ్యాయి. కానీ సంతృప్తికరమైన ఫలితం పొందడానికి, రోగి అర్హత కలిగిన ఫిజికల్ థెరపిస్ట్ యొక్క సన్నిహితమైన పర్యవేక్షణలో పునరావాసం తీసుకోవడం మరియు సర్జన్ తో ఫాలో-అప్ సెషన్స్ గురించి ప్రణాళిక చేయడం రోగికి ప్రధానం.
దెబ్బతిన్న ఏసీఎల్ సాధారణగా తిరిగి జోడించబడదు లేదా బాగవదు. ఏసీఎల్ సర్జరీ సమయంలో లిగమెంట్ తరచుగా పూర్తిగా పునర్నిర్మించబడుతుంది. ఏసీఎల్ దెబ్బతిన్నప్పుడు సర్జికల్ గా చికిత్స చేయడానికి ప్రస్తుతమున్న ప్రమాణం ఏసీఎల్ పునర్నిర్మాణ టెక్నిక్. ఏసీఎల్ దెబ్బతిన్నందుకు తప్పు సర్జికల్ విధానం ఎంచుకోవడం వలన దీర్ఘకాల ఫలితాలు ఎదుర్కోవాలి కాబట్టి సరిగ్గా ఏసీఎల్ సర్జరీని చేయాలి.
ఏసీఎల్ పునరుద్ధరణ సర్జరీలో విధాలు
ఏసీఎల్ ను పునర్నిర్మించడంలో కొన్ని ప్రాధమికమైన దశలు ఉన్నాయి కానీ వివిధ కేసులలో అవి గణనీయంగా మారవచ్చు:
టీనేజర్స్ ఏసీఎల్ పునరుద్ధరణ సర్జరీని చేయించుకోవచ్చా?
యువ అథ్లెట్స్ ఏసీఎల్ పునరుద్ధరణ సర్జరీని ఇప్పుడు చేయించుకుంటున్నారు, ఇటీవలి వైద్య పురోగతికి ధన్యవాదాలు, ఇప్పటికీ ఎదుగుతున్న యువ రోగులకు వయోజనులు లేదా కొంచెం ఎక్కువ వయస్సు గల యుక్తవయస్కులకు అదే రకమైన ఏసీఎల్ సర్జరీ అవసరం లేదు.
ఎక్కువ వయస్సు గల టీనేజర్స్ పై సాధారణ ఏసీఎల్ పునరుద్ధరణ ప్రక్రియను విజయవంతంగా చేయవచ్చు. అయితే, ఎదుగుతున్న యువత పై ఏసీఎల్ పునర్నిర్మాణ సర్జరీ చేయడం సవాలుతో కూడినది. ఎందుకంటే వయోజనులు కోసం ఉపయోగించే ప్రామాణిక టెక్నిక్ ఓపెన్ గ్రోత్ ప్లేట్స్ కి హాని కలిగించవచ్చు, ఇది కాళ్లు పొడవు సమానంగా లేకపోవడానికి లేదా అసాధారణాలకు దారితీయవచ్చు. ఫలితంగా, గతంలో, డాక్టర్స్ యుక్తవయస్కులు ఎదగడం పూర్తయ్యేంత వరకు ఏసీఎల్ సర్జరీని వాయిదా వేసేవారు లేదా సక్రమంగా లేని అనటామికల్ సర్జికల్ పద్ధతులు ఉపయోగించేవారు.
అయితే, సర్జికల్ పద్ధతులలో మెరుగుదలలు ఇప్పుడు టీనేజర్స్ మరియు కొంచెం పెద్ద వయస్సు గల పిల్లల్లో ఏసీఎల్ టియర్ కు చికిత్స చేయడానికి ఆప్షన్స్ శ్రేణిని అందిస్తాయి.
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.